విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాలకు దూరంగా ఉన్నా: లగడపాటి, కాంగ్రెస్ నేత ఇంటికెళ్లారు

విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతానికి రాజకీయాలకు దూరమేనని స్పష్టం చేశారు. ఆదివారం తన మిత్రుల ఇంటి శుభాకార్యానికి ఆయన హాజరయ్యారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతానికి రాజకీయాలకు దూరమేనని స్పష్టం చేశారు. ఆదివారం తన మిత్రుల ఇంటి శుభాకార్యానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. ఆయన ఆదివారం మండల కాంగ్రెస్ నాయకులు ఉప్పలపాటి లక్ష్మీదాసు తనయుడి వివాహానికి హాజరయ్యారు.

నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పట్టణంలోని మున్సిపల్ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ లక్ష్మీనారాయణ ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు.

<strong>జగన్ ఉన్నంత వరకు చంద్రబాబుకు ఢోకా లేదా: తెలుగు తమ్ముళ్లు హ్యాపీ</strong>జగన్ ఉన్నంత వరకు చంద్రబాబుకు ఢోకా లేదా: తెలుగు తమ్ముళ్లు హ్యాపీ

Lagadapati says now he is not in politics

కొద్ది రోజుల క్రితం ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో వెలగపూడి సచివాలయంలో భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన టిడిపిలో చేరుతారని, కేశినేని నాని బదులు చంద్రబాబు ఆయనను విజయవాడ నుంచి రంగంలోకి దిగుతారని జోరుగా ప్రచారం సాగింది.

అయితే, ఆ తర్వాత వివిధ అంశాలు వెలుగు చూశాయి. ఆయన తన వ్యాపారం నిమిత్తం చంద్రబాబును కలిశారని వెలుగు చూసింది. అంతేకాదు, చంద్రబాబుకు లగడపాటి టిడిపి నేతలపై, ప్రభుత్వంపై సర్వే రిపోర్ట్ ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి.

English summary
Former Vijayawada MP Lagadapati Rajagopal on Sunday said that now he is in now politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X