వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామపక్ష నేతలకు పవన్ ఫోన్: ఫిబ్రవరి 16న, లెఫ్ట్‌ నేతలతో పవన్ భేటీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రానికి చెందిన సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులకు బుదవారం నాడు ఫోన్ చేశారు. ఈ నెల 16, తేదిన హైద్రాబాద్‌లో రావాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై నిరసనలు వ్యక్తమౌతున్న తరుణంలో వామపక్ష పార్టీలకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

Recommended Video

Pawan Kalyan Has Proposed Fact Finding Committee

జగన్ దెబ్బ: ఆత్మరక్షణలో చంద్రబాబు, ఏం చేస్తారు?జగన్ దెబ్బ: ఆత్మరక్షణలో చంద్రబాబు, ఏం చేస్తారు?

జనసేన చీప్ పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధుల విడుదల విషయమై జెఎఫ్‌సి ఏర్పాటు చేశారు. అయితే జెఎఫ్‌సి కేంద్రం నుండి వచ్చిన నిదులు రాష్ట్రం చెబుతున్న వివరాలపై నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు.

బిజెపిని నమ్మి మోసపోయాం,2 ఏళ్ళ క్రితమే రాజీనామా, పవన్ రాజకీయాలకు పనికిరాడు:జెసిబిజెపిని నమ్మి మోసపోయాం,2 ఏళ్ళ క్రితమే రాజీనామా, పవన్ రాజకీయాలకు పనికిరాడు:జెసి

ఈ తరుణంలో సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులతో పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉంది.ఈ మేరకు జనవరి 16, తేదిన పవన్ కళ్యాణ్‌తో సమావేశం కానున్నారు. హైద్రాబాద్‌లో సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులతో పవన్ సమావేశం కానున్నారు.

సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులతో పవన్ సమావేశం

సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులతో పవన్ సమావేశం

ఫిబ్రవరి 16,వ తేదిన సిపిఐ , సిపిఎం రాస్ట్ర కార్యదర్శులతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. జెఎప్‌సి లో చర్చించనున్న అంశాలతో పాటు ఇతర విషయాలపై చర్చించే అవకాశం ఉందని జనసేన వర్గాలు తెలిపాయి.

 ఏం చర్చిస్తారు

ఏం చర్చిస్తారు

గతంలో కూడ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో ఏపీ సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణతో చర్చించారు. ఏపీ రాజకీయాలపై చర్చించారు. అయితే ఏపీ రాజకీయాలపై చర్చించడంతో పాటు ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరింత డెవలప్‌మెంట్ ఉండే అవకాశం లేకపోలేదు.ఈ తరుణంలో వామపక్షపార్టీలతో పవన్ కళ్యాణ్ సమావేశం కావాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

 జెఎప్‌సి నివేదిక తర్వాత ఏం చేస్తారు

జెఎప్‌సి నివేదిక తర్వాత ఏం చేస్తారు

ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో జెఎప్‌సి నివేదికను త్వరలోనే ఇవ్వనుంది.ఈ నివేదిక తర్వాత ఏం చేయాలనే విషయమై కూడ వామపక్షాలతో చర్చించే అవకాశం లేకపోలేదు. ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్రబడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపు విషయమై నిరసనగా ఫిబ్రవరి 8వ, తేదిన ఏపీ రాష్ట్ర బంద్‌కు సిపిఐ పిలుపునిచ్చింది.ఈ బంద్‌కు ఇతర పార్టీలు మద్దతిచ్చాయి. అయితే జెఎప్‌సి నివేదిక తర్వాత ఏ పార్టీ చెబుతోంది వాస్తవమో తేలనుంది.దీన్ని పురస్కరించుకొని ఆందోళన కార్యక్రమాలపై ప్లాన్ చేసే అవకాశం లేకపోలేదని జనసేన వర్గాల్లో ప్రచారంలో ఉంది.

 ఎన్నికల వాతావరణం

ఎన్నికల వాతావరణం

ఏపీ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. కేంద్రం నుండి బడ్జెట్ కేటాయింపుల అంశంతో పాటు ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని రాజకీయ పార్టీలు ఇప్పటికే ఆందోళన బాట పట్టాయి.ఈ తరుణంలో ఎన్నికల వాతావరణం ఏపీలో కన్పిస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపుల విషయంలో అన్యాయం జరిగిందనే అభిప్రాయాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ పార్టీలు వ్యూహలను రచిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం కలిగేలా పార్టీలు వ్యూహన్ని రచిస్తున్నాయి.

English summary
Janasena chief minister Pawan Kalyan phoned to CPI, CPM Ap state secretaries on Wednesday.Cpi secretary K. Rakrishna, cpm secretary Madhu will meet Pawan Kalyan on Feb 16 at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X