వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో మరో ఆంధ్రా కేసు.. ! తనను వివాదాల్లోకి లాగిన కోటిపై డీజీపీకి ఫిర్యాదు చేసిన లక్ష్మీపార్వతి

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన లక్ష్మీపార్వతివేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. తన సహనాన్ని పరీక్షిస్తున్నారని చివరగా లక్ష్మీ పార్వతి తన పై కోటి అనే వ్యక్తి చేస్తున్న ఆరోపణలపై లక్ష్మీ పార్వతి డీజీపీని కలిశారు . తనపై లైంగిక ఆరోపణలు చేసిన కోటి అనే యువకుడిపై చర్యలు తీసుకునేందుకు వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కోటిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఆ విషయంలో సక్సెస్: ఎక్కువ సమయం లేదు..పదవిని ఆస్వాదించండి: చంద్రబాబుకు సాయిరెడ్డి సలహాఆ విషయంలో సక్సెస్: ఎక్కువ సమయం లేదు..పదవిని ఆస్వాదించండి: చంద్రబాబుకు సాయిరెడ్డి సలహా

డీజీపీని కలిసిన లక్ష్మీ పార్వతి.. కోటి పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

డీజీపీని కలిసిన లక్ష్మీ పార్వతి.. కోటి పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కోటిపై చర్యలు తీసుకోవాలని తన పరువు, మర్యాదలు కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ అయిన లక్ష్మీపార్వతి తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేశారు. కోటి అనే వ్యక్తి సృష్టించిన అసత్యపు ప్రచారాన్ని కొందరు పని గట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .

 మహిళ అన్న విచక్షణ లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన

మహిళ అన్న విచక్షణ లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన

సమాజంలో గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న తనను మహిళా అనే విచక్షణ కూడా మరిచి అదే పనిగా విమర్శలు చేస్తుండటంతో మానసిక చిత్రవధ అనుభవిస్తున్నానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.తనపై ఆరోపణలు చేసిన కోటి అనే వ్యక్తిని బిడ్డగా భావించానని స్పష్టం చేశారు. తనపై ఆరోపణల తర్వాత ఎంక్వైరీ చేస్తే నేరచరిత్ర ఉన్నట్టు తెలిసిందన్నారు.నేర చరిత్ర ఉన్న కోటి లాంటి వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చెయ్యడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఆరోపణల వెనుక ఉన్న కుట్రలను ఛేదించాలని కోరారు. తనకు న్యాయం చెయ్యాలని కోరారు.

కోటిపైనా , మీడియాపైనా చర్యలు తీసుకోండి .. కుట్ర ఛేదించండి అంటున్న లక్ష్మీ పార్వతి

కోటిపైనా , మీడియాపైనా చర్యలు తీసుకోండి .. కుట్ర ఛేదించండి అంటున్న లక్ష్మీ పార్వతి

ఇక ఈ తప్పుడు కథనాలను పదేపదే ప్రసారం చేసిన సదరు మీడియా పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. కోటి చేసిన దుష్ప్రచారాన్ని పదేపదే చూపిస్తూ తన మానసిక వేదనకు కారణమైన మీడియా పైన , కోటి పైన చర్యలు తీసుకొని తన గౌరవ మర్యాదలు కాపాడాలని ఆమె కోరారు. ఒక మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి భార్యనైన నా పైన కూడా కుట్రపూరితంగా చేసిన ఆరోపణల వెనుక ఉన్నవారెవరో తేల్చాలని ఆమె డీజీపీని విజ్ఞప్తి చేశారు .

English summary
Lakshmi Parvati said that allegations of sexual harassment were severely hurt her. In her complaint, she complained that police have to take action on koti to protect her dignity and respect .She spoke with DGP about the wrong allegation against her created by koti and spread by media and social media.She requested the DGPto take action on koti and the propaganda spreaders in media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X