వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే జ‌రిగితే..అందులోనూ సన్యాసమే: నా విశ్వ‌స‌నీయ‌త‌కు ఇదే కీల‌కం: ఏపీ ఫ‌లితాల‌పై ల‌గ‌డ‌పాటి..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Exit Polls 2019 : నా విశ్వ‌స‌నీయ‌త‌కు ఇదే కీల‌కం.. ఏపీ ఫ‌లితాల‌పై ల‌గ‌డ‌పాటి..! || Oneindia Telugu

జాతీయ స‌ర్వేల‌కు భిన్నంగా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల పైన ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల చేసిన ల‌గ‌డ‌పాటి..కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. త‌న స‌ర్వే గురించి సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. త‌న ఫ‌లితాలు నిజ‌మ‌వుతాయ‌ని..అలా కాకుంటే ఇవే తాను చేసే చివరి ఎగ్జిట్ పోల్స్ అని స్ప‌ష్టం చేసారు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల అంచ‌నాలో విఫ‌ల‌మైన త‌రువాత..ఏపీలో చెప్పిన‌వ త‌ప్ప‌యితే..అది త‌న విశ్వ‌సీయ‌త దెబ్బ తీస్తుంద‌ని..ఇక ఏం చెప్పినా ఎవ‌రు న‌మ్మ‌ర‌ని వ్యాఖ్యానించారు. దీంతో..ఇప్పుడు 23న వెల్ల‌డ‌య్యే ఫ‌లితాలు ల‌గ‌డ‌పాటి కొన‌సాగాలా..లేక స‌ర్వేల్లోనూ స‌న్యాసం తీసుకోవాలా అనే విష‌యం తేలిపోనుంది..

అంచ‌నాలు మాత్ర‌మే అంటూ..
ఎగ్జిట్ పోల్స్ అంటూ అంకెల‌తో స‌హా ఏపీలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారో వివ‌రించిన ల‌గ‌డ‌పాటి అదే స‌మ‌యంలో వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. జాతీయ స‌ర్వేల‌కు భిన్నంగా ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పిన ల‌గ‌డపాటి త‌న‌వి అంచ‌నాలు మాత్ర‌మేన‌ని..తాను ఈవిఎంల్లో తొంగి చూడ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న అంచ‌నాలు అటు ఇటు అయ్యే అవ‌కాశం లేకపోలేద‌న్నారు. వైసీపీ గ‌ట్టి పోటీ ఇచ్చింద‌ని చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో గ‌తంలో తాను తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పిన అంచనాలు ఫెయిల్ అయ్యాయ‌ని..ఇప్పుడు ఏపీ విష‌యంలో చెప్పిన అంచనాలు 23న నిజం అవుతాయ‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. ఏపీ ఫ‌లితాలు త‌న విశ్వ‌సీయ‌త‌తో ముడి ప‌డి ఉన్నాయ‌ని వివ‌రించారు. ఈ ఫ‌లితాలు నిజం కాకుంటే..తాను స‌ర్వేలు మానేస్తాన‌ని స్ప‌ష్టం చేసారు.

ఏపీలో టీడీపీకే ప‌ట్టం: వ‌ంద సీట్లతో అధికారం..వైసీపీకి 72..జ‌న‌సేన‌కు 3 : ల‌గ‌డ‌పాటి ఎగ్జిట్ పోల్స్ ఏపీలో టీడీపీకే ప‌ట్టం: వ‌ంద సీట్లతో అధికారం..వైసీపీకి 72..జ‌న‌సేన‌కు 3 : ల‌గ‌డ‌పాటి ఎగ్జిట్ పోల్స్

Lagadapati ready to leave surveys in his exit polls fail in AP results..

ల‌గ‌డ‌పాటిది ప‌లాయ‌వాదం...
ల‌గ‌డ‌పాటి ఇటువంటి స‌ర్వే ఫ‌లితాల‌ను బ‌ట‌య పెడ‌తార‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వైసీప అధినేత జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ల‌గ‌డ‌పాటి పేరు ప్ర‌స్తావించి మ‌రీ చెప్పారు. ఇక‌, ఇప్పుడు ల‌గ‌డ‌పాటి చెబుతున్న లెక్క‌ల్లో ఆయ‌న‌లోనే ధీమా క‌నిపించ‌టం లేద‌ని వైసీపీ నేత‌లు వాదిస్తున్నారు. తాను అంచ‌నాలు మాత్ర‌మే చెబుతున్నాన‌ని..ఇవిఎంల్లో తొంగి చూడ‌లేద‌ని చేస్తున్న వ్యాఖ్య‌లతో ఆయ‌న ప‌లాయ‌వాదం స్ప‌ష్టం అవుతుంద‌ని వైసీపీ ఆరోపిస్తోంది. ఆయ‌న టీడీపీనేత‌ల‌తో క‌లిసి ముందు రోజు మీడియా స‌మావేశానికి వ‌చ్చార‌ని..మ‌రి, ఆయ‌నకు ఏ పార్టీతో సంబంధం లేద‌ని ఎలా చెబుతార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే, ల‌గ‌డ‌పాటి మ‌త్రం త‌న సర్వేను నమ్మాలని తాను ఎవరినీ కోరడంలేద‌న్నారు. బల్లగుద్ది అస్సలే చెప్పట్లేదు...కత్తిపెట్టి ఇది వినండని నేనేం అనలేదు. వినేవాళ్లు వింటారు. నమ్మేవాళ్లు నమ్ముతారు అంటూ ల‌గ‌డ‌పాటి చెప్పుకొచ్చారు.

English summary
Ex MP Lagadapati Rajagopal confident on his exit polls. He says AP Exit polls is related his credibility issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X