వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్ ని కలిసిన లగడపాటి.. ఎందుకంటే...

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురువారం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వెళ్లారు. స్వయంగా శుభలేఖ అందజేసి తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురువారం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వెళ్లారు. ఈ నెల 25న లగడపాటి రాజగోపాల్ కుమారుడి వివాహం జరగనుంది.

Recommended Video

జగన్ పాదయాత్ర గందరగోళం : రోజా ఉన్నచోట ఉండవు గా ! Jagan fired on MLA Roja | Oneindia Telugu

ఈ నేపథ్యంలో ఆ వివాహానికి వైసీపీ అధినేత ను ఆహ్వానించే నిమిత్తం వెళ్లిన రాజగోపాల్.. జగన్ కు స్వయంగా శుభలేఖ అందజేసి తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. అయితే, ఈ నెల 6 నుంచి పాదయాత్ర ప్రారంభం కానుండటంతో తాను హాజరుకాలేనని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.

ys-jagan-lagadapati

ఈ సందర్భంగా జగన్, లగడపాటి సుమారు అరగంట పాటు సమావేశమైనట్టు తెలిసింది. ఈ సమావేశంలో జగన్ తో పాటు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు కూడా ఉన్నట్టు సమాచారం. లగడపాటి వెంట తిరువూరు నియోజకవర్గ నేత కావూరి విజయ్ కుమార్ కూడా ఉన్నారు.

English summary
Former MP Lagadapati Rajagopal meet YCP Chief YS Jagan Mohan Reddy here in Lotuspond, Hyderabad on Thursday to invite Jagan to his son's marriage. After taking a wedding card from Rajagopal.. YS Jagan told that he is unable to attend the marriage as his Padayatra is going to start it seems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X