వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘జల్లికట్టే’ స్ఫూర్తి, మనకా సత్తా లేదా?: చంద్రబాబుకు కేవీపీ ఘాటు లేఖ

తమిళ ప్రజలు నిర్వహించిన జల్లికట్టు ఆందోళనను ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: తమిళ ప్రజలు నిర్వహించిన జల్లికట్టు ఆందోళనను ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఆయన శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఈ మేరకు ఓ లేఖ రాశారు.

ప్రత్యేక హోదా, వెనకబడిన ప్రాంతాలకు నిధులు, విశాఖ రైల్వే జోన్ తదితర అంశాలపై తమిళుల తరహా పోరాటం చేయాలని కేవీపీ పేర్కొన్నారు. ఈ పోరాటానికి చంద్రబాబు నాయకత్వం వహిస్తే మంచిదని అన్నారు.

KVP writes a letter to Chandrababu

చంద్రబాబు ముందుకొస్తే అన్ని రంగాలు, వర్గాలు ముందుకొస్తాయని చెప్పారు. సుప్రీంకోర్టే జల్లికట్టును వద్దని చెప్పినా.. తమిళులు పట్టుబట్టి మూడ్రోజుల్లో ఆర్డినెన్స్ తెప్పించుకున్నారని కేవీపీ గుర్తు చేశారు.

మనం రాష్ట్రం కోసం ఆ మాత్రం చేయలేమా? అని కేవీపీ నిలదీశారు. 9,10 షెడ్యూల్లోని ఆస్తుల విభజన కోసం పోరాడదామని అన్నారు. మనలో ఐకమత్యం లేదా చిత్తశుద్ధి లేదా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

English summary
Congress MP KVP Ramachandra Rao on Saturday wrote a letter to AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X