వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ల్యాంకో ఇన్‌ఫ్రా రికార్ట్ స్థాయి పతనం: దివాలా పరిష్కారం.. ఇదీ కారణం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ఆదేశాలతో ల్యాంకో ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ షేర్లు భారీగా పతనమయ్యాయి. బ్యాంకులకు వేల కోట్లు బకాయిపడ్డ దివాలా ముంగిట నిలిచిన దేశీయ మౌలిక రంగ సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ఆదేశాలతో ల్యాంకో ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ షేర్లు భారీగా పతనమయ్యాయి. బ్యాంకులకు వేల కోట్లు బకాయిపడ్డ దివాలా ముంగిట నిలిచిన దేశీయ మౌలిక రంగ సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ రికార్డ్‌ పతనాన్ని నమోదు చేసింది.

సోమవారం నాటి మార్కెట్‌ ఆరంభలోనే 8.5 శాతం నష్టపోయాయి. అనంతరం మరింత దిగజారి 19.15శాతం కుదేలైంది. ఆ తర్వాత 20 శాతం నష్టపోయి రూ. 1 వద్ద ట్రేడింగ్ అవుతూ ఆల్‌టైం కనిష్టాన్ని నమోదు చేసింది.

Lanco Infra hits record low

శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే 12 నెలల్లో స్టాక్ 50 శాతానికి పైగా పడిపోయింది. కాగా భారీ రుణాలు తీసుకుని, తీర్చలేక డిఫాట్లర్‌గా నిలిచిన సంస్థనుంచి భారీ రుణాలు రికవరీ చేసేందుకు దివాలా చట్టం ప్రకారంగా చర్యలు ప్రారంభించాలని శనివారం ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగానే ల్యాంకోకు రుణాలిచ్చిన ఐడీబీఐ బ్యాంకుకు... ఆర్బీఐ శనివారం ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల కన్సార్టియానికి నేతృత్వం వహిస్తున్న ఐడీబీఐ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసిందని ల్యాంకో ఇన్‌ఫ్రా కూడా శనివారం వెల్లడించింది.

దివాలా, బ్యాంక్రప్సీ కోడ్‌ (ఐబీసీ) కింద ల్యాంకోపై చర్యలు ఆరంభించాలంటూ లీడ్‌ బ్యాంకరు ఐడీబీఐ బ్యాంక్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ల్యాంకో షేర్లు పతమనవుతున్నాయి.

English summary
Shares of Lanco Infratech Ltd fell as much as 8.5 per cent to record low of Rs. 2.15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X