వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగపూర్‌ను ఎలా నిర్మించాలో తెలుసుకోండి: పవన్ చురక, 'ఆయనతో శాంతిభద్రతల సమస్య'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

సింగపూర్‌ను ఎలా నిర్మించాలో చెప్పిన పవన్

హైదరాబాద్/అమరావతి: సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసే పోస్టులపై టీయూడబ్ల్యూజే నేత క్రాంతికిరణ్ మండిపడ్డారు. ఆయన తాగి ఆ సందేశాలు పెడుతున్నారో లేక ఎలా పెడుతున్నారో అర్థం కావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మీడియాను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారని, మీడియాను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా సంస్థలకు పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. పవన్ కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రత సమస్య తలెత్తుతుందని, హైదరాబాద్ నుంచి ఆయనను పంపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు.

సభ్యసమాజం ఆమోదించదు: బాలకృష్ణపై పురంధేశ్వరి ఆగ్రహం, కర్నాటకలో ప్రచారంసభ్యసమాజం ఆమోదించదు: బాలకృష్ణపై పురంధేశ్వరి ఆగ్రహం, కర్నాటకలో ప్రచారం

సింగపూర్ నిర్మాణం గురించి చదవండి

మరోవైపు, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తనకు స్ఫూర్తిని ఇచ్చే ప్రపంచ నాయకుల్లో లీ కున్ యూ ఒకరు అని పవన్ కళ్యాణ్ ఒకరు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సింగపూర్‌ నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఆయన జీవిత కథ చదవాలన్నారు. దీనిని సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి పెట్టారని భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ ఫ్రమ్ థర్డ్ వరల్డ్ టు ఫస్ట్ ్నే పుస్తక ముఖచిత్రాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

మనిషిలోని చెడుపై పోరాడుదాం

ప్రతి ఒక్కరూ చెడ్డ మనుషులపై పోరాటం చేయాలని అనుకుంటున్నారని కానీ మనం మనిషిలోని చెడుపై పోరాడాలని పవన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వరుసగా కొన్ని సూక్తులు పోస్ట్ చేశారు. విష బీజాల నుంచి అమృత ఫలాలు పుట్టవని, విరోధం నుంచి స్నేహం పుట్టదని పేర్కొన్నారు.

తన డేరీ నుంచి మరో పోస్ట్

అణిచివేతతో ఆరంభమైన అధికారం నిలవదని, మా లెక్కల ప్రకారం విరోధం రాజుల మధ్యన ఉంది కానీ వివిధ ప్రాంతాల ప్రజల మధ్య లేదని, వారు తామందరం భారతీయులమని అనుకుంటున్నారని ఖారవేలుడు నవల నుంచి తాను డైరీలో రాసుకున్న వ్యాఖ్యలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఇన్ పర్సూట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్

ఇన్ పర్సూట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్

ఆంధ్రా, రాయలసీమల్లో సామాజిక, రాజకీయ అంశాలపై మరింత లోతుగా ఈ పుస్తకం ద్వారా అర్థం చేసుకున్నానని పవన్ కళ్యాణ్ ఓ పుస్తకాన్ని పోస్ట్ చేశారు. 'ఇన్ పర్సూట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్' అనే పుస్తకాన్ని పోస్ట్ చేశారు. ఆ పుస్తకంలోని కొన్ని పేరాలను కూడా మరో పోస్టులో పెట్టారు.

English summary
'Late ‘Lee Kuan yew’is one of my Inspirational World leaders. To understand how Singapore was built then you should read his biography.' Pawan Kalyan tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X