హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో ఆర్డినెన్స్: వెంకయ్య, కుక్కలు చింపిన విస్తరిలా: హీరో శివాజీ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రైతుల అభివృద్ధికే భూసేకరణ సవరణ బిల్లు ప్రభుత్వం తీసుకొస్తోందని, విపక్షాలు సహకరించకుంటే మరోమారు ఆర్డినెన్స్ జారీచేయడం తప్ప గత్యంతరం లేదని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ 11 సార్లు ఒకే అంశంపై ఆర్డినెన్స్‌లు ఇచ్చిన దాఖలాలున్నాయని గుర్తుచేశారు.

సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్డినెన్స్ ఏప్రిల్ 6 వరకూ చెల్లుబాటు అవుతుందని, బిల్లుగా వస్తే సంతోషం లేకుంటే ఆర్డినెన్స్ తప్పదన్నారు. విపక్షాలు చేస్తున్నవి అర్ధంపర్ధం లేని ఆరోపణలని, మంచి సూచనలు చేస్తే స్వీకరించడానికి ఎపుడూ సిద్ధమన్నారు. బిల్లువల్ల దేశానికి మేలు జరుగుతుందని చెప్పారు. పరిశ్రమలు ఆకాశంలోరావని, భూమిమీదనే రావాల్సి ఉంటుందని, అందుకోసం భూసేకరణ తప్పదన్నారు.

80శాతం అంగీకరిస్తేనే భూసేకరణ జరగాలంటే అది సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడ్డారు. రైతులు, వారి కుటుంబీకులు అంతా సహకరిస్తేనే దేశ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఉన్నట్టు అవుతుందని అన్నారు. పరిశ్రమలు ప్రజలకు శత్రువులు కాదని వెంకయ్య సూచించారు. కొన్నిపక్షాలు కొన్ని సందేహాలు లేవనెత్తితే 9 సవరణలు చేశామని, మన్‌కీ బాత్‌లో కూడా ప్రధాని అనేక వివరాలు అందించారని, కొత్త ఆలోచనలు ఎవరు చేసినా స్వీకరించేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు.

ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: హీరో శివాజీ

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని పలికిన అన్ని రాజకీయ పార్టీల నేతలు ఇప్పుడు ఏపీ ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని హీరో శివాజీ విమర్శించారు. ప్రత్యేక హోదాపై నాయకులను నమ్మి ఓటేస్తే నిబంధనలంటూ ఆ అంశాన్ని తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేశారని దుయ్యబట్టారు.

ఏప్రిల్ 6 వరకే, మరోసారి ఆర్డినెన్స్ జారీ

ఏప్రిల్ 6 వరకే, మరోసారి ఆర్డినెన్స్ జారీ

ఏ బిల్లుపైనైనా అర్ధవంతమైన చర్చను తాము స్వాగతిస్తామని, ఇది రాజకీయ చట్టంకాదని, ప్రజా ప్రయోజనాల కోసం చేసిన చట్టమని గుర్తుంచుకోవాలని సూచించారు. పరిశ్రమల వల్ల భూముల ధరలు పెరగడం, ఉపాధి కల్పన సాధ్యమవుతుందని చెప్పారు. వాయిదాల మధ్య కూడా అనేక చర్చలు జరిగాయని, బిల్లుల ఆమోదం జరిగిందని అన్నారు. ఇన్స్యూరెన్స్ బిల్లు ఆమోదం పొందిందని, అలాగే గనుల చట్టం కూడా ఆమోదం పొందిందని పేర్కొన్నారు.

ఏప్రిల్ 6 వరకే, మరోసారి ఆర్డినెన్స్ జారీ

ఏప్రిల్ 6 వరకే, మరోసారి ఆర్డినెన్స్ జారీ

బిల్లుపై కొంతమంది తప్పుదారి పట్టారని, మరికొంత మంది తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. మొత్తంమీద చూస్తే రాజ్యసభలోనూ, లోక్‌సభలోనూ గతవారం చర్చలు ఉత్పాదకంగా జరిగాయని పార్లమెంటు నివేదిక తేల్చిందన్నారు. న్యాయ పరిహారానికి సంబంధించిన బిల్లు, భూ పునరావాస బిల్లు, జిఎస్‌టి బిల్లులు త్వరలో పార్లమెంటుకు రానున్నాయన్నారు.

 ఏప్రిల్ 6 వరకే, మరోసారి ఆర్డినెన్స్ జారీ

ఏప్రిల్ 6 వరకే, మరోసారి ఆర్డినెన్స్ జారీ

కఠినాతి కఠినమైన నల్లధనం బిల్లు సభలోకి రానుందన్నారు. దానిని ఆమోదించగలిగితే దేశానికి మేలు జరుగుతుందని అన్నారు. భూ సేకరణ బిల్లును రాష్ట్రాలు వద్దనుకుంటే పాతబిల్లునే అమలుచేసుకునే వీలుకూడా ఇందులో కల్పించామని, కనుక ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

 ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: హీరో శివాజీ

ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: హీరో శివాజీ

ప్రత్యేక హోదా లభిస్తే పరిశ్రమలు వచ్చి యవకులకు ఉద్యోగాలు దొరుకుతాయనే ఆశ ఉందని, అందుకోసం పోరాటం చేస్తామన్నారు.

 ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: హీరో శివాజీ

ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: హీరో శివాజీ

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకు అన్యాయం చేస్తోందని, దీనిపై పార్టీలకు అతీతంగా మేధావులు, విద్యావంతులతో ఈనెల 24 నుంచి మూడు రోజుల పాటు రౌండ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24న తిరుపతిలో, 25న విజయవాడ ప్రెస్ క్లబ్‌లో, 26న విశాఖలో సమావేశాలు ఉంటాయన్నారు.

English summary
Union Minister M Venkaiah Naidu today asserted the Land Bill proposed by the NDA government is pro-farmer and will reduce poverty, even as he favoured a national debate on the legislation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X