వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబూ! ఇది మీకు మంచి ఛాన్స్: కేవీపీ లేఖ, మోడీపై నిప్పులు

ఈ నెల 23వ తేదీన నీతి అయోగ్ సమావేశం జరగనుందని, ప్రత్యేక హోదాపై అడిగేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఇది మంచి అవకాశమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఈ నెల 23వ తేదీన నీతి అయోగ్ సమావేశం జరగనుందని, ప్రత్యేక హోదాపై అడిగేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఇది మంచి అవకాశమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు అన్నారు. ఈ మేరకు ఆయన 4 పేజీల బహిరంగ లేఖ రాశారు.

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనేక రకాల కారణాలు చెబుతోందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని మోడీ ప్రభుత్వం నిర్ణయించుకున్నదని చెప్పారు. కేంద్రం చెప్పే కారణాలు సహేతుకమైనవి కావని చెప్పారు.

<strong>అవినాశ్‌ను ఎమ్మెల్యేగా చూడాలనుకున్న నెహ్రూ: బోరుమన్న లక్ష్మీప్రసన్న</strong>అవినాశ్‌ను ఎమ్మెల్యేగా చూడాలనుకున్న నెహ్రూ: బోరుమన్న లక్ష్మీప్రసన్న

హోదా కోసం కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదాకు ఆర్థిక ప్యాకేజీ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. నీతి అయోగ్ భేటీలో హోదా సాధించేందుకు అద్భుత అవకాశమన్నారు. చంద్రబాబు దానిని ఉపయోగించుకోవాలన్నారు.

KVP writes open letter to AP CM Chandrababu

కేంద్రం ఏపీ పట్ల ఎందుకు వివక్ష చూపిస్తుందో అర్థం కావడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్రంలోని మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తిరుమల సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలని ఒత్తిడి తేవాలన్నారు.

14వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాకు సంబంధం లేది చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకుంటున్న టిడిపి ఎందుకు మౌనం వహిస్తుందో చెప్పాలన్నారు. మీ మనస్సాక్షిని నిద్రలేపి, హోదాను సాధించాలన్నారు.

English summary
Congress Party Rajya Sabha MP KVP Ramachandra Rao on Tuesday wrote a letter to AP CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X