వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లెఫ్ట్‌పార్టీల రైట్: పవన్ అందగాడే కానీ.. నారాయణ డౌట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకోవాలని సిపిఎం, సిపిఐ పార్టీలు నిర్ణయించాయి. పొత్తుల విషయమై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, పార్టీల ఇతర నాయకులు భేటీ అయ్యారు. పొత్తులపై చర్చించారు. అనంతరం నారాయణ, రాఘవులు విలేకరులలో మాట్లాడారు.

మున్సిపల్, ఎంపిటిసి, జడ్పిటిసి, సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని చెప్పారు. సీట్ల సర్దుబాటు కోసం మరో దఫా చర్చించనున్నారు. కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీయేతర పార్టీలతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. హైదరాబాదులో మగ్థూం భవన్‌లో చర్చించారు. బిజెపిలాంటి మతతత్వ పార్టీని దూరంగా పెడుతామన్నారు.

Left Parties alliance in local body elections

కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పెట్టడాన్ని వామపక్షాలు స్వాగతించాయి. ఈ సందర్భంగా నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నటుడు పవన్ కల్యాణ్ అందంగా ఉంటాడు అంతే తప్ప ఇంకేమీ తెలియదన్నారు. ఆయన అందగా ఉంటాడని తెలుసునని, ఓట్లు రాబడుతారో లేదో తెలియదన్నారు. మిగతా అంశాలపై తాము పార్టీ పెట్టాక ఆలోచిస్తామన్నారు.

తాజా నిర్ణయంతో వామపక్షాలు చాలాకాలం తరువాత ఎన్నికల బరిలో నిల్చుంటున్నాయి. గతంలో కాంగ్రెస్‌తో ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీతో ఒక పార్టీ జత కలిసి ఎన్నికల బరిలో దిగాయి.

పార్టీ విధానాలు త్వరలో: కిరణ్

జై సమైక్యాంధ్ర పార్టీ విధివిధానాలను తాను త్వరలో ప్రకటిస్తానని ఆ పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల నాడి బట్టే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.

English summary
Left Parties alliance in Andhra Pradesh local body elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X