కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప జిల్లాలో ఏం జరుగుతోంది? వర్షాలతో వింత పరిస్థితులు: కుంగుతున్న భూమి

|
Google Oneindia TeluguNews

కడప: ఎక్కడైనా భారీ వర్షాలు పడితే.. వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి. రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటాయి. కడప జిల్లాలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కడపజిల్లా ఉత్తర ప్రాంతంలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వింత పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల ప్రభావానికి జిల్లాలో భూమి కుంగిపోతోంది. శతాబ్దాల కిందట కనుమరుగైన వింత గుహలు దర్శనం ఇస్తున్నాయి. శ్రీకృష్ణ దేవరాయల ఏలుబడిలో కొనసాగిన ప్రాంతం కావడం వల్ల వాటికి ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఈ గుహలను మట్టి, సున్నపురాయి మిశ్రమంతో నిర్మించి ఉండొచ్చని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. గుహల గురించి మరింత అధ్యయనం చేసిన తరువాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని వారు చెబుతున్నారు.

బీజేపీ దూతగా గంటా శ్రీనివాస్? కమలం చక్రం తిప్పుతోందా?: మెగాస్టార్ తో భేటీ వెనుక ఆంతర్యం?బీజేపీ దూతగా గంటా శ్రీనివాస్? కమలం చక్రం తిప్పుతోందా?: మెగాస్టార్ తో భేటీ వెనుక ఆంతర్యం?

చౌడు భూముల్లో వారసత్వ సంపద దాగుందా?

చౌడు భూముల్లో వారసత్వ సంపద దాగుందా?

కడప జిల్లా చింతకొమ్మ దిన్న మండలంలో రెండు, మూడు రోజుల కిందట ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిజానికి ఈ ప్రాంతంలో చౌడు భూములు అధికం అని చెబుతుంటారు. ఈ రకమైన చౌడు భూముల్లో నిల్వ ఉండే నీరు సాధారణంగాం అప్పటికప్పుడు కిందికి ఇంకిపోదు. మొన్నటి భారీ వర్షాల ధాటికి పెద్ద ఎత్తున వర్షపు నీరు నిల్వ ఉండటంతో దాని బరువుకు భూమి ఒక్కసారిగా కుంగిపోయింది. ఏ పదో, ఇరవయ్యో కాదు.. ఏకంగా వంద అడుగుల మేర భూమి కుంగిపోయింది. భూమి కుంగి పోయిన ప్రాంతంలో ప్రాచీన గుహలు వెలుగులోకి గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. చింతకొమ్మ దిన్నె మండలం పరిధిలోని ఇప్పపెంట, బయనపల్లి గ్రామాల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలు ఇతర ప్రాంతాల్లోనూ కురిసినప్పటికీ.. అక్కడ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా గుహలు

గతంలో ఎప్పుడూ లేని విధంగా గుహలు

ఇలా భారీ వర్షాలు పడటం, భూమి కొన్ని అడుగుల మేర కిందికి కుంగిపోవడమనేది చింతకొమ్మ దిన్నె మండల గ్రామస్తులకు కొత్తేమీ కాదు. మూడేళ్ల కిందట కూడా చింతకొమ్మ దిన్నె గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు ఓ సారి భూమి ఇలాగే కుంగిపోయింది. వ్యవసాయ భూములు కుంగిపోవడం వల్ల రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయే గానీ.. ఇలా వింత గుహలు వెలుగులోకి ఎప్పుడూ రాలేదు. తాజాగా- భూమి కుంగిపోవడం, భూగర్భ గుహలు వెలుగులోకి రావడం జిల్లా యంత్రాంగాన్ని కూాడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ గుహలను చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో కొనసాగిన ప్రాంతం కావడం వల్ల ఈ గుహలకు చారిత్రక ప్రాధాన్యత ఉండొచ్చని అంటున్నారు. దీనిపై జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.

భూమి డొల్ల.. అందుకే ఇలా

భూమి డొల్ల.. అందుకే ఇలా

భూమి అంతర్భాగంలో గుహల వల్ల డొల్లతనం ఏర్పడిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గుహల గురించి ఆరా తీయాల్సి ఉందని అంటున్నారు జిల్లా అధికారులు. భూమి డొల్లగా ఏర్పడటానికి ప్రధాన కారణం.. ఏదైనా కట్టడాల నిర్మాణం లేదా భూమి పొరల్లో ఏర్పడిన పరిస్థితులేనని, ఇప్పపెంట, బయనపల్లి గ్రామాల్లో తాజాగా చోటు చేసుకున్న భూమి కుంగుబాటుకు భూగర్భ గుహలు కారణం అయ్యాయని చెబుతున్నారు. ప్రపంచంలోనే అతి ప్రాచీన గుహల్లో ఒకటిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న బెలుం.. ప్రాంతానికి సుమారు 200-250 కిలోమీటర్ల దూరంలో ఇవి వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బెలు గుహలకు కొత్తగా వెలుగులోకి వచ్చిన గుహల మధ్య అనుసంధానం ఉండే అవకాశాలు ఉన్నాయా? లేవా? అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

English summary
ఎక్కడైనా భారీ వర్షాలు పడితే.. వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి. రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటాయి. కడప జిల్లాలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కడపజిల్లా ఉత్తర ప్రాంతంలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వింత పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల ప్రభావానికి జిల్లాలో భూమి కుంగిపోతోంది. శతాబ్దాల కిందట కనుమరుగైన వింత గుహలు దర్శనం ఇస్తున్నాయి. శ్రీకృష్ణ దేవరాయల ఏలుబడిలో కొనసాగిన ప్రాంతం కావడం వల్ల వాటికి ప్రాధాన్యత ఏర్పడుతోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X