వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అనూహ్య నిర్ణయం..లాస్ట్ మినిట్ లో ఇలా..: రాజ్యసభకు షర్మిళ..! విజయసాయిరెడ్డికి చెక్..!

|
Google Oneindia TeluguNews

వైసీపీ నుండి నలుగురు సభ్యులు రాజ్యసభకు వెళ్లనున్నారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల అయింది. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే నాలుగు పేర్లను ఖరారు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇదే సమయంలో సామాజిక ..ప్రాంతీయ సమీకరణాలకు అనుగుణంగా ఎంపిక జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, చివరి నిమిషంలో కొత్త ట్విస్ట్. జగన్ కొత్త పేరును రాజ్యసభకు తెర మీదకు తెచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అతి కొద్ది మంది ముఖ్యులకు మాత్రమే ఈ ఆలోచన మీద సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది.

దీంతో..ఇప్పుడు వైసీపీ అభ్యర్ధుల ప్రకటన ఈ సాయంత్రానికి ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో..జగన్ తాజా ట్విస్ట్ ఆశావాహుల్లో టెన్షన్ కు కారణమవుతోంది. చివరి నిమిషంలో ఎవరి పేర్లు ఖరారవుతాయనే ఉత్కంఠ మొదలైంది. ఇంతకీ జగన్ చేస్తున్న తాజా ఆలోచన ఏంటి.. ఎవరి పేరు పార్టీలో కొత్తగా తెరమీదకు వచ్చింది...ప్రచారం జరగుతున్న విధంగా ఈ కొత్త ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేస్తారా..

 రాజ్యసభకు జగనన్న వదిలిన బాణం..

రాజ్యసభకు జగనన్న వదిలిన బాణం..

తనను నమ్ముకున్న..అండగా నిలిచిన పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్న జగన్..ఇక, తాను జైళ్లో ఉన్న సమయంలో ఎన్నో విమర్శలు..ఆరోపణలు ఎదుర్కొని..కష్టపడి పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పని చేసి..తన స్థానంలో నిలబడి పార్టీకి అండగా నిలిచిన తన సోదరిని సైతం పెద్దల సభకు పంపాలని భావిస్తున్నట్లు విశ్వస నీయ సమాచారం. అయితే, కొద్ది రోజుల క్రితమే దీని పైన చర్చ సాగినా..రాజకీయాల్లోకి రావటానికి షర్మిళ ఆసక్తిగా లేరని చెబుతున్నారు. కానీ, జగన్ పూర్తిగా రాష్ట్రంలో పార్టీ..పాలనా వ్యవహారాలకే పరిమితం అవతున్న పరిస్థితుల్లో ఢిల్లీలో తన సోదరి షర్మిళను రంగంలోకి దింపాలనే ప్రతిపాదన వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం ఇప్పటికే నాలుగు పేర్లు ఖరారు చేసినా..షర్మిళను ఒప్పించేందుకే అధికారికంగా పేర్లు ప్రకటించలేదని తెలుస్తోంది. దీంతో..ప్రస్తుతం అంబానీ ప్రతిపాదంచిన నత్వానీ.. అయోధ్య రామిరెడ్డి...పిల్లి సుభాష్ చంద్రబోస్..మోపిదేవి వెంకట రమణ పేర్లను ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే, పిల్లి బోస్ లేదా మోపిదేవిల్లో ఒకరికి రాజ్యసభ అవకాశం కల్పించి మరొకరి స్థానంలో షర్మిళను రాజ్యసభకు పంపాలని తాజాగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీని పైన కుటుంబ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 నలుగురు ఖరారు..ఆఖరులో ట్విస్ట్

నలుగురు ఖరారు..ఆఖరులో ట్విస్ట్

ఇప్పటికే రాజ్యసభకు వైసీపీ నుండి వెళ్లే నలుగురి పేర్లు ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. అంబానీ వచ్చి స్వయంగా కోరటంతో నత్వానీకి ఖాయమైనట్లు తెలుస్తోంది. అదే విధంగా..తొలి నుండి జగన్ కు అండ గా నిలిచిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కి దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఆయన ఇప్పటికే అసెంబ్లీ కార్యాలయం నుండి నామినేషన్ సైతం తీసుకున్నారు. ఇక, మండలి రద్దు కావటంతో మంత్రి పదవులు కోల్పోతు న్న ఇద్దరు పిల్లి బోస్..మోపిదేవి వెంకట రమణ పేర్లు తెర మీదకు వచ్చాయి. అయితే, తన అనారోగ్యం కారణంగా మోపిదేవి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా బీదా మస్తాన రావు.. పండుల రవీంద్ర బాబు..వైవీ సుబ్బారెడ్డి సైతం రాజ్యసభ ఆశిస్తున్నారు. అయితే, ప్రస్తుతం లోక్ సభలో వైసీపీకి 22 మంది.. రాజ్యసభలో ఇద్దరు సభ్యులున్నా..ప్రధానంగా సాయిరెడ్డి..మిధున్ రెడ్డి మాత్రమే పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. ఇక, ఇప్పుడు ఏపీకి కేంద్ర ఆశీస్సులు అన్ని రకాలుగా అవసరం కావటంతో..వైయస్సార్ కుమార్తెగా..జగన్ సోదరిగా షర్మిళ ఢిల్లీలోనూ అవకాశం ఇస్తే సక్సెస్ అవుతారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీని పైన తుది చర్చలు సాగుతున్నట్లు సమాచారం. షర్మిళ సైతం అంగీకరిస్తే సాయంత్రానికి వైసీపీ నుండి నలుగురి పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Recommended Video

AP CM YS Jagan Review Meeting On Corona Virus | ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి! | Oneindia Telugu
 విజయ సాయిరెడ్డికి చెక్...!

విజయ సాయిరెడ్డికి చెక్...!

ఇప్పుడు చర్చ జరగుతున్నట్లుగా చివరి నిమిషంలో ముఖ్యమంత్రి జగన్ తన సోదరి షర్మిళను రాజ్యసభకు పంపాలని నిర్ణయిస్తే..కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో వైసీపీకి.. ఒక రకంగా ముఖ్యమంత్రికి రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కేంద్రానికి..వైసీపీ మధ్య సంధాన కర్తగా ఉంటున్నారు. పార్టీలోనూ దాదాపు నెంబర్ టు స్థానంలో ఉన్నారు. ఇప్పుడు షర్మిళ రాజ్యసభ ఎంట్రీ ఖాయమైతే సాయిరెడ్డి ప్రాభవం కొంత మేర తగ్గే అవకాశం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకు పార్టీలో పవర్ సెంటర్లు పెంచటం ఇష్టం లేక తన సోదరికి పదవులు ఇవ్వలేదని చెబుతున్నారు. అయితే, ఢిల్లీలో ఉన్న పరిస్థితులు..రాజకీయంగా మారుతున్న సమీకరణాలతో షర్మిళ పేరు పైన చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలో జరగుతున్న ఈ చర్చకు ముఖ్యమంత్రి జగన్ అధికారికంగా తన పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యుల పేర్లను ప్రకటించన తరువాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

English summary
AP CM has made last minute changes to Rajyasabha from his party. If sources are to be believed Sharmila who is Jagan's sister will be stepping into the upper house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X