నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘నంద్యాల’ టీడీపీదేనా?: లగడపాటి ఏం చెప్పారంటే..?

మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నంద్యాల ఉపఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో విజయం టీడీపీదేనని జోస్యం చెప్పారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నంద్యాల ఉపఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో విజయం టీడీపీదేనని జోస్యం చెప్పారు.

జగన్ పార్టీ విజయమనడం సరికాదు..

జగన్ పార్టీ విజయమనడం సరికాదు..

బుధవారం సాయంత్రం పోలింగ్‌ ముగిశాక.. ఓటింగ్‌ సరళిపై ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. ఓటింగ్‌ శాతం పెరిగినందున.. ఫలితంలో మార్పు వస్తుందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనడం సరికాదని లగడపాటి అభిప్రాయపడ్డారు.

Recommended Video

Nandyal By-Election : Lagadapati Rajagopal Gives Clarity After Polling | Oneindia Telugu
స్వల్ప మెజార్టీతో టీడీపీనే..

స్వల్ప మెజార్టీతో టీడీపీనే..

పోలింగ్‌ శాతం పెరిగినా.. టీడీపీ 10% ఓట్ల మెజారిటీని సాధిస్తుందని లగడపాటి తెలిపారు. గురువారం నాటికి మెజారిటీపై స్పష్టత వస్తుందన్నారు. నంద్యాలలో 1,73,335 మంది ఓటు వేసినందున.. 17,333 ఓట్ల మెజారిటీ టీడీపీకి రావచ్చన్నారు.

అందుకే ఓటింగ్ శాతం పెరిగింది..

అందుకే ఓటింగ్ శాతం పెరిగింది..

ఆ మెజార్టీ 15 వేలైనా కావొచ్చు.. 20 వేలకైనా రావొచ్చని లగడపాటి తెలిపారు. ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్ఠాత్మకంగాతీసుకున్నందునే పోలింగ్‌ శాతం పెరిగిందని లగడపాటి రాజగోపాల్ అన్నారు.

ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

కాగా, నంద్యాల ఉపఎన్నికను టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా విషయం తెలిసిందే. టీడీపీ అధినేత, సీఎం, చంద్రబాబుతోపాటు మంత్రులు అఖిలప్రియ, పలువురు ఎమ్మెల్యేలు కూడా నంద్యాలలో మకాం వేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రోజా, శిల్పామోహన్ రెడ్డిలు కూడా తమ ప్రచారాన్ని భారీగానే కొనసాగించారు. దీంతో నంద్యాల ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారోననే ఉత్కంఠ నెలకొని ఉంది. విజయం ఎవరిది అని తెలుసుకోవాలంటే ఆగస్టు 28 వరకు ఆగాల్సిందే.

English summary
Former MP Lagadapati Rajagopal responded on Nandyal bypoll issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X