వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయిరెడ్డికి బీజేపీలో లీకులిస్తున్నదెవరు ? కన్నాపై దూకుడు వెనుక వాస్తవాలు..

|
Google Oneindia TeluguNews

ఏపీ బీజేపీలో వర్గపోరు అందరికీ తెలిసిందే అయినా తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న తీవ్ర ఆరోపణల వెనుక కారణాలేంటన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇన్నాళ్లూ కన్నా ఆరోపణలపై ఎప్పుడూ ఇంత తీవ్రంగా స్పందించని సాయిరెడ్డి ఇప్పుడు ఏకంగా సై అంటే సై అనడం వెనుక బీజేపీలో కన్నా వ్యతిరేకుల హస్తం ఉందా అన్న అనుమానాలకు తావిస్తోంది.

 ఏపీ బీజేపీ వర్గపోరు-

ఏపీ బీజేపీ వర్గపోరు-


ఏపీ బీజేపీలో ప్రధానంగా మూడు వర్గాలు ఉన్నాయి. వీటిలో బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న పాతతరం నేతలు ఒ‍క వర్గం కాగా, తాజాగా మాజీ అధ్యక్షుడు హరిబాబు రాజీనామా తర్వాత మారిన పరిస్ధితుల్లో పగ్గాలు అందుకున్న వర్గం మరొకటి. అలాగే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వర్గం ఇంకొకటి. ఈ మూడు వర్గాల్లో పాతతరం నేతలతో ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా ప్రస్తుతం పగ్గాలు చేపట్టిన వారితో టీడీపీ నుంచి వచ్చిన వారితో జత కట్టిన వీరి వ్యతిరేక వర్గం మధ్య నెలకొన్న వర్గపోరు చర్చనీయాంశమవుతోంది.

 కన్నా-సాయిరెడ్డి పోరు వెనుక..

కన్నా-సాయిరెడ్డి పోరు వెనుక..

బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ రాకతో పాటు అధ్యక్ష పగ్గాలు ఇవ్వడాన్ని ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న వారిలో సోము వీర్రాజు, పురంధేశ్వరి, జీవీఎల్ నరసింహారావు వంటి వారు ఉన్నారు. వీరంతా కన్నా నిర్ణయాలపై గతేడాది ఎన్నికల ముందు నుంచీ అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయం వెనుక కన్నా వైఫల్యమే ఉందనేది ఇప్పటికీ వారి నమ్మకం. అయితే ఈ విషయాన్ని అంతర్గత చర్చల్లో మాత్రమే ప్రస్తావించే వీరు.. బయటికి మాత్రం అంతా ఒకటే అన్నట్లుగా ఉంటుంటారు. వీరంతా అవకాశం దొరికినప్పుడు కన్నాపై పోరుకు సిద్ధంగానే ఉంటున్నారు. అదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలకు దిగడంతో సహజంగానే వీరిపై అనుమానాలు మొదలయ్యాయి.

వ్యూహాత్మకంగానే లీకులు.. ?

వ్యూహాత్మకంగానే లీకులు.. ?

కన్నా లక్ష్మీనారాయణను అవకాశం దొరికితే ఇరికించాలన్న భావనతో ఉన్న ఆయన వ్యతిరేకులు.. విజయసాయిరెడ్డికి ఈ మేరకు లీకులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో అంతర్గత విషయాలను సైతం ప్రస్తావిస్తూ సాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఈ అనుమానాలు నిజమేనని అర్ధమవుతోంది. బీజేపీ రాష్ట్ర శాఖలో అతి ముఖ్యులైన కొందరికి తెలిసిన విషయాలను సైతం పార్టీ నేతలా విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న తీరు చూస్తుంటే కన్నాకు వ్యతిరేకంగా బీజేపీలో ఏం జరుగుతుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Recommended Video

Yogi Adityanath Not Going To Participate In His Father Last Rites
అధ్యక్ష పదవి కోసమేనా ?

అధ్యక్ష పదవి కోసమేనా ?

కరోనా వైరస్ ప్రభావం మొదలు కాకముందు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిలో మార్పుకు రంగం సిద్ధమైంది. కొత్త అధ్యక్షుడి రేసులో ఉన్న వారి పేర్లను అధిష్టానం తీవ్రంగా పరిశీలించడం, అదే క్రమంలో రేసులో ఉన్నవారు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం కూడా జరిగిపోయాయి. మరోవైపు కరోనా రాకతో అధ్యక్షుడి మార్పు వ్యవహారం మూలనపడింది. దీంతో కరోనా తగ్గగానే తిరిగి ఈ ప్రక్రియ ప్రారంబం కానున్న తరుణంలో కన్నాకు వ్యతిరేకంగా పావులు కదపడం ద్వారా తమ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని పార్టీలో కొందరు నేతలు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత వరకూ నిజముందో తెలియదు కానీ.. తాజా పరిణామాలు మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు కన్నాకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయని మాత్రం చెప్పకతప్పదు.

English summary
andhra pradesh bjp president kanna lakshmi narayana suspect conspiracy against him with in the party behind ysrcp mp vijaya sai reddy's latest remarks. bjp leaders divided with in the party over ysrcp mp vijaya sai reddy's recent comments. some of them are reacted strongly and others kept quiet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X