వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు ఓ 'పీకే', లగడపాటి సీక్రెట్: జగన్-ప్రశాంత్ కిషోర్‌లకు చెక్?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పని చేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పని చేస్తున్నారు.

'సాక్షి' ఇంత దుర్మార్గమా, తెలంగాణలో ఆంధ్రులను దొంగలంటారా: బాబు, జగన్ సెల్ఫ్‌గోల్'సాక్షి' ఇంత దుర్మార్గమా, తెలంగాణలో ఆంధ్రులను దొంగలంటారా: బాబు, జగన్ సెల్ఫ్‌గోల్

వచ్చే ఎన్నికల్లో వైసిపిని గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వైసిపి, టిడిపి బలాలు, బలహీనతలను తెలుసుకుంటున్నారు.

పీకే ఆదేశాలతో ముందుకెళ్తున్న జగన్

పీకే ఆదేశాలతో ముందుకెళ్తున్న జగన్

మొత్తానికి, 2019 ఎన్నికల్లో వైసిపిని గెలిపించే బాధ్యతను ఎక్కువగా ప్రశాంత్ కిషోర్ తీసుకున్నారని చెప్పవచ్చు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి అనంతరం కూడా పీకే వైపే వైసిపి అధినేత జగన్ మొగ్గు చూపుతున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలు టార్గెట్‌గా పీకే సూచనల ప్రకారం జగన్ ముందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

లగడపాటి ఓ ప్రశాంత్ కిషోర్

లగడపాటి ఓ ప్రశాంత్ కిషోర్

ఇప్పుడు ఏపీలో మరో ఆసక్తికర చర్చ సాగుతోంది. మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓ ప్రశాంత్ కిషోర్ అయ్యారని చర్చించుకుంటున్నారు. అందుకు కారణం కూడా ఉంది.

టిడిపి బలాలు, బలహీనతలు

టిడిపి బలాలు, బలహీనతలు

లగడపాటి రాజగోపాల్ టిడిపి అధినేతను పలుమార్లు కలిశారు. వారి మధ్య రాజకీయాల పరమైన చర్చ జరగడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో టిడిపి బలాలు, బలహీనతల గురించి లగడపాటి.. చంద్రబాబు వివరాలు ఇస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

తన హాబీని టిడిపికి లబ్ధి చేకూర్చేలా..

తన హాబీని టిడిపికి లబ్ధి చేకూర్చేలా..

తనకు సర్వే ఓ హాబీ అని లగడపాటి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి ఏదో ఆశిస్తున్న లగడపాటి టిడిపి గురించి మంచి ఆసక్తిని కనబరుస్తున్నారనే చర్చ సాగుతోంది. అందుకే తనకు హాబీ అయిన సర్వే ద్వారా టిడిపిపై ప్రత్యేక దృష్టి పెట్టారని అంటున్నారు. లగడపాటి రిపోర్టులతో చంద్రబాబు జగన్-ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు చెక్ చెబుతారా అనే చర్చ సాగుతోంది.

నేతలకు సూచనలు చేస్తారా?

నేతలకు సూచనలు చేస్తారా?

ప్రస్తుతం టిడిపి బలం ఎక్కడ ఎలా ఉంది, ఏఏ ఎమ్మెల్యే పైన ప్రజల్లో అసంతృప్తి ఉంది, అక్కడ ఎలా చేయాలి.. తదితర అంశాలపై చంద్రబాబుకు పూర్తిస్థాయి నివేదికలు ఇస్తున్నట్లుగా భావిస్తున్నారు. తద్వారా చంద్రబాబుకు లగడపాటి మరో పీకే అయ్యారని అంటున్నారు. లగడపాటి సర్వే రిపోర్టుల ఆధారంగా చంద్రబాబు నేతలకు సూచనలు చేయనున్నారని అంటున్నారు.

English summary
It is known that Opposition Leader YS Jagan Mohan Reddy brought in Political Strategist, Prashant Kishor popularly known as PK, to assist the party in preparation for 2019 elections. Chandrababu seems to be having one more PK as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X