వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ల‌గ‌డ‌పాటి స‌ర్వేనే చేయ‌లేదా..?! టీడీపీ కోస‌మే అలా చెప్పారా : వెలుగులోకి కొత్త విష‌యాలు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Exit Polls 2019 : టీడీపీ కోస‌మే ల‌గ‌డ‌పాటి అలా చెప్పారా ? వెలుగులోకి కొత్త విష‌యాలు..! | Oneindia

ఏపీ ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు ఖాయ‌మంటూ చెబుతున్న ఆంధ్రా ఆక్టోప‌స్ అస‌లు స‌ర్వే చేయ‌లేదా. ఇప్పుడు ఈ అనుమానాలు బ‌లంగా ఉన్నాయి. త‌న స‌ర్వే అంచ‌నాలు అంటూ ల‌గ‌డ‌పాటి బ‌య‌ట పెట్టిన నివేదిక‌లో టీడీపీకి వంద సీట్ల‌కు ప‌ది ప్ల‌స్ ఆర్ మైన‌స్ వ‌స్తాయంటూ చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో ఇవి త‌న అంచ‌నాలు మాత్ర‌మే అని.. తాను ఇవిఎంల్లో తొంగి చూడ‌లేద‌ని వ్యాఖ్యానించారు. అయితే, ల‌గ‌డ‌పాటి ఎవ‌రితో అయితే స‌ర్వే చేయించాన‌ని చెప్పారో..ఆ ప్ర‌తినిధులు తాము స‌ర్వే చేయ‌లేద‌ని చెబుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో..ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ఏపీ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

స‌ర్వేలోనే క‌న్‌ఫ్యూజ‌న్...
ల‌గ‌డ‌పాటి తాను ఆర్జీ ఫ్లాష్ టీం ద్వారా స‌ర్వే చేయించిన‌ట్లు ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ఏపీలోని మొత్తం ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన త‌రువాత ఏప్రిల్ 12 నుంది 21వ తేదీ వ‌ర‌కు ఎగ్జిట్ పోల్ స‌ర్వే చేయించిన‌ట్లు చెప్పుకొచ్చారు. ఆ స‌మ‌యంలో మొత్తం 38 నియోజ‌క‌వ‌ర్గాల‌ను ర్యాండ‌మ్‌గా తీసుకొని ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో 1200 మందిని శాంపిల్గా సేక‌రించామ‌ని వివ‌రించారు. మొత్తంగా 50 వేల మందిని శాంపిల్స్‌గా తీసుకొని స‌ర్వే చేసిన‌ట్లు రిపోర్టులో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. అయితే, ఇక్క‌డే అనుమానం మొద‌లైంది. 38 నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం 50 వేల మంది అభిప్రాయాన్ని మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల అభిప్రాయంగా ఎలా విశ్లేషిస్తార‌నేదే అస‌లు ప్ర‌శ్న‌. ఇక‌, 50వేల మందిని శాంపిల్ గా తీసుకోవ‌టం చాలా చిన్న శాంపిల్‌గా క‌నిపిస్తోంది. అయితే, ఆయ‌న మాత్ర ఫిబ్ర‌వ‌రి నుండి వివిధ ద‌శ‌ల్లో తీసుకున్న శాంపిల్స్ అని స్పష్టంగా చెబుతున్నారు. మ‌రి..ఇది ఎగ్జిట్ పోల్ ఎలా అవుతుందో వివ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.

Lagadapti Did not done any survey..many doubts on his predictions..

ఆ వ్య‌క్తి స‌ర్వేనే చేయ‌లేదంటూ..
ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఆర్జీ ఫ్లాష్ టీం త‌ర‌పున త‌న మిత్రుడు య‌ర్రంశెట్టి శ్రీనివాస్ ఈ స‌ర్వే చేసార‌ని ప్ర‌క‌టించారు. అయితే, ప‌శ్చిమ గోదావ‌రికి చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్‌ను కొంత మంది సంప్ర‌దించ‌గా..అస‌లు తాను ఎటువంటి స‌ర్వే చేయ‌లేద‌ని చెప్పిన‌ట్ల విశ్వ‌సనీయ స‌మాచారం. దీని కార‌ణంగానే ల‌గ‌డ‌పాటి సైతం ఫ‌లితాల పైన స్ప‌ష్ట‌త లేకుండా మాట్లాడార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ప‌దేప‌దే ఇది త‌న అంచ‌నాలు మాత్ర‌మే అని..ఫ‌లితాలు అటూ ఇటుగా ఉండ‌వ‌చ్చంటూ చెబుతున్న వ్యాఖ్య‌లు ఆయ‌న‌లోని క‌న్‌ఫ్యూజ్‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్నాయి. దీంతో..
అస‌లు ల‌గ‌డ‌పాటి స‌ర్వే గురించి వాస్త‌వాలు తెలిసే..టీడీపీ నేత‌లు ఆయ‌న స‌ర్వే గురించి ప్ర‌స్తావించ‌టం లేద‌ని, పైగా ఆయ‌న స‌ర్వే న‌మ్మ‌మంటూ చేస్తున్న వ్యాఖ్య‌ల‌న వైసీపీ నేత‌లు హైలైట్ చేస్తున్నారు. దీంతో..అస‌లు ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే స‌మ‌యంలో టీడీపీ నేత‌ల్లో కొంత జోష్ నింపిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే పైన ఇప్పుడు వ‌స్తున్న ఆరోప‌ణ‌లు వారిని డైల‌మాలో ప‌డేస్తున్నాయి.

English summary
Ex MP Lagadapti Exit Poll survey now in controversy. As per reliable sources Lagadapati mentioned person Srinivas saying he did not done any survey. At the same time Lagadapati alos seem to be not confident on his Survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X