గవర్నర్ విద్యాసాగర్ రావుతో లక్ష్మీనారాయణ భేటీ: బీజేపీ వైపేనా?
ముంబై: స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, పదవీ విరమణ చేసిన నేపథ్యంలో లక్ష్మీనారాయణ మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు.

పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. కాగా, ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్, గతంలో బీజేపీలో కీలక నేతగా ఉన్న విద్యాసాగర్ రావును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
లక్ష్మీనారాయణ జనసేనకేనా? టచ్లో బీజేపీ!, వీఆర్ఎస్కు అసలు కారణం ఇదేనా?

కాగా, సహజంగానే సమాజానికి ఏదైనా చేయాలన్న తపన ఉన్న లక్ష్మీ నారాయణను బీజేపీలో చేర్చుకోవడానికి కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరతారనే వార్తలు కూడా వస్తున్నాయి.
అయితే, రాజకీయ రంగ ప్రవేశంపై లక్ష్మీ నారాయణ మాత్రం ఇంతవరకు ఏ ప్రకటనా చేయలేదు. కాగా, వ్యక్తి గత కారణాలతోనే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.