వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణకు మాత్రమేనా?, ఎన్టీఆర్ ప్రధాని కాకుండా..: బాబును ఏకేసిన లక్ష్మీపార్వతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాలని దివంగత నేత, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద సోమవారం ఉదయం నివాళులర్పించారు.

బాబు నుంచి టీడీపీని కాపాడాలి..

బాబు నుంచి టీడీపీని కాపాడాలి..

అనంతరం లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడి, ఆయన వారసుల్లో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టాలన్నారు. ఎన్టీఆర్ వారసుల్లో కేవలం బాలకృష్ణకు మాత్రమే ఎమ్మెల్యే సీటు ఇచ్చి మిగిలిన వారిని పక్కన పెట్టడం చాలా దారుణమని చంద్రబాబుపై మండిపడ్డారు.

Recommended Video

ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద హరికృష్ణ, జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, భారీ సంఖ్యలో అభిమానులు
లోకేష్‌ కాబోయే ముఖ్యమంత్రా?

లోకేష్‌ కాబోయే ముఖ్యమంత్రా?

జయంతి వర్దంతికి తేడా తెలియని తన కొడుకును మంత్రి చేసి.. కాబోయే సీఎం అని చంద్రబాబు అనడం సిగ్గుచేటని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేయాలని హరికృష్ణ ప్రత్యేకంగా అడగాలా? ఆయన వారసునిగా సీఎంగానో, ఇతర ముఖ్య స్థానంలో ఉండాల్సిన హరికృష్ణను ఇలాంటి స్థాయికి దిగజార్చారని మండిపడ్డారు.

టీడీపీని అమ్మే ప్రయత్నం

టీడీపీని అమ్మే ప్రయత్నం

అంతేగాక, చంద్రబాబు తెలుగుదేశం పార్టీని మళ్లీ కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిని ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకోవాలని లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు. ఆత్మగౌరవంతో వచ్చిన పార్టీని ఢిల్లీకి గులాంగిరి చేస్తూ ఆత్మ వంచన పార్టీగా మార్చి అమ్మేందుకు సిద్ధపడుతున్న చంద్రబాబు ఓ పెద్ద రాబందు అని విమర్శించారు. అంతేగాక, భారతరత్నను ఎన్టీఆర్ కు రాకుండా అడ్డుకుంటున్నారని, ఇది ఆయన అభిమానులు అర్థం చేసుకోవాలని అన్నారు.

ఎన్డీఆర్‌ను ఓడించి.

ఎన్డీఆర్‌ను ఓడించి.

‘నిన్నటి వరకు సీఎం అవ్వడానికే చంద్రబాబు.. ఎన్టీఆర్‌ను గద్దెదించాడని భావించాను. కానీ, ఎన్నికల ముందే ఆనాటి కాంగ్రెస్ ప్రధానితో చేతులు కలిపి ఎన్టీఆర్‌ను ఓడించి ప్రధాని కాకుండా అడ్డుకోవాలని కుట్ర పన్నినట్లు తెలిసింది' లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఎన్టీఆర్ జయంతి నాడు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, ఎన్టీఆర్‌ను పార్టీకి దూరం చేయడంలో ఇది భాగమనిస్తోందని అన్నారు.

English summary
YSR Congress Party leader and NTR wife Lakshmi Parvathi on MOnday lashed out at Andhra Pradesh CM Nara Chandrababu Naidu for insulting NTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X