విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లెటర్ ఇస్తావా?...శాల్తీ గల్లంతు చేయనా?...లేడీ విఆర్వోకి టిడిపి నేత బెదిరింపులు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: విశాఖలో జిల్లాలో ఒక మహిళా విఆర్వోపై టిడిపి నేత దౌర్జన్యానికి, బెదిరింపులకి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నేరం చెయ్యడమే కాకుండా తాను తప్పు చెయ్యలేదంటూ లేఖ రాసివ్వమని ఆ మహిళా ఎమ్మార్వోని టిడిపి నేత ఘోరంగా బెదిరిస్తున్నాడు. దీంతో ఆ విఆర్వో తనను బదిలీ చేయాలంటూ పై అధికారులకు ధరఖాస్తు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...

పాయకరావుపేట మండలం గుంటపల్లిలో స్థానిక టిడిపి నేత ఇటీవల వన్యప్రాణులను వేటాడినట్లు ఫిర్యాదులు అందాయి. అయితే ఈ విషయమై విచారణ జరిపి, కేసు నమోదు చేయాల్సిన స్థానిక అటవీ అధికారులు కేసునమోదు చేయకుండా ఆయనతో లాలూచీ వ్యవహరాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం నుంచి బైటపడేందుకు ఆ టిడిపి నేత తాను వన్యప్రాణులను వేటాడలేదని లేఖ రాసివ్వాలని స్థానిక విఆర్వోని అడిగినట్లు తెలిసింది.

అయితే ఆమె అందుకు నిరాకరించగా తాను అడిగినవిధంగా లెటర్ ఇస్తే సరేనని, లేకుంటే శాల్తీ గల్లంతవుతుందని ఆ లేడీ విఆర్వోని బెదిరింపులకు గురిచేశాడు. . దీంతో భయాందోళనకు గురైన ఆ వీఆర్వో తనను అక్కడినుంచి అర్జంటుగా ట్రాన్స్ ఫర్ చెయ్యాలని కోరుతూ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకుంది. దీంతో ఆ టిడిపి నేత బెదిరింపుల పర్వం వెలుగులోకి వచ్చింది.

ఆ మహిళా ఉద్యోగి భర్త ప్రభుత్వ ఉద్యోగి కాగా ఆయన ఇటీవల మృతి చెందడంతో కారుణ్య నియామకం ద్వారా ఈమె విఆర్వో ఉద్యోగంలో చేరినట్లు తెలిసింది. అయితే ఒంటరి మహిళని కూడా చూడకుండా టిడిపి నాయకుడు ఈ విధంగా తీవ్ర స్థాయిలో బెదిరింపులకి పాల్పడటం రెవిన్యూ శాఖలో, స్థానికంగా చర్చనీయాంశం అయింది.

English summary
Visakhapatnam: The atrocities of Telugu Desam Party leaders on government officers are a never ending saga with a new incident coming to light in Visakhapatanm district Payakaraopet mandal. According to local reports, A TDP leader who is accused of poaching case has been threatened to Guntapalli lady VRO for one letter, that he should not make a mistake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X