వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ స్త్రీలోలుడట: బాబుపై లక్ష్మీపార్వతి, జగన్‌కూ అదే స్థితి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె రచించిన ఓ వ్యాసాన్ని సాక్షి మీడియా గురువారంనాడు ప్రచురించింది.

వెన్నుపోటు చర్య తప్పు కాదని చెప్పేందుకు చంద్రబాబు నాయుడు చరిత్రను మార్చేందుకు కూడా సిద్ధపడ్డారని ఆమె అన్నారు. ఎన్టీ రామారావుపై చంద్రబాబు దుష్ప్రచారం చేయించారని అన్నారు.

 పుస్తకాల్లో ఇలా రాయించారు...

పుస్తకాల్లో ఇలా రాయించారు...

స్త్రీలోలుడైన మావో నుంచి చైనాను రక్షించేందుకు డైంగ్ జియావో పింగ్ తిరుగుబాటు చేశాడని బూటకపు ప్రచారం చేస్తున్నారని, పార్టీ కార్యకర్తల శిక్షణ కోసం వెలువరించిన పుస్తకాల్లో లాంటి వక్రీకరణలను చొప్పించారని లక్ష్మీపార్వతి ఆ వ్యాసంలో రాశారు., ఎన్టీఆర్ కూడా స్త్రీలోలుడట, ఆయన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకే చంద్రబాబు తిరుగుబాటు చేశాడట అని ఆమె అన్నారు.

 భార్యే కారణమని దుష్ప్రచారం.

భార్యే కారణమని దుష్ప్రచారం.

అధికార దాహంతో 1995లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ని చేస, ఇందుకు ఎన్టీఆర్ భార్య కారణమని పచ్చ పత్రికల సాయంతో దుష్ప్రచార చేయడం చూస్తే, చరిత్రలో ఇంత అథమ స్థాయి నేత మరొకరు ఉండరని చెప్పవచ్చునని, ఒక ప్రశ్న అంటూ ఎన్టీఆర్‌ను స్త్రీలోలునిగా చిత్రించే తెలుగుదేసం పార్టీ ఇప్పటికీ ఆయన ఫొటోలకు ఎందుకు దండలు వేస్తున్నట్లు అని అడిగారు.

కాంగ్రెసు నుంచి చంద్రబాబు వలస

కాంగ్రెసు నుంచి చంద్రబాబు వలస

తెలుగుదేశం పార్టీ 19982లో అధికారంలోకి రాగానే కాంగ్రెసు నుంచి వలస వచ్చి తిష్టవేసినవారు చంద్రబాబు అని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఒక పథకం ప్రకారం పార్టీలోని అనుభవజ్ఞులకు వంచనతో ఉద్వాసన పలికారని ఆమె ఆరోపించారు. ఏదో ఒకనాడు ఇతడు ఎన్టీఆర్ స్తానాన్ని ఆక్రమించడానికి ఆయనను చంపనయినా చంపతాడు అంటూ ఆ సమయంలోనే నల్లపురెడ్డి శ్రీనివాసులు ెడ్డి వ్యాఖ్యానించిన వి,యాన్ని గుర్తు చేసుకోవాలని ఆమె అన్నారు.

 ఎన్టీఆర్ మంచి పేరుకు గ్రహణం

ఎన్టీఆర్ మంచి పేరుకు గ్రహణం

చంద్రబాబుకు ఎన్టీఆర్ కేబినెట్ హోదాతో కర్షక పరిషత్ నేతృత్వం కట్టబెట్టారని, కోర్టు మూడు సార్లు తిరస్కరించడంతో అప్పటి వరకు ఎన్టీఆర్ సాధించుకున్న మంచి పేరుకు కూడా గ్రహణం పట్టిందని, ఆపై పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చంద్రబాబు చేజిక్కించుకున్నారని, ప్రభుత్వ వ్యవహారం జోక్యం చేసుకోవడం ప్రారంభించారని, అవినీతి విధానాలకు బాటలు పరిచారని, దని ప్రభావం 1989 ఎన్నికల్లో కనిపించిందని, పార్టీ ఓడిపోయిందని లక్ష్మీపార్వతి దుమ్మెత్తిపోశారు.

 ఎన్టీఆర్ ఇలా చేశారు...

ఎన్టీఆర్ ఇలా చేశారు...

74 ఏళ్ల ఎన్టీఆర్ 1994లో ఆయన భార్య వెంట ఉండగానే ఎన్నికల బరిలోకి దిగారని, ఎంతో కష్టించారని, 294 స్థానాల్లో మిత్రపక్షాలతో కలిసి 258 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. ఇదొక చరిత్ర అని అన్నారు. ఈసారి కూడా ఆర్థిక రెవెన్యూ శాఖలనే కాకుండా విద్యుత్ శాఖను కూడా చంద్రబాబు కైవసం చేసుకున్నారని అన్నారు. ఇదంతా ఎన్టీఆర్ మీద, ప్రభుత్వం మీద పట్టు సాధించడానికేనని అన్నారు. పార్టీకి చంద్రబాబు చేసిందేమీ లేదని అన్ారు. కానీ ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారని విమర్శించారు. హెరిటేజ్ స్థాపన కూడా అవినీతితోనే జరిగిందని ఆరోపించారు.

 ఇలా స్త్రీని ఆహ్వానిస్తే...

ఇలా స్త్రీని ఆహ్వానిస్తే...

పెరాల్టిక్ స్ట్రోక్‌తో బాధపడుతూ ఆసరా కోసం ఓ స్త్రీని జీవితంలోకి ఆహ్వానిస్తే ఆమెనే బాబు బూచిగా చూపిచి, ఎల్లో మీడియా సాయంతో చరిత్ర మరువలేని కుట్రను అమలు జరిపారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఎనిమిది నెలలు తిరగకుండానే ప్రభుత్వాన్ని కూలదోశారని అన్నారు. ఆగస్టు 26, 1995న వైస్రాయ్ హోటల్ ముందు జరిగిన ఘోరం మరువలేనిదని అన్నారు.

 ఎన్టీఆర్ మీదికి చెప్పులు విసిరారు...

ఎన్టీఆర్ మీదికి చెప్పులు విసిరారు...

ముఖ్యమంత్రి హోదాలో వెళ్లిన ఎన్టీఆర్ మీదికి చెప్పులు విసిరారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. కుంగిన ఎన్టీఆర్ ఆగ్టు 30, 1995న ఆస్పత్రి పాలయ్యారని అన్నారు.. ఆ సమయంలో ఎన్టీఆర్ కళ్ల నీళ్లు పెట్టుకుని ఎన్టీఆర్ ఈరోజే చనిపయాడు, నన్ను బతికుండగానే సమాధి చేశాడంటూ దుఖ్కం పొంగిపొర్లుతుండగా అక్కడే మైకు తీసుకుని మాట్లాడిన సంఘటన ఎవరైనా మరిచిపోగలరా అని ఆమె అన్నారు.

 అప్పుడు చంద్రబాబు ఇలా చేశారు...

అప్పుడు చంద్రబాబు ఇలా చేశారు...

చంద్రబాబు మీద పోరాటానికి సిద్ధపడిన ఎన్టీఆర్ ఫిబ్రవరి 1996లో సింహగర్జన సదస్సు ఏర్పాటు చేస్తున్నానని, ప్రజలకు చంద్రబాబు నీతిమాలిన చర్యను తెలియజేస్తానని చెప్పారని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. సదస్సు కోసం బ్యాంక్ ఆఫ్ బరోడాలో తన పేరుతో ఉన్న పార్టీ సభ్యత్వ డబ్బును తీసుకురావాలని జనవరి 17 1996న దేవినేని రాజశేఖర్‌కు చెక్కు ఇచ్చి పంపించారని, కానీ చంద్రాబు స్టే ఆర్రడర్ తెచ్చి ఎన్టీఆర్‌కు ఆ హక్కు లేదని చెప్పించారని అన్నారు ఆనయ అగ్రహోదగ్రుడై, ఇతడు క్షమించటానికి వల్లేని పెద్ద ద్రోహి అని అందరి ముందే తిట్టారని చెప్పారు. ఆ బాధ తట్టుకోలేక మరో 10 గంటల్లోనే ఎన్టీఆర్ గుండె ఆగిపోయిందని, ఆయన తప్పిన బీపీ, షుగర్ వల్నలే అలా జరిగిందని డాక్టర్లు ప్రకటించారని ఆమె చెప్పారు.

ఈ రాజకీయ హత్య చేసిందెవరు...

ఈ రాజకీయ హత్య చేసిందెవరు...

ఈ రాజకీయ హత్య చేసిందెవరని లక్ష్మిపార్వతి ప్రశ్నించారు. 60 ఏళ్ల వయ్సుసలో కూడా కష్టించి ఎన్టీఆర్ సాధించిన ప్రభుత్వాన్ని కబ్జా చేయడమే కాకుండా ఆయన మీద, ఆయన భార్య మీద నిందలు మోపటం ఎటువంటి అధమ రాజకీయమని ఆమె అడిగారు. ఇదే పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డ ఎుర్కుంటున్నరని, చంద్రబాబు పన్నిన ఉచ్చులో సోనియా ఇరుక్కున్నారని అడ్డమైన కేసులు పెట్టించి, జగన్‌ను జైలుకు పంపారని ఆమె అన్నారు.

 చివరరగా లక్ష్మీ పార్వతి ఇలా...

చివరరగా లక్ష్మీ పార్వతి ఇలా...

74 ఏళ్ల వయసులో సర్వం పోగొట్టుకునిప్రాణాలను విడిచిన తన భర్త నందమూరి తారకరామారావును దుఖ్కంతో స్మరించుకునే జనవరి 18వ తేదీని చంద్రబాబు నికృష్ణ రాజకీయానికి ప్రతిరూపంగా పరిగణించాలని లక్ష్మీపార్వతి అన్నారు. ఇప్పటికీ ఎన్టీఆర్‌ను స్త్రీలోలుడిగా చిత్రీకరిస్తూ బతుకుతున్న చంద్రబాబు నీచ రాజకీయానికి శాశ్వత సమాధి కట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

English summary
The YSR Congrss Party leader Laksmi Parvathi made wild allegations against Andhra Pradesh CM Nara Chandrababu Naidu in her Sakshi article.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X