రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

1976లోనే రాజమండ్రి కేంద్ర కారాగారంలో చివరి ఉరి

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: జిల్లాలోని రాజమండ్రి కేంద్ర కారాగారంలో చివరిసారిగా 1976లో ఓ దోషికి ఉరి శిక్ష అమలు జరిగింది. ముంబై పేలుళ్ల కేసులో నేరస్తుడైన యాకుబ్‌ మెమన్‌ ఉరి నేపథ్యంలో.. ఇక్కడ అమలైన ఉరిశిక్షల వివరాలు చూస్తే.. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత రాజమండ్రిలో 47 మంది ఖైదీలను ఉరి తీశారు.

మొదటిసారిగా 1948లో ఐదుగురికి ఈ శిక్ష అమలుచేశారు. చివరిగా ఫిబ్రవరి 1976లో అనంతపురానికి చెందిన నంబి కిష్టప్ప అనే ఖైదీని ఉరితీశారు. ఆ తర్వాత మరెవరికీ ఇక్కడ ఉరిశిక్ష అమలు కాలేదు. కాగా, రాజమండ్రి కేంద్ర కారాగారం డచ్ వారి ఆధ్వర్యంలో నిర్మించబడటం విశేషం.

Last execution held in Rajahmundry central jail in 1976

ఇది ఇలా ఉండగా, ముంబై పేలుళ్ల కేసులో నేరస్తుడైన యాకుబ్ మెమన్‌కు నాగ్‌పూర్ జైలులో గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు చేశారు. 1993, మార్చి 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ప్రధాన దోషిగా నిర్ధారణ అయిన యాకుబ్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు ఉరితీసి ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

English summary
It said that last execution held in Rajahmundry central jail in 1976.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X