అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయంగా ఎప్పుడు ఏది అవసరమైతే మీరు అదే చేస్తారు: చంద్రబాబుకు కేవీపీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రత్యేక హోదా అంసంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు ఆదివారం లేఖ రాశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మీకు మళ్లీ రాష్ట్రం, ప్రజలు గుర్తుకు వచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పోరాటాన్ని ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వివరించారు.

ప్రత్యేక హోదాకు తానే ప్రతినిధి అన్నట్లుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు అంటూ చంద్రబాబు కొత్త మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు హోదా అంశాన్ని సజీవంగా ఉంచి పోరాడిందే కాంగ్రెస్ అన్నారు. రాజకీయంగా అప్పటికి అఫ్పుడు ఏది అవసరమో చంద్రబాబు అదే చేశారని విమర్శించారు.

మీరంతా రావాల్సిందే: చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు షాక్, ఆ ముగ్గురికి రిలీఫ్మీరంతా రావాల్సిందే: చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు షాక్, ఆ ముగ్గురికి రిలీఫ్

KVP Ramachandra Rao letter to AP CM Chandrababu over special status issue

జగన్, మోడీపై చంద్రబాబు

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, ఆ పార్టీ నేతలు శాసన సభకు రాకుండా జీతాలు తీసుకుంటారని, చట్ట సభకు రావాలని ప్రజలు ఓట్లు వేస్తే సభకు రాకుండా బీజేపీతో లాలూచీ పడ్డారని, నరేంద్ర మోడీకి భయపడి ఆయనకు ఊడిగం చేసే పరిస్థితికి ప్రతిపక్షం వచ్చిందని చంద్రబాబు శనివారం మండిపడ్డారు.

ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలను నెరవేర్చలేదని కేంద్రంపై తాను పోరాటం చేస్తుంటే, వైసీపీ నాయకులు మోడీకి సహకరిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు. తనను విమర్శించే వైసీపీ నాయకులు మోడీని ఎందుకు నిలదీయడం లేదన్నారు. మోడీ ఆసక్తి మీదే రిలయన్స్‌ సంస్థకు రాఫెల్‌ డీల్‌ ఇప్పించామని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు చెప్పారని, దీంతో ఇంతవరకూ మోడీ చెప్పిన మాటలు అబద్ధాలని తేలిపోయిందని, ఈ విషయంలో జాతికి మోడీ క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

English summary
Congress leader and MP KVP Ramachandra Rao letter to AP CM Chandrababu Naidu over special status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X