హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంజారాహిల్స్‌లో 3.7 ఎకరాలు స్వాహాకు ప్లాన్: ఏపీ టీడీపీ నేత దీపక్‌పై కేసు

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో భూ ఆక్రమణకు యత్నించిన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత దీపక్‌రెడ్డిపై హైదరాబాద్‌ సెంట్రల్‌క్రైమ్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో భూ ఆక్రమణకు యత్నించిన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత దీపక్‌రెడ్డిపై హైదరాబాద్‌ సెంట్రల్‌క్రైమ్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు2లో 3.37ఎకరాల భూమి తమదేనంటూ తప్పుడు పత్రాలు సృష్టించారన్న అభియోగాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో దశాబ్దాల క్రితం నివాసమున్న అయూబ్‌ కమల్‌ అనే శరణార్థికి చెందిన 3.37ఎకరాల భూమిని 1960లో ఎంవీఎస్‌ చౌదరి అండ్‌ బ్రదర్స్‌ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి ఆధీనంలోనే ఉంది. ఈ భూమిని అయూబ్‌ కమలే వేరే ఇద్దరు వ్యక్తులకు విక్రయించినట్టు, అటు పై వారు తమకు అమ్మినట్టు జైహనుమాన్‌ ట్రేడర్స్‌, దీపక్‌రెడ్డిలు నకిలీ పత్రాలు సృష్టించారు.

అనంతరం తమ భూమిని కబ్జా చేశారంటూ ఎంవీఎస్‌ చౌదరి అండ్‌ బ్రదర్స్‌పై జైహనుమాన్‌ ట్రేడర్స్‌ యజమాని కుమారుడు, ప్రధాన నిందితుడు శైలేంద్ర సక్సేనా భూకబ్జా నిరోధక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఎంవీఎస్‌ చౌదరి తరఫు ప్రతినిధి రాధాకృష్ణమూర్తి రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన పత్రాలను కోర్టులో సమర్పించారు.

Land grab in Hyderabad: A case filed on deepak reddy

కొద్దిరోజుల కిందట ఆయన బంజారాహిల్స్‌ పోలీస్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... పోలీస్‌ అధికారులు ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఫిబ్రవరి 7న ఆర్థికనేరాల విభాగం శైలేంద్ర సక్సేనా తదితరులతో పాటు ఎ5గా దీపక్‌రెడ్డిపై కేసు నమోదు చేసింది.ఈ కేసులో ఏ5గా దీపక్‌రెడ్డి ఉన్నారని సీసీఎస్‌ అధికారులు తెలిపారు.

కాగా, ప్రాథమిక విచారణలో ప్రధాన నిందితుడు శైలేంద్ర సక్సేనా తప్పుడు పత్రాలు సమర్పించారని ఆధారాలు లభించడంతో ఆయన్ను అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. చట్టప్రకారం దీపక్‌రెడ్డిపైనా చర్యలు తీసుకుంటామని డీసీపీ(క్రైం)అవినాశ్‌ మహంతి స్పష్టం చేశారు.

English summary
A case filed on TDP leader Deepak Reddy for allegedly land grabbing in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X