అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కియా ఫ్యాక్ట‌రీ భూ కుంభ‌కోణం :14 అసెంబ్లీ స్థానాల్లో 500 కోట్లుతో గెలవాల‌ని..!

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కం ప్ర‌చారం చేసుకుంటున్న కియో మోటార్స్ వ‌ద్ద భూ కుంభ‌కోణం జ‌రిగింని వైసిపి రాజ్యస‌భ సభ్యుడు విజ‌య సాయిరెడ్డి ఆరోపించారు. ఈ కుంభ‌కోణం వెనుక ఇద్ద‌రు మంత్రులు..ఎమ్మెల్యేలు ఉన్నార‌ని సాయి రెడ్డి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అనంత‌లో గెల‌వ‌టానికి 500 కోట్లు వెద‌జ‌ల్ల‌టానికి సిద్ద‌మవుతున్నార‌ని ఆరోపించారు.

అనంతపురం జిల్లా పెనుగొండ కియా ఫ్యాక్టరీ వద్ద భూకుంభకోణం జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ట్విటర్‌లో పలు అంశాలను సాయి రెడ్డి ప్రస్తావించారు. ఈ కుంభకోణం వెనుక టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె ఇద్దరు సోదరులు, మరిది సూత్రధారులుగా ఉన్నారని ఆరోపించారు. పేద రైతులను బలవంత పెట్టి ఎకరానికి 30 వేల రూపాయల కంటే తక్కువకే కొనుగోలు చేశారున్నారు. కియా ప్రాంతంలోని భూములన్నీ పరిటాల బినామీల చేతుల్లోకి వెళ్లిపోయాయని.. ధర్మవరం ఎమ్మెల్యే సూరి కియా పుణ్యమా అని వందల కోట్ల రూపాయలు ఆర్జించార ని ట్వీట్‌లో ఆరోపించారు.

Land Scam in KIA Motors : Vijaya sai reddy on TDP leaders..

వ‌రుస‌గా చేసిన మ‌రో ట్వీట్ లో కియా భూకుంభకోణంతో కాల్వ శ్రీనివాసులతోపాటు నలుగురు ఎమ్మెల్యేలు కోటీశ్వరుల జాబితాలో చేరారని దుయ్య‌బ‌ట్టారు. అనుబంధ పరిశ్రమల వాళ్లు ఎకరం 2 కోట్ల రూపాయలకు కొనాలా. ఎడారి నేల నుంచి కోట్ల రూపాయలు ఎలా అర్జించవచ్చో టీడీపీ నేతలకు తెలుసు. దోచుకున్న సొత్తుతో అనంతపురంలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 500 కోట్ల రూపాయలు వెదజల్లి గెలవాలనేది చంద్రబాబు స్కెచ్‌ అని పేర్కొన్నారు. కియో మోటార్స్ త‌మ ప్ర‌భుత్వం సాధించిన ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టు అని ప్ర‌చారం చేసుకుంటోంది. అదే స‌మ‌యంలో రాజ‌కీయంగానూ అనంత జిల్లా టిడిపికి కీల‌కం. ఇటువంటి పరిస్థితుల్లో విజ‌య సాయిరెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల పై టిడిపి నేత‌లు ఎలా స్పందిస్తార‌నేది కీల‌కంగా మారింది.

English summary
YCP M.P Vijaya Sai Reddy says land scam in Kia motors in Anantapur dist. District ministers and Mlas involved in this scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X