వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వెంకయ్యా! రిజైన్ చెయ్', జగన్ పిలిచారు.. పవన్ కళ్యాణ్ కలిసి రావాలి!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాడు (విభజన సమయంలో) రాజ్యసభలో పట్టుబట్టిన కేంద్రమంత్రి, బీజేపీ వెంకయ్య నాయుడు ఇప్పుడు దానిపై పిల్లిమొగ్గలు వేస్తున్నారని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని సిపిఐ నేతలు రామకృష్ణ, నారాయణలు గురువారం డిమాండ్ చేశారు.

అసెంబ్లీ: 'జగన్! ఇదేం పద్ధతి, అందర్నీ సస్పెండ్ చేయండి', హక్కుంది కానీ.. టిడిపి నేత

ప్రత్యేక హోదా కోసం విభజన సమయంలో వెంకయ్య పదేళ్ల పాటు ఇవ్వాలని నాటి యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రత్యేక హోదాకు సాంకేతిక కారణాలు ఉన్నాయని బీజేపీ చెబుతోంది. దీంతో వెంకయ్య రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు.

ఎల్లుండి వివిధ పార్టీలు ఏపీ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చామని, దానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మద్దతు పలకాలని సిపిఐ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. బందుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలన్నారు.

Leaders demanding for Venkaiah resignation

ప్రత్యేక హోదా పైన వెంకయ్యది ఆ రోజు (విభజన సమయంలో) ఉడుం పట్టు అని, నేడు మాత్రం ఊసరవెల్లి పట్టు అని సిపిఐ నేత నారాయణ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అంశానికి తెరపడిందన్నారు. బీజేపీ ఏపీ ప్రజలను మోసగించిందన్నారు.

కేంద్రం నుంచి టిడిపి బయటకు రావాలన్నారు. పవన్ కళ్యాణ్ గుడ్డోడు గూట్లో రాయి వేసినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఎల్లుండి జరిపే బందును అందరు విజయవంతం చేయాలన్నారు. తెలుగు ప్రజల పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలన్నారు.

తప్పించుకున్న వెంకయ్య!

వెంకయ్య నాయుడు రాజ్యసభకు రాజస్థాన్ నుంచి వెళ్లారు. తొలుత అతనిని ఏపీ నుంచి పంపిస్తారని వార్తలు వచ్చాయి. అయితే హోదా ప్రభావం నేపథ్యంలో మరో రాష్ట్రం నుంచి పంపించినట్లుగా వార్తలు వచ్చాయి. ఎలాగూ హోదా ఇవ్వరు కాబట్టి.. ఏపీ నుంచి పంపిస్తే ఎక్కువ ఒత్తిడి వస్తుందనే ఉద్దేశ్యంతో బిజెపి ముందు చూపుతో అతనిని రాజస్థాన్ నుంచి పంపించిందనే వాదనలు ఉన్నాయి.

రైల్వేజోన్‌ రాకపోతే పార్లమెంట్‌కు వెళ్లను: ఎంపీ అవంతి

విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట అనకాపల్లి టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో రైల్వే జోన్‌పై ప్రకటన చేయాలన్నారు.

ఇద్దరు కూనీ చేశారు, బాబు ఒప్పుకునేదేంటి: ఎల్లుండి బంద్‌కు జగన్ పిలుపు

రైల్వే జోన్‌ ప్రకటన చేయకపోతే తన పదవీకాలంలో పార్లమెంట్‌కు వెళ్లబోనని ప్రతిన చేశారు. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉత్తరాంధ్రలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓ వైపు ఏపీలో హోదా కోసం ఆందోళనలు, మరోవైపు విశాఖలో హోదాతో పాటు రైల్వే జోన్ కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి.

English summary
Leaders demanding for Union Minister Venkaiah Naidu resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X