వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబా రామ్‌దేవ్ వచ్చినా భూమి ఇస్తాం: గంటా

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ/ హైదరాబాద్: ఈషా ఫౌండేషన్‌ కోసం ఇవ్వబోయే భూములు యోగా, ధ్యాన కేంద్రాల కోసంకాదని, ప్రపంచస్థాయి సంస్థల కోసం ఇచ్చామని, విశాఖలో బ్రహ్మకుమారీలకు కూడా భూములిచ్చామని, ఒకవేళ రా మ్‌దేవ్‌బాబా వచ్చినా భూములిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో తెలిపారు. ప్రపంచ స్థాయి నైపుణ్యం గల వారితో సీఎం ఒక కమిటీ వేశారని, నివేదిక ఆధారంగానే ఎవరికైనా భూములు కేటాయిస్తామన్నారు.

జగ్గీవాసుదేవ్‌కు చెందిన ఈషా ఫౌండేషన్‌కు భూ కేటాయింపు చేసే యోచనలో ఉన్నామని, అయితే అవి అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల కేంద్రం నుంచి అనుమతులు రావాలని, ఈ భూములు డీనోటిఫై చేసిన తర్వాతనే ఈషా ఫౌండేషన్‌కు చెందుతుందని తెలిపారు. ఏదిఏమైనా నిబంధనలకు అనుగుణంగానే భూకేటాయింపులు ఉంటాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భూమి విలువ తెలుసన్నారు.

 land will be allocated to Baba Ramdev also: Ghanta

రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో అంధత్వాన్ని పూర్తిగా నివారించేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. ఇందులో భా గంగా ఎప్పటికప్పుడు విద్యార్ధులకు నేత్రపరీక్షలు నిర్వహించాలని సూచించారు.

గిరిజనప్రాంతాల్లో ప్రతి వారం నేత్ర పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. గురువారం సచివాలయంలో జరిగిన ‘రైట్‌ టు సైట్‌ సొసైటీ' సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నేత్ర నిధిని ఏర్పాటు చేయడంతోపాటు డయాబెటిక్‌ రేటినోపతి సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

English summary
Andhra Pradesh minister Ghanta Srinivas Rao said that even Baba Ramdev will also be allocated land AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X