• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా అనుకొన్న వాళ్ళను దూరం చేశాడు, యువతి సూసైడ్ లెటర్

By Narsimha
|

ఏలూరు : దేవుడు ప్రతి సారి నాకు అన్యాయం చేశాడు. నేను కోరుకొన్నది ప్రతిదీ దక్కకుండా చేశాడు.నా అనుకొన్న వాళ్ళందరినీ దూరం చేసుకొన్నాను. ఇక బతకడం వ్యర్థం అని భావించాను,. అందుకే ఆత్మహత్య చేసుకొంటున్నాను అంటూ ఓ యువతి రాసిన సూసైడ్ లెటర్ కన్నీరు పెట్టిస్తోంది. బతికున్న రోజుల్లో ఏ రకంగా మానసిక సంఘర్షణను అనుభవించింది. ప్రేమ విషయంలో ఎలా మోసపోయిందో వివరంగా లేఖ రాసింది.తాను కోరుకొన్నవన్నీ దూరమై బతకడం ఇష్టం లేక చనిపోతున్నాని లేఖ రాసింది. తాను చనిపోతున్నందుకు తనను క్షమించాలని కోరుకొంది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆర్ ఆర్ పేట గంగానమ్మ గుడి ఎదురుగా ఉన్న వీధిలో నడిపూడి పాపానాయుడు, పద్మ దంపతులు నివాసం ఉంటారు. పాపానాయుడు జూట్ మిల్లు కార్మికుడుగా పనిచేస్తున్నాడు. వీరికి దీపిక, ఆదిలక్ష్మి అలియాస్ అనూష ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె దీపికకు వివాహమైంది. చిన్న కుమార్తె ఆదిలక్ష్మి డిగ్రీ పూర్తి చేసింది. ఏలూరులోని తంగెళ్ళమూడి ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.

అనూష టీచర్ గా పనిచేసే సమయంలో తన ఇంటికి సమీపంలో ఉన్న బాలాజీ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరి కులాలు వేరు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. కులాలు వేరైనా అనూష ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించారు. బాలాజీ అనూషను వివాహం చేసుకోకుండా వేరే యువతిని వివాహం చేసుకొన్నాడు. మరో యువతితో వివాహమైనా అనూషతో ప్రేమాయణం కొనసాగించాడు.

 lady committed sucide in eluru

అందరికీ దూరమయ్యాను...

ప్రేమించానని చెప్పాడు. జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పాడు. వేరే యువతిని వివాహం చేసుకొన్నాడు బాలాజీ, అయినా వివాహం అయిన తర్వాత కూడ అనూషతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. పైగా ఆమెను అనుమానించాడు. అవమానపరిచాడు. ఇంకా ఆమెను భ్రమల్లో ఉంచాడు. ఇవన్నీ భరించింది. బాలాజీ కోసం ఆమె అందరికీ దూరమైంది. కాని, అతనిలో మార్పు రాలేదు. దీంతో మనోవేదనకు గురైన అనూష ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకొంది.

ఆదివారం మద్యాహ్నం తల్లి వనబోజనాలకు వెళ్ళింది. తండ్రి పాపానాయుడు జూటు మిల్లులో పనికి వెళ్ళాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అనూష ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. తన చావుకు తానే కారణమని లేఖ రాసింది.

మానసిక సంఘర్షణకు గురైన అనూష

ప్రేమ విషయంలో బాలాజీ ఆమెను ఇబ్బందులకు గురిచేశాడని ఆమె తన లేఖలో చెప్పింది. ఏ రకంగా తాను మానసిక సంఘర్షణకు గురైందో ఆ లేఖలో వివరించింది. చిన్న తనం నుండి కూడ తాను కోరుకొన్నవి ఏ రకంగా దక్కకుండా దూరమయ్యాయో వివరించింది. ప్రేమ కోసం అందరికీ దూరమయ్యాయని ఆమె ఆవేదన చెందింది. తల్లిదండ్రులు, తోబుట్టువు ప్రేమను దూరం చేసుకొన్నానని ఆ లేఖలో తన బాధను వ్యక్తం చేసింది. ప్రేమ కోసం తప్పులు చేశానని , అంతేకాదు ఇతరులకు బాదపెట్టానని ఆమె లేఖలో రాసింది. ఏ జన్మలో తప్పు చేశానో, పాపం చేశానో అర్థ: కాలేదు. ఈ జన్మలో అనుభవిస్తున్నానని ఆమె ఆ లేఖలో రాసింది. బాలాజీని తాను ప్రాణం కంటే అధికంగా ప్రేమించానని, అతను తనను ప్రేమించాడో లేదో తెలియదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.వేరే అమ్మాయితో వివాహం చేసుకొన్నా తనను కావాలని బాలాజీ భావించాడు.

కాని, అనుక్షణం నన్ను అనుమానించాడు, అవమానించాడు. చావైనా బతుకైనా బాలాజీతోనే అనుకొన్నా కాని, తను నన్ను అర్థం చేసుకోలేదని అనూష మనో వేదనను లేఖలో రాసింది. చదువుతో పాటు తాను కోరుకొన్న వాటినన్నింటిని దేవుడు తనకు దూరం చేశాడు. చివరకు ప్రేమను కూడ దూరం చేశాడు, తాను అనుకొన్నవాళ్ళంతా దూరమయ్యారని ఆమె తన బాధను ఆ లేఖలో బయటపెట్టింది. అందరినీ దూరం చేసుకొని బతకడం అవసరం లేదని భావిస్తున్నానని చెప్పింది. తనను క్షమించాలని కోరింది.

English summary
anusha working as a teacher in a private school in eluru , she love balaji near her residence. balaji cheting her, he married another girl recently. he wants to anusha love also, he contiues his love affair with anusha. but he suspect everysecond. so she comitted sucide on sunday. how she feel lonely, how she struggle for balaji love, how she far away from her parents love , wrote in sucide letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X