వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ లో చేరేందుకు నేతల ఆసక్తి .. అలా వస్తే నో ఎంట్రీ అంటున్న జగన్

|
Google Oneindia TeluguNews

ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతుంది అన్న ప్రచారానికి తెరతీసింది . ఏపీ ప్ర‌జ‌ల నాడిని తెలుసుకునేందుకు జరిపిన పలు ప్ర‌ముఖ సంస్థల స‌ర్వే ఏజెన్సీల రిపోర్టులు కూడా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మే 23 త‌రువాత ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నార‌ని చెబుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార పార్టీ ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. అటు అధికారుల నుండి, ఇటు ఈసీ నుండి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది.

మెరుగైన సమాజ ఉద్యమకారుడి ప్రయాణం: హైదరాబాద్ టు ముంబై వయా కర్ణాటక!మెరుగైన సమాజ ఉద్యమకారుడి ప్రయాణం: హైదరాబాద్ టు ముంబై వయా కర్ణాటక!

ఏపీలో వైసీపీ కే విజయావకాశాలు అంటున్న చాలా సర్వేలు .. వైసీపీ వైపు నేతల దృష్టి

ఏపీలో వైసీపీ కే విజయావకాశాలు అంటున్న చాలా సర్వేలు .. వైసీపీ వైపు నేతల దృష్టి

ఇక ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపధ్యంలో, చంద్రబాబు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన నేపధ్యంలో టీడీపీ విజయం డౌటే అన్న సంకేతాలు టీడీపీ నేతల్లోకి వెళ్ళాయి. రాజ‌కీయ విశ్లేష‌కుల‌తోపాటు, స‌ర్వేలు సైతం జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్యతలు చేప‌ట్ట‌నున్నాడ‌ని, జగన్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్ప‌డంతో ఇప్పుడు ఫిరాయింపు నేతల దృష్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద పడింది. ఇలా అన్ని రిపోర్టుల‌ను చూసిన త‌రువాత వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తెలుసుకున్న ప్ర‌త్య‌ర్ధి పార్టీల ముఖ్య రాజ‌కీయ నేత‌లు వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు ఆస‌క్తిక‌న‌బ‌రుస్తున్నారు.

వైసీపీ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రత్యర్ధి పార్టీల ముఖ్య నాయకులు

వైసీపీ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రత్యర్ధి పార్టీల ముఖ్య నాయకులు

ఇలా పార్టీల‌ను వీడి వైసీపీలో చేరే వారిలో ఏపీలో ప్ర‌ధాన పార్టీకి చెందిన ముఖ్య నేతలు సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. వారు వైసీపీలో చేరేందుకు ఆస‌క్తిచూప‌డంతోపాటు, పార్టీ ముఖ్యుల‌తో ట‌చ్‌లోకి వ‌చ్చారు.మే 23న వెలువ‌డ‌నున్న ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌ల‌తోపాటు, ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధిస్తామని నమ్మకం ఉన్న కొంద‌రు వారి వారి పార్టీల‌ను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్ప‌టి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జోరుగానే సాగుతుంది.

ఫిరాయింపు దారులకు కండీషన్స్ .. పార్టీ మారాలంటే అలా రావాల్సిందే

ఫిరాయింపు దారులకు కండీషన్స్ .. పార్టీ మారాలంటే అలా రావాల్సిందే

ఇక ఎన్నికల సమయంలో పోటీ చేసి గెలిచిన పార్టీ వీడి పక్క పార్టీలో చేరాలని ఆసక్తి చూపుతున్న వారి విషయంలో జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని టాక్. వైసీపీలో చేరేందుకు సిద్ధ‌ప‌డుతున్న ప్ర‌త్య‌ర్ధి పార్టీల అభ్య‌ర్ధుల‌పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. అయితే, 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అదే స‌మ‌యంలో ఫిరాయింపుల‌ను వ్య‌తిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్నర్ నుంచి, రాష్ట్ర‌ప‌తి వ‌రకు అంద‌రికి ఫిర్యాదు చేయ‌డమే కాకుండా, న్యాయ వ్య‌వ‌స్థ‌లో పోరాడిన విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తు చేస్తున్నారు. అందుకే ఫిరాయింపు నేతలకు పార్టీ మారాలంటే కండీషన్స్ పెడుతున్నారు. ప్ర‌త్యర్ధి పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చేవారితో వారి వారి పార్టీల‌కు, ప‌ద‌వుల‌కు అన్నింటికీ రాజీనామా చేయించిన త‌రువాత‌నే పార్టీలోకి చేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే వైఎస్ జ‌గ‌న్ ఉన్నారని సమాచారం . లేదంటే నో ఎంట్రీ బోర్డేనట.

English summary
Jagan had made a sensational decision on those who were interested in joining the YSR congress party. YS Jagan has made a crucial decision on candidates of opposing parties preparing to join the YCP. Those who are willing to join in YCP .. they have some conditions. they have to resign all the parties and posts . the defective MLA's have to resign first and they have to join in YCP . Otherwise there is no entry to the defective leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X