వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగడపాటి నుంచి రాజమౌళి దాకా.. వైయస్ జగన్‍‌ను ఇరుకునపడేశారా?

నంద్యాల, కాకినాడ ఎన్నికల ఓటమి ఉప ఎన్నికలు వైసిపికి షాకిచ్చాయి. ఎన్నికల ఫలితాలతో పాటు పలువురు నేతలు, ప్రముఖులు కూడా వైసిపికి షాకిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల, కాకినాడ ఎన్నికల ఓటమి ఉప ఎన్నికలు వైసిపికి షాకిచ్చాయి. ఎన్నికల ఫలితాలతో పాటు పలువురు నేతలు, ప్రముఖులు కూడా వైసిపికి షాకిస్తున్నారు.

వైసిపి ఎందుకు స్థాపించారంటే, సవాల్: జగన్‌పై దేవినేని సంచలనంవైసిపి ఎందుకు స్థాపించారంటే, సవాల్: జగన్‌పై దేవినేని సంచలనం

చంద్రబాబును అలా టార్గెట్ చేసిన వైసిపి

చంద్రబాబును అలా టార్గెట్ చేసిన వైసిపి

చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకునేందుకు ప్రతిపక్షం రాజధాని అమరావతిని కూడా పలుమార్లు లేవెనెత్తుతోంది. రాజధాని నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని చెబుతూ, అందుకు తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను ఉదాహరణగా చెబుతోంది.

జగన్ చాంబర్లోకి నీరు

జగన్ చాంబర్లోకి నీరు

ఇటీవల వర్షాలకు అసెంబ్లీ భవనంలోని తమ అధినేత జగన్ చాంబర్‌లోకి నీరు రావడంపై వైసిపి తీవ్ర విమర్శలు చేసింది. రాజధానిలో అవినీతికి ఇదే నిదర్శనమని చెప్పింది. కానీ గత కొద్ది రోజులుగా సచివాలయాన్ని సందర్శిస్తున్న పలువురు నేతలు మాత్రం ప్రశంసించడం గమనార్హం.

రాజమౌళి మెచ్చుకోలు

రాజమౌళి మెచ్చుకోలు

మాజీ పార్లమెంటు లగడపాటి రాజగోపాల్ మొదలు నిన్న ప్రముఖ దర్శకులు రాజమౌళి వరకు సచివాలయ నిర్మాణంపై ప్రశంసలు కురిపించారు. ఇది ఓ విధంగా వైసిపి జీర్ణించుకోలేని అంశమేనని అంటున్నారు.

జగన్‌ను ఇరికించారా?

జగన్‌ను ఇరికించారా?

వైసిపి నేతలు ఏ సచివాలయం పైన అయితే విమర్సలు చేస్తున్నారో, అదే భవనాన్ని లగడపాటి రాజగోపాల్, కాంగ్రెస్ నేత జెడి శీలం, దర్శకులు రాజమౌళి మెచ్చుకున్నారు. ఇది ప్రతిపక్షాన్ని ఇరుకున పడేసే విషయమే అంటున్నారు. అయితే, లగడపాటి నుంచి రాజమౌళి దాకా మాట్లాడింది భవనం పైపై మెరుగుల గురించి మాత్రమేనని, వైసిపి నేతలు మాత్రం నిర్మాణంలో నాణ్యత గురించి మాట్లాడుతున్నారనే వారు లేకపోలేదు.

English summary
Former MP Lagadapati Rajagopal and director Rajamouli praised Velagapudi Secretariate building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X