నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆందోళన చెందా కానీ: విభజనపై లగడపాటి, రాజకీయాల్లోకి రానని తేల్చేశారు

రాష్ట్ర విభజన తర్వాత ఇరు ప్రాంతాల మధ్య ద్వేష భావం ఉంటుందని తాను ఆందోళన చెందానని, కానీ ఇరు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని, ఇది సంతోషకరమని లగడపాటి రాజగోపాల్ అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత ఇరు ప్రాంతాల మధ్య ద్వేష భావం ఉంటుందని తాను ఆందోళన చెందానని, కానీ ఇరు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని, ఇది సంతోషకరమని లగడపాటి రాజగోపాల్ అన్నారు.

చదవండి: నంద్యాలపై లగడపాటి జోస్యం

ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. తాను కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పారు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. విభజన తర్వాత ద్వేష భావం ఉంటుందనుకున్న తన అంచనాలు తప్పయ్యాయన్నారు.

Lagadapati Rajagopal says he is happy after state divide

రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి మెలిసి ముందుకు సాగడం ఆనందంగా ఉందని లగడపాటి చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయమని కూడా ఆయన చెప్పారు. ఉప ఎన్నికలపై తాను ఎలాంటి విశ్లేషణ చేయదల్చుకోలేదన్నారు.

English summary
Former Vijayawada MP Lagadapati Rajagopal on Thursday said that he is happy after state divide. He said he will not enter into politics in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X