• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్టీఆర్ మృతి: ఆ రోజు ఏం జరిగిందంటే?: లక్ష్మీపార్వతి సంచలనం

By Narsimha
|

హైదరాబాద్: రాజకీయాల్లో తాను ఎప్పుడూ తలదూర్చలేదని దివంగత ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు.. ఇద్దరు అల్లుళ్ళతో పార్టీలో గ్రూపులు ఏర్పడ్డాయని, పార్టీని సక్రమ మార్గంలో పెట్టేందుకు తనను సహకరించాలని ఎన్టీఆర్ కోరారని లక్ష్మీపార్వతి చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉన్న పార్టీ అకౌంట్‌ను సీజ్ చేయించడంతోనే ఎన్టీఆర్ తీవ్రంగా కలతచెందారని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకొన్నారు.

'కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఐక్యం కావాలి, ఆ సిద్దాంతం కాలం చెల్లింది;, 'టిడిపి విలీనాన్ని ఆహ్వనిస్తాం'

1995లో టిడిపిలో సంక్షోభం సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలతో పాటు ఎన్టీఆర్ మరణానికి ముందు రోజు చోటు చేసుకొన్న పరిణామాలను లక్ష్మీపార్వతి గుర్తు చేసుకొన్నారు. టిడిపి నేతలు తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని లక్ష్మీపార్వతి చెప్పారు.

మోత్కుపల్లికి రమణ కౌంటర్: బాలకృష్ణ రియాక్షన్ ఇది

  లక్ష్మీపార్వతి ఎలాంటిదో ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ! అన్నగారి ధర్మపత్ని కాదు ? | Oneindia Telugu

  ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి పలు అంశాలను ప్రస్తావించారు. తనపై టిడిపి సంక్షోభం సమయంలో తప్పుడు ప్రచారం చేశారని ఆమె చెప్పారు.

  ఎన్టీఆర్ మరణానికి ముందు రోజు ఏం జరిగిందంటే

  ఎన్టీఆర్ మరణానికి ముందు రోజు ఏం జరిగిందంటే

  పార్టీ సంక్షోభం సమయంలో కొంత మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ వైపు ఉన్నారని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. సంక్రాంతి పర్వదినం అయిపోయాక జనవరి 17వ, తేదిన మాజీ మంత్రి దేవినేని నెహ్రు ఎన్టీఆర్ ను కలిసేందుకు వచ్చారని చెప్పారు. పార్టీ తరపున బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు చర్చించుకొన్నారని చెప్పారు. ఆ సమయంలో సభ నిర్వహణకు గాను ఖర్చుపై చర్చించారని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకొన్నారు. అయితే ఈ సభకు అయ్యే ఖర్చుకింద సుమారు రూ.20 లక్షల చెక్ రాసి ఎన్టీఆర్ బ్యాంక్ ఆఫ్ బరోడాకు పంపారని చెప్పారు. అయితే ఆ విషయం తెలిసిన చంద్రబాబునాయుడు అప్పటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించి ఈ నిధులపై స్టే ఆర్డర్ తెప్పించారని లక్ష్మీపార్వతి చెప్పారు.

  అంతటా బాబు మనుషులు ఉండేవారు

  అంతటా బాబు మనుషులు ఉండేవారు

  వ్యూహం ప్రకారంగానే చంద్రబాబునాయుడు తన మనుషులను అంతటా నియమించుకొన్నారని లక్ష్మీపార్వతి ఆ ఇంటర్వ్యూలో ఆరోపించారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పార్టీ అకౌంట్‌లో డబ్బులున్న విషయం తెలుసుకొని వాటిని ఖర్చు చేయకుండా ఉండేందుకు గాను తన మనుషుల ద్వారా సమాచారం తెలుసుకొన్న వెంటనే కోర్టులో పిటిషన్ దాఖలు చేయించారని ఆమె గుర్తు చేసుకొన్నారు. ఆనాడు మా ఇంట్లో కూడ ఎన్టీఆర్‌కు మద్దతు తెలిపినట్టుగా నటిస్తూ కొందరు బాబు మనుషులు ఉన్నారనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.

  పార్టీ నిధులపై స్టే రావడంతో ఎన్టీఆర్ ఆగ్రహం

  పార్టీ నిధులపై స్టే రావడంతో ఎన్టీఆర్ ఆగ్రహం

  బ్యాంక్ ఆఫ్ బరోడాలో పార్టీ నిధులపై చంద్రబాబునాయుడు స్టే తీసుకువచ్చిన విషయాన్ని తెలుసుకొన్న ఎన్టీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారని ఆమె గుర్తు చేసుకొన్నారు. విషయం తెలిసిన వెంటనే కుర్చీలో నుండి లేచి పెద్ద పెట్టున తిట్టాడని ఆమె చెప్పారు. చాలా సేపటివరకు తిడుతూనే ఉన్నాడని ఆమె చెప్పారు. ఈ ఘటనతో ఎన్టీఆర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడని ఆమె చెప్పారు.

  బాబు ప్రమాణం చేసే రోజున ఎన్టీఆర్‌కు అస్వస్థత

  బాబు ప్రమాణం చేసే రోజున ఎన్టీఆర్‌కు అస్వస్థత

  పార్టీ సంక్షోభం సమయంలో ఎమ్మెల్యేల తిరుగుబాటు వైస్రాయ్ ఉదంతం తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రజల వద్దకు వెళ్ళారు. వర్షంలోనే ఎన్టీఆర్ పర్యటనలు జరిపారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆమె చెప్పారు. పర్యటన నుండి హైద్రాబాద్ కు వచ్చాక ఆగష్టు 30వ, తేదిన అస్వస్థతకు గురై కిందపడితే మెడిసిటీ ఆసుపత్రిలో చేర్పించినట్టు ఆమె చెప్పారు. సెప్టెంబర్ 1వ, తేదిన ఎన్టీఆర్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న సమయంలోనే చంద్రబాబునాయడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని ఆమె గుర్తు చేశారు.

   ఎన్టీఆర్ ఆవేశం కొడుకులకు రాలేదు

  ఎన్టీఆర్ ఆవేశం కొడుకులకు రాలేదు

  ఎన్టీఆర్ ఆవేశం కొడుకులకు మాత్రం రాలేదని లక్ష్మీపార్వతి చెప్పారు. చంద్రబాబునాయుడు తొలుత కుటుంబసభ్యులను మేనేజ్ చేసుకొన్నారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీని తన గుప్పిట్లోకి తీసుకొన్నాడని లక్ష్మీపార్వతి ఆరోపణలు చేశారు.

  నాతో ఆవేదనను పంచుకొనేవారు

  నాతో ఆవేదనను పంచుకొనేవారు

  తనతో ఎన్టీఆర్ తన భాదను పంచుకొనేవారని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకొన్నారు.ఎన్టీఆర్ తో వివాహం కాకముందు ప్రతి వారం ఆయనను కలిసిదాణ్ణని ఆమె గుర్తు చేసుకొన్నారు. జీవిత చరిత్ర రాసేందుకుగాను ప్రతి వారం ఎన్టీఆర్ ను కలిసేదాణ్ణని ఆమె చెప్పారు. జీవిత చరిత్ర రాసేందుకు చాలా మంది కలిసినా ఎవరికీ ఎన్టీఆర్ అనుమతి ఇవ్వలేదని చెప్పారు. హిందీలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసేందుకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు అవకాశం ఇచ్చారని, తెలుగులో రాసేందుకు చిట్టచివరికి అవకాశం కల్పించారని ఆమె చెప్పారు. జీవిత చరిత్ర రాసేందుకు ఆయనను ప్రతి వారం కలిసేదాణ్ణని చెప్పారు.

  ఎన్టీఆర్‌తో వివాహం ఘటనపైనే వర్మ సినిమా

  ఎన్టీఆర్‌తో వివాహం ఘటనపైనే వర్మ సినిమా

  ఎన్టీఆర్ జీవిత చరిత్రపై రామ్‌గోపాల్ వర్మ సినిమా తీస్తానని తనకు ఫోన్ చేశారని లక్ష్మీపార్వతి చెప్పారు. అంతేకాదు సినీ నటుడు జెడి చక్రవర్తిని కూడ తన వద్దకు పంపారని ఆమె గుర్తు చేసుకొన్నారు. ఏ పరిస్థితుల్లో ఎన్టీఆర్ తనను వివాహం చేసుకొన్నారోననే అంశాలను ఈ సినిమాలో చూపుతానని వర్మ తనకుహమీ ఇచ్చాడని లక్ష్మీపార్వతి చెప్పారు.చంద్రబాబు, లక్ష్మీపార్వతి వర్గాల వాదనలు వద్దు ఎన్టీఆర్ వాదన సినిమాలో ఉంటేనే తాను అనుమతిస్తానని వర్మకు చెప్పానని,అందుకు రామ్‌గోపాల్ వర్మ కూడ సమ్మతించారని లక్ష్మీపార్వతి ఆ ఇంటర్వ్యూలో ప్రకటించారు.

  మంత్రి పదవి రాలేదని మాధవరెడ్డి కలిశారు

  మంత్రి పదవి రాలేదని మాధవరెడ్డి కలిశారు

  1994లో ఎన్టీఆర్ కేబినెట్ లో మాధవరెడ్డికి మంత్రి పదవి రాలేదు. అయితే ఈ విషయమై మాధవరెడ్డి వచ్చి తనను కలిశారని ఆమె చెప్పారు. కేబినెట్ లో తన పేరు లేకపోవడంతో జిల్లాలో ఇబ్బంది ఎదురౌతున్న విషయాన్ని మాధవరెడ్డి ప్రస్తావించారు

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Laxmi Parvathi said that she has been never involved in TDP politics when NTR was the NTR chief minister of Andhra Pradesh.A Telugu news channel interviewed her on Thursday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more