వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చివ‌రి రోజు ప్ర‌చారం: లోకేశ్ ల‌క్ష్యంగా జ‌గ‌న్‌: ప‌ల్నాడు లో చంద్ర‌బాబు: సెంటిమెంట్ పండిస్తారా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assebmly Election 2019 : చివ‌రి రోజు ప్ర‌చారం.. సెంటిమెంట్ పండిస్తారా..? || Oneindia Telugu

మరి కొద్ది గంట‌ల్లో ఏపిలో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. ఈ సాయంత్రం 6 గంల‌కు అంతా సొంత నియోజ‌క‌వ‌ర్గాల కు వెళ్లిపోవాల్సిందే. దీంతో..ప్ర‌జ‌ల‌కు నేరుగా ఆక‌ట్టుకొనేందుకు ప్ర‌చారం చివ‌రి రోజున హామీలు..సెంటిమెంట్ పండిం చేందుకు మూడు ప్ర‌ధాన పార్టీల అధినేతలు స‌మాయ‌త్తం అవుతున్నారు. చివ‌రి రోజున వీరి ప్ర‌సంగాల్లో కొత్త అస్త్రాలు ఏమైనా సంధిస్తారా అనే ఉత్కంఠ క‌నిపిస్తోంది.

ప‌ల్నాడు లో చంద్ర‌బాబు..ప‌.గో లో ప‌వ‌న్‌

ప‌ల్నాడు లో చంద్ర‌బాబు..ప‌.గో లో ప‌వ‌న్‌

ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. చివ‌రి రోజున పూర్తి అస్త్ర శ‌స్త్రాల‌తో ప్ర‌జ‌ల ముం దుకు వెళ్లేందుకు నేత‌లు సిద్ద‌మ‌య్యారు. టిడిపి అధినేత చంద్ర‌బాబు గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతంలో ఎన్నిక ల ప్ర‌చారం చేయ‌నున్నారు. తొలుత గుర‌జాల అక్క‌డి నుండి స‌త్తెన‌ప‌ల్లి ఆ త‌రువాత తాడికొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర చార స‌భ‌ల‌తో చంద్ర‌బాబు ప్ర‌చారం ముగియ‌నుంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ తాను పోటీ చేస్తున్న భీమ‌వ‌రం తో పాటుగా అదే జిల్లాలోని పాల‌కొల్లు..న‌ర్సాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌వ‌న్ ప్ర‌చారం చేయ‌నున్నారు. ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు పోటీ చేస్తున్న న‌ర్సాపురం లోక్‌స‌భ ప‌రిధిలో ప‌వ‌న్ చివ‌రి రోజు ప్ర‌చారం ఫిక్స్ చేసుకున్నారు.

లోకేష్ ల‌క్ష్యంగా జ‌గ‌న్ ప్ర‌చారం..

లోకేష్ ల‌క్ష్యంగా జ‌గ‌న్ ప్ర‌చారం..

చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్ పోటీ చేస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ చివ‌రి రోజు ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రా రంభం కానుంది. తొలుత మంగ‌ళ‌గిరి స‌భ‌లో జ‌గ‌న్ పాల్గొంటారు. ఇప్ప‌టికే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసిపి నుండి ష‌ర్మిళ‌, మోహ‌న్ బాబు పార్టీ అభ్య‌ర్దికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసారు. ఇక‌, చివ‌రి రోజున జ‌గ‌న్ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించారు. ఆ త‌రువాత క‌ర్నూలు లో పర్య‌టిస్తారు. ఎన్నిక‌ల ప్ర‌చార చివ‌రి స‌భ తిరుప‌తిలో ఏర్పాటు చేసారు. అక్క‌డ సాయంత్రి స‌భ ద్వారా జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగించి పులివెందుల‌కు చేరుకోనున్నారు. ఇక‌, జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ క‌ర్నూలు జిల్లాలో..సోద‌రి ష‌ర్మిల విజ‌య‌వాడ తో పాటుగా కృష్ణా జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌చారం లో పాల్గొన‌నున్నారు.

సెంటిమెంట్ పండిస్తారా..

సెంటిమెంట్ పండిస్తారా..

ఇక‌, చివ‌రి రోజు ప్ర‌చారంలో భాగంగా ఏపి లోని కీల‌క నేత‌లు ఎటువంటి ప్ర‌సంగాలు చేస్తార‌నే దాని పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొని ఉంది. ఎన్నిక‌ల హామీల‌తో పాటుగా సెంటిమెంట్ పండిచేందుకు నేత‌లు సిద్ద‌మ‌య్యారు. జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల తో పాటుగా ఒక్క ఛాన్స్ ప్లీజ్..అంటూ జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను గెలిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మోదీ..కేసీఆర్ తో జ‌గ‌న్ స‌బంధాల‌ను ఎండ‌గ‌డుతూ ఆత్మ‌గౌర‌వం నినాదంతో చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, ప‌వ‌న్ తాను ఈ రెండు పార్టీల‌కు భిన్న‌మ‌ని..మార్పు అవ‌స‌ర‌మ‌ని చెబుతూ ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు. ఇక‌, చివ‌రి రోజున ఈ ముగ్గురూ ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్ పండించ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. చివ‌రి స‌భ‌ల్లో వీరు ఏం చెబుతారు..చివ‌రి ప్ర‌య త్నాలు ఏ ర‌కంగా ఉంటాయ‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
Election Campaign close to day evening. TDP..YCP..Janasena Chief's are in battle. On last day campaign these three leaders may go with sentiment in speeches to attract people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X