వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మీపార్వతి నుంచి రక్షించండి: కేతిరెడ్డి, ఎన్టీఆర్ సొంతూరులో షాకిచ్చారు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి నుంచి తనకు ప్రాణహానీ ఉందని, తనను రక్షించాలని లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా దర్శకులు కేతినేని జగదీశ్వర్ రెడ్డి బుధవారం కోరారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి నుంచి తనకు ప్రాణహానీ ఉందని, తనను రక్షించాలని లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా దర్శకులు కేతినేని జగదీశ్వర్ రెడ్డి బుధవారం కోరారు.

Recommended Video

లక్ష్మీ పార్వతికి కేతి రెడ్డి సవాల్

రక్షణ కల్పించండి: కేతిరెడ్డి, 'వెధవ'లంటూ లక్ష్మీపార్వతి తీవ్రవ్యాఖ్యలురక్షణ కల్పించండి: కేతిరెడ్డి, 'వెధవ'లంటూ లక్ష్మీపార్వతి తీవ్రవ్యాఖ్యలు

 నన్ను గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అవుతున్నారు

నన్ను గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అవుతున్నారు

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివ రావును ఆయన కలిశారు. సినిమా షూటింగ్ సందర్భంగా తనను గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అవుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.

బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.

తనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని కేతిరెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన డీజీపీని కోరారు.

 లక్ష్మీపార్వతి నిప్పులు చెరిగారు

లక్ష్మీపార్వతి నిప్పులు చెరిగారు

కాగా, మంగళవారం ఎన్టీఆర్ సమాధిని లక్ష్మీపార్వతి పాలతో కడిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేతిరెడ్డిపై ఆమె నిప్పులు చెరిగారు. తన భర్త సమాధి వద్దకు వచ్చిన కేతిరెడ్డిలాంటి పాపులు ఇక్కడ ఉచ్ఛరించకూడని పేర్లను పలికారని మండిపడ్డారు. తల్లి, చెల్లి ఉన్న ఎవరూ ఇలాంటి సినిమాలు తీయరన్నారు. కేతిరెడ్డిని ఓ ప్లాట్ ఫామ్ గాడు అంటూ సంబోధించారు.

 ఎన్టీఆర్ ఊళ్లోనే షాక్

ఎన్టీఆర్ ఊళ్లోనే షాక్

లక్ష్మీస్‌ వీరగ్రంథం సినిమా షూటింగుకు ఎన్టీఆర్ ఊళ్లోనే అడ్డంకులు తప్పలేదు. ఈ సినిమా ముహూర్తం సన్నివేశాన్ని హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద చిత్రీకరించడానికి ఇటీవల చిత్ర బృందం ప్రయత్నించింది. అయితే, దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత చిత్రయూనిట్ ఎన్టీఆర్ స్వస్థలమైన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరులో జరిపేందుకు చేసిన ప్రయత్నాలను ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు.

 నిమ్మకూరులో ఇలా

నిమ్మకూరులో ఇలా

ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు పంచాయతీ పెద్దలను ఈ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆశ్రయించారు. సన్నివేశాల చిత్రీకరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో సమావేశమైన పంచాయతీ పాలకవర్గం, గ్రామపెద్దలు చిత్రీకరణకు అభ్యంతరం చెప్పారు.

 గ్రామస్తుల అనుమతి లేకుండా

గ్రామస్తుల అనుమతి లేకుండా

ఈ సినిమా కారణంగా ఎన్టీఆర్‌తో పాటు నిమ్మకూరుకు కూడా చెడ్డపేరు వస్తుందని, అందుకే అనుమతి ఇవ్వలేమని వారు స్పష్టం చేశారు. దీంతో గ్రామస్థులకు ఇష్టం లేకుండా సన్నివేశాలు చిత్రీకరించమని చెబూతూ చిత్రయూనిట్ ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, వెనుదిరిగారు.

English summary
lakshmis veera grantham director Kethireddy Jagadishwar Reddy complaints to DGP in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X