వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవమానించేందుకే: ‘లక్ష్మీస్ వీరగ్రంథం’పై కేతిరెడ్డికి లక్ష్మీపార్వతి వార్నింగ్

‘లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

NTR Biopic Controversies : ‘లక్ష్మీస్ వీరగ్రంథం’NTR ను అవమానించడానికే ?

హైదరాబాద్: 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా తీయడం ముమ్మాటికీ ఎన్టీఆర్‌ను అవమానించడమేనని మండిపడ్డారు.

'లక్ష్మీస్ వీరగ్రంథం' ఆఫర్ వచ్చింది, సిద్ధమే: వాణీ విశ్వనాథ్'లక్ష్మీస్ వీరగ్రంథం' ఆఫర్ వచ్చింది, సిద్ధమే: వాణీ విశ్వనాథ్

 అవమానించేందుకే..

అవమానించేందుకే..

తనను అవమానించాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా తీస్తున్నారని, ఎన్టీఆర్‌ను అగౌరపరిచేలా కొందరు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీయనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు పోటీగానే.. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి.. ‘లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా తీస్తున్నారని ఆరోపించారు.

 లక్ష్మీపార్వతి హెచ్చరిక

లక్ష్మీపార్వతి హెచ్చరిక

మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన లక్ష్మీపార్వతి.. ఘాట్ వద్ద సమాధికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను, ఎన్టీఆర్‌ను అవమానించేలా, చరిత్రను వక్రీకరించి సినిమా తీయాలనుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు.

 కేతిరెడ్డి లాంటి పాపులు..

కేతిరెడ్డి లాంటి పాపులు..

తన అనుమతి లేకుండానే తన జీవిత చరిత్రను ఎలా తీస్తారంటూ లక్ష్మీపార్వతి నిలదీశారు. కేతిరెడ్డి లాంటి కొంతమంది పాపులు ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించడంతో.. ఈ ప్రాంతమంతా అపవిత్రమైందని.. అందుకే పాలాభిషేకంతో శుద్ధి చేశామని చెప్పారు.

 షూటింగ్ అడ్డుకున్న పోలీసులు..

షూటింగ్ అడ్డుకున్న పోలీసులు..

‘లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా ముహూర్తపు షాట్‌ను ఎన్టీఆర్ ఘాట్ వద్ద తీసేందుకు కేతిరెడ్డి ప్రయత్నించగా.. లక్ష్మీపార్వతి బంజారాహిల్స్‌లో లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు షూటింగ్ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలావుండగా, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలు లీడ్ రోల్ చేసేందుకు తాను సిద్ధమేనని సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం.

English summary
YSRCP leader Lakshmi Parvathi on Tuesday fired at Kethireddy Jagadishwar Reddy for Lakshmi's veera grantham.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X