వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంకా వుంది, త్వరలోనే ప్రకటిస్తా: పవన్ ‘స్వాగతం’పై లక్ష్మీనారాయణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) ఆమోదం పొందాకే భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటిస్తానని మహారాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

త్వరలోనే తన సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తానని తెలిపారు. తన ఉద్యోగానికి రాజీనామా చేయడంలో ఉన్న వెనుక అసలు నిజాలను వెల్లడిస్తానని లక్ష్మీనారాయణ చెప్పారు.

ఇంకావుంది..

ఇంకావుంది..

తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఇంకా కొన్ని ఉన్నాయని అన్నారు. కాగా, రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నపై లక్ష్మీనారాయణ సమాధానం చెప్పలేదు.

గవర్నర్ విద్యాసాగర్ రావుతో లక్ష్మీనారాయణ భేటీ: బీజేపీ వైపేనా?గవర్నర్ విద్యాసాగర్ రావుతో లక్ష్మీనారాయణ భేటీ: బీజేపీ వైపేనా?

 పవన్ స్వాగతించడంపై..

పవన్ స్వాగతించడంపై..

లక్ష్మీనారాయణ వస్తారంటే జనసేనలోకి స్వాగతిస్తానని పవన్‌ అనడంపై ప్రశ్నించగా.. ఆ విషయాన్ని తాను పేపర్‌లో చదివినట్లు తెలిపారు. తానింకా అధికారిగానే ఉన్నాను గనక తన వీఆర్‌ఎస్‌ ఆమోదం పొందాకే అన్ని అంశాలపైనా మాట్లాడతానని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

లక్ష్మీనారాయణ జనసేనకేనా? టచ్‌లో బీజేపీ!, వీఆర్ఎస్‌కు అసలు కారణం ఇదేనా?లక్ష్మీనారాయణ జనసేనకేనా? టచ్‌లో బీజేపీ!, వీఆర్ఎస్‌కు అసలు కారణం ఇదేనా?

రాజీనామా ఆమోదం ఆలస్యం

రాజీనామా ఆమోదం ఆలస్యం

ప్రస్తుతం తన వీఆర్‌ఎస్‌ దరఖాస్తు మహారాష్ట్ర సీఎం పడ్నవీస్ వద్ద ఉందని, దాని ప్రక్రియ ముగిశాక తన భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తానని అన్నారు. తన రాజీనామా ఆమోదం పొందడంలో ఆలస్యం జరుగుతోందని, కానీ, ఉద్దేశపూర్వకంగా కాదని, వరుస సెలవుల వల్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన రాజీనామాపై దృష్టి సారించలేక పోతున్నారని లక్ష్మీనారాయణ తెలిపారు.

బీజేపీనా? జనసేనా?

బీజేపీనా? జనసేనా?

కాగా, లక్ష్మీనారాయణ జనసేనలో చేరుతారని, లేదంటే భారతీయ జనతా పార్టీలో చేరతారని ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే, తమ పార్టీలోకి లక్ష్మీనారాయణ వస్తానంటే స్వాగతిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీ నేతలు కూడా లక్ష్మీనారాయణకు టచ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై లక్ష్మీనారాయణ ప్రకటన చేస్తే తప్ప అసలు విషయం తెలిసే అవకాశం లేదు. అందుకే, ఆయన చెప్పే వరకూ వేచి చూడాల్సిందే.

English summary
CBI former JD Laxminarayana responded on Janasena president Pawan Kalyan's comments on him to join Janasena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X