వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుల రాజకీయాలు, దళితులపై దాడులు గాంధీజీ మార్గంలో ఎదిరిద్దాం : చంద్రబాబు ,లోకేష్ ట్వీట్స్

|
Google Oneindia TeluguNews

మహాత్మా గాంధీ 151 వ జయంతి సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. మహాత్ముడు గొప్పతనాన్ని స్మరించుకున్నారు. సోషల్ మీడియా వేదికగా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు మానవాళి చరిత్రలో గాంధీజీ ఒక సమున్నత శిఖరాలను కొనియాడారు. సమ సమాజ స్థాపన కోసం మహాత్మా గాంధీ తపించారని పేర్కొన్నారు .

టీడీపీ నాయకుల కార్ఖానా .. ఒక్కరు పోతే వంద మందిని తయారు చేస్తా.. చంద్రబాబు ఉద్వేగంటీడీపీ నాయకుల కార్ఖానా .. ఒక్కరు పోతే వంద మందిని తయారు చేస్తా.. చంద్రబాబు ఉద్వేగం

దళితులపై దాడులు , సమసమాజం కోసం గాంధీ బాటలో సాగుదాం అన్న చంద్రబాబు

దళితులపై దాడులు , సమసమాజం కోసం గాంధీ బాటలో సాగుదాం అన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు కొనసాగుతున్నాయని, దేశంలోని దళితులపై జరుగుతున్న దాడులు ఏపీ ముందుండటం దురదృష్టకరమని చంద్రబాబు పేర్కొన్నారు. కుల రాజకీయాలను, దళితులపై కొనసాగుతున్న అణచివేతను గాంధీ చూపిన అహింసాయుత మార్గంలోనే ఎదిరిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు . సమాజంలో సమానత్వాన్ని సాధించి చూపటమే గాంధీజీకి మనం అందించగలిగే అసలైన నివాళి అంటూ చంద్రబాబు పేర్కొన్నారు .

రైతు హక్కులను కాపాడేందుకు నడుం బిగిద్దామన్న టీడీపీ అధినేత

రైతు హక్కులను కాపాడేందుకు నడుం బిగిద్దామన్న టీడీపీ అధినేత

ఇదే సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కూడా ఆ మహనీయుడ్ని స్మరించుకున్నారు . రాజకీయాలంటే స్వార్థమెరుగకుండా ప్రజాసేవలో తరించడమని... నైతిక విలువలతో కూడిన రాజకీయాలే ప్రజల భవిష్యత్తును వెలుగుమయం చేయగలవని నమ్మిన మహాశయుడు లాల్ బహదూర్ శాస్త్రి. ఆ మహనీయుని జయంతి సందర్భంగా జై కిసాన్ అన్న ఆ దేశభక్తుని స్పూర్తితో రైతు హక్కులను కాపాడేందుకు నడుం కడదాం అంటూ బాబు పిలుపునిచ్చారు .

సమాజ సమానత్వం కోసం మహాత్ముడి మార్గంలో నడుద్ధామన్న లోకేష్

సమాజ సమానత్వం కోసం మహాత్ముడి మార్గంలో నడుద్ధామన్న లోకేష్

మహాత్మా గాంధీ 151 వ జయంతి సందర్భంగా జాతిపిత గాంధీజీ స్మరిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా నివాళులర్పించారు. గాంధీజీ అందించిన స్ఫూర్తి, ఆయన కలిగించిన ప్రేరణ ఎన్నో పోరాటాలకు ఊపిరి పోసిందని నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మికవేత్తలు ప్రేరణ కలిగించి వివక్షపై, నిరంకుశత్వం పై జరుగుతున్న ఎన్నో పోరాటాలకు గాంధీజీ సిద్ధాంతాలు మార్గం చూపించాయని లోకేష్ సందర్భంగా పేర్కొన్నారు. గాంధీ జయంతి వేళ సమాజ సమానత్వం సాధించడం కోసం, రైతు సౌభాగ్యం కోసం ఆ మహాత్ముడు సూచించిన మార్గంలో నడుద్దామని లోకేష్ పిలుపునిచ్చారు.

Recommended Video

Telangana Telugu Desam Cadre With L. Ramana | నాయకత్వం లో మార్పు ఉండదు .
 నైతిక విలువలతో కూడిన రాజకీయాల కోసం కృషి చేద్దాం

నైతిక విలువలతో కూడిన రాజకీయాల కోసం కృషి చేద్దాం

లోకేష్ కూడా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు . స్వతంత్ర భారతదేశానికి రెండవ ప్రధానిగా గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ లకు బాటలు వేసి రైతు సంక్షేమానికి, పల్లెల ప్రగతికి బాటలువేసిన దార్శనికుడు లాల్ బహదూర్ శాస్త్రి. ఆ మహనీయుని స్ఫూర్తిగా రైతు సంక్షేమం కోసం నైతిక విలువలతో కూడిన రాజకీయాల కోసం కృషిచేద్దాం అంటూ లోకేష్ ట్వీట్ చేశారు .

English summary
Chandrababu said that attacks on Dalits were continuing in the state of Andhra Pradesh and it was unfortunate that the AP was taking the lead in the ongoing attacks on Dalits in the country. Chandrababu called for confronting caste politics and the ongoing oppression of Dalits in the non-violent way shown by Gandhi. Chandrababu and also nara lokesh said that the real tribute we can pay to Gandhiji is to achieve equality in the society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X