• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లక్ష్మీపార్వతి, పూనం కౌర్ పై అసభ్య ప్రచారం చేసిన కోటి దొరికాడు.. కానీ .. పోలీసులు పట్టుకోలే!

|

తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన లక్ష్మీపార్వతివేధింపుల కేసులో లక్ష్మీ పారవతినే కాకుండా నటి పూనం కౌర్ ను కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా లో దుమారం రేపిన కోటి కోర్టులో లొంగిపోయాడు .ఎన్టీ రామారావు సతీమణి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత లక్ష్మీపార్వతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, సినీ నటి పూనం కౌర్ వ్యక్తిగత సంభాషణలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కోటి పై గతంలో లక్ష్మీ పార్వతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే . ఇక కేసులో నిందితుడైన కోటి హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో మంగళవారం లొంగిపోయాడు.

లక్ష్మీపార్వతిని వేధించిన కేసులో నిందితుడు కోటి .. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు

లక్ష్మీపార్వతిని వేధించిన కేసులో నిందితుడు కోటి .. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు

జూనియర్ ఆర్టిస్ట్ అయిన కోటిని తాను కొడుకులా చూసుకుంటే అతను సోషల్‌మీడియా ద్వారా తనపై దుష్ప్రచారం చేశాడని లక్ష్మిపార్వతి ఏప్రిల్‌ 15న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు కోటి చేసిన ఆరోపణలను భరించలేక ఆమె తన సహనాన్ని పరీక్షిస్తున్నారని తన పై కోటి అనే వ్యక్తి చేస్తున్న ఆరోపణలపై లక్ష్మీ పార్వతి డీజీపీని కలిశారు . తనపై లైంగిక ఆరోపణలు చేసిన కోటి అనే యువకుడిపై చర్యలు తీసుకునేందుకు వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కోటి చేసిన ఆరోపణలను కొన్ని టీవీ చానెళ్లతోపాటు సోషల్‌ మీడియాలో ఎలాంటి వివరణ లేకుండా ప్రసారం చేసి తన వ్యక్తిత్వాన్ని కించపరిచారని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. సమాజంలో గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న తనను మహిళా అనే విచక్షణ కూడా మరిచి అదే పనిగా తనపై ఆరోపణలు చేస్తుండటంతో మానసిక చిత్రవధ అనుభవిస్తున్నానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బిడ్డలా భావిస్తే అసభ్యప్రచారం చేశాడని వాపోయిన లక్ష్మీ పార్వతి .. తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన కోటి వ్యవహారం

బిడ్డలా భావిస్తే అసభ్యప్రచారం చేశాడని వాపోయిన లక్ష్మీ పార్వతి .. తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన కోటి వ్యవహారం

తనపై ఆరోపణలు చేసిన కోటి అనే వ్యక్తిని బిడ్డగా భావించానని స్పష్టం చేశారు. తనపై ఆరోపణల తర్వాత ఎంక్వైరీ చేస్తే నేరచరిత్ర ఉన్నట్టు తెలిసిందన్నారు.నేర చరిత్ర ఉన్న కోటి లాంటి వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చెయ్యడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఆరోపణల వెనుక ఉన్న కుట్రలను ఛేదించాలని కోరారు. తనకు న్యాయం చెయ్యాలని కోరారు. ఇంటికి రానిచ్చి పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని బిడ్డలా చూశానని లక్ష్మిపార్వతి చెప్పారు. తన కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆదరించారని అన్నారు. తన తరఫున ఫోన్‌ ద్వారా మెసేజ్‌లు, వాట్సాప్‌ సందేశాలు పంపించాలని కోటికి చెప్తే దాన్ని అవకాశంగా తీసుకున్నాడని, తప్పుడు మెసేజ్‌లు పంపి బురదజల్లే ప్రయత్నం చేశాడని ఆమె అప్పట్లోనే ఆవేదన చెందిన విషయం తెలిసిందే .

పూనం కౌర్ కు కోటి వేధింపులు .. పట్టుకోలేకపోయిన పోలీసులు .. కోర్టులో కోటి లొంగుబాటు .. బెయిల్ మంజూరు

పూనం కౌర్ కు కోటి వేధింపులు .. పట్టుకోలేకపోయిన పోలీసులు .. కోర్టులో కోటి లొంగుబాటు .. బెయిల్ మంజూరు

ఇక నటి పూనంకౌర్‌ వ్యక్తిగత సంభాషణలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి హల్‌చల్‌ చేసింది కూడా కోటియేనని సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. తన ఫోన్‌ నుంచి వ్యక్తిగత డేటా, కాల్‌ రికార్డింగ్‌లు సేకరించి వాటిని సోషల్‌మీడియా ద్వారా వైరల్‌ చేశారని పూనం కౌర్ గతంలో సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలులో కేఏపాల్‌ సోదరుడు డేవిడ్‌రాజ్‌ హత్య కేసులోనూ కోటి నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.ఈ రెండు కేసుల్లోనూ అతడే నిందితుడని నిర్ధారించిన సీసీఎస్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. కానీ పోలీసులు కోటిని ఇంత కాలం పాటు పట్టుకోలేకపోయారు. ఇక ఇప్పుడు కూడా కోటి స్వయం గా కోర్టులో న్యాయమూర్తి ముందు లొంగిపోయాడు . అయితే నాటకీయ పరిణామాల మధ్య కోటి కోర్టు ఎదుట లొంగిపోయా డు. నాంపల్లి కోర్టులో దర్శనమివ్వడంతో పట్టుకొనేందుకు వచ్చిన హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులకు పట్టుబడకుండా కోటి న్యాయమూర్తి ముం దుకు రావడంతో కోర్టు కోటికి బెయిల్ మంజూరు చేసింది.

English summary
Koteswar Rao alias Koti, who was accused of harassing actress Poonam Kaur and politician Lakshmi Parvathi on social media, surrendered at a city court on Tuesday.The Cyber Crime police were hunting for Koteshwar Rao against whom cases were registered in April this year.Lakshmi Parvathi, wife of the late NT Rama Rao, had approached the Telangana DGP alleging harassment and defamation on social media, following which the Hyderabad Cyber Crime police registered a case and took up investigation. Days later, Tollywood actress Poonam Kaur also lodged a complaint with the Cyber Crime police station.On Rao’s surrender, a police official said the course of action would soon be decided upon. The police had said he was hiding in Andhra Pradesh. However, on Tuesday, the man made his way to the Nampally court complex and surrendered. It is learned the police had missed him by a whisker when he walked out of a hotel where he had his lunch just minutes before the police reached.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X