వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ ఉన్నప్పుడే అనుమతులు.. చంద్రబాబుది అసత్య ప్రచారం: పోలవరంపై కేవీపీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు అసత్య ప్రచారాలకు పూనుకున్నారని ఆరోపించారు.

హోదా ఇవ్వాల్సిందే: రాష్ట్రపతికి కేవిపి లేఖ.. చంద్రబాబును ఏకేసి..హోదా ఇవ్వాల్సిందే: రాష్ట్రపతికి కేవిపి లేఖ.. చంద్రబాబును ఏకేసి..

Recommended Video

Polavaram Project : కేవీపీ పిటిషన్‌ : కేంద్రం, బాబు కు చెక్ !

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని కేవీపి గుర్తుచేశారు. గతంలో పోలవరంపై చంద్రబాబు ఎన్నడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు.

kvp ramachandra rao takes on chandrababu naidu over polavaram project

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేవీపీ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాలువలు తవ్వితే.. కోర్టుకు వెళ్లి చంద్రబాబు 'స్టే' తీసుకొచ్చారని గుర్తుచేశారు. రాజకీయంగా జన్మనిచ్చిన ఇందిరను, పునర్జన్మనిచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు.

స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. 2019నాటికే గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామని చెప్తున్న చంద్రబాబు.. రూ. 1800 కోట్లతో పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారని కేవీపీ ప్రశ్నించారు. 2014నాటి అంచనాలతో ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. పోలవరం నిర్మాణం కేంద్రం పర్యవేక్షణలో ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు.

English summary
KVP Ramachandra Rao said that Polavaram project has got all the permissions in YSR period,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X