వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కుక్కలు, పందులకు లైసెన్సు.. పెంచుకోవాలంటే అనుమతి, నిబంధనలు తెలిస్తే షాక్ !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది . ఆంధ్రప్రదేశ్లో కుక్కలు, పందుల పెంపకానికి లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి చేసింది. లైసెన్సులు లేని జంతువుల నియంత్రణకు నిబంధనలు విడుదల చేసింది జగన్ సర్కార్. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ గతంలో జారీ అయిన నిబంధనల స్థానంలో కొత్త వాటిని అమలు చేయడం కోసం ఉత్తర్వులను జారీ చేసింది.

కుక్కలు, పందులను పెంచుకోవాలంటే అనుమతులు తప్పనిసరి చేసిన జగన్ సర్కార్

కుక్కలు, పందులను పెంచుకోవాలంటే అనుమతులు తప్పనిసరి చేసిన జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఆసక్తికరమైన ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా సరే కుక్కలు, పందులను పెంచుకోవాలంటే అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే వాటికి సంబంధించిన యజమానులకు 500 రూపాయల ఫైన్ విధించేలా కూడా నిర్ణయం తీసుకుంది. అంతేకాదు రోజుకు 250 రూపాయల చొప్పున పెనాల్టీ కూడా వసూలు చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది.

స్థానిక యంత్రాంగానికి దరఖాస్తు చేసుకుని లైసెన్స్ పొందాలని ఆదేశం

స్థానిక యంత్రాంగానికి దరఖాస్తు చేసుకుని లైసెన్స్ పొందాలని ఆదేశం

కుక్కలు ,పందుల్ని పెంచుతున్న యజమానులు లైసెన్స్ తీసుకోవడం కోసం లేదా రెన్యువల్ చేసుకోవడం కోసం స్థానిక యంత్రాంగానికి దరఖాస్తు చేసుకోవాలని కుక్క లకు సంబంధించిన యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించినట్లు ధ్రువీకరణ పత్రం, అవి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయన్న ధృవీకరణ పత్రం కూడా పొందాలని ఈ ఉత్తర్వులలో సూచించింది. ఇక పందులకు సంబంధించిన ఆరోగ్య పత్రాన్ని కూడా వెటర్నరీ వైద్యుల నుంచి తీసుకుని దరఖాస్తు సమయంలో సమర్పించాలని సూచించింది. అలా దరఖాస్తు చేసుకున్న జంతువులకు లైసెన్సులు ఇస్తూ టోకెన్లు జారీ చేయనున్నారు.

లైసెన్స్ గా టోకెన్ .. అది జంతుల మేడలో ఉండేలా చూడాలని ఆదేశం

లైసెన్స్ గా టోకెన్ .. అది జంతుల మేడలో ఉండేలా చూడాలని ఆదేశం

ఈ టోకెన్లను జంతువుల మెడలో కానీ, చెవులపై కానీ ఉండేలా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. జంతువులకు సంబంధించి ఈ టోకెన్లనే, లైసెన్సులు గా భావిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామాల వారీగా తిరిగే వీధి కుక్కలు, పందులను గుర్తించి బహిరంగ నోటీసులు జారీ చేయాలని కూడా పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసింది.

ఇక లైసెన్సులు తీసుకున్నామని జంతువులను బయట వదిలేస్తే కచ్చితంగా ఫైన్ విధించాలని ఆదేశించింది.

 లైసెన్స్ లు లేకుండా జంతువులను పెంచితే ఫైన్స్ ..వీధికుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

లైసెన్స్ లు లేకుండా జంతువులను పెంచితే ఫైన్స్ ..వీధికుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

లైసెన్సులు తీసుకోకుండా జంతువుల పెంపకం సాగిస్తే ఫైన్లు వెయ్యటమే కాదు , పట్టుకున్న సమయంలో అవి తమవని ఎవరూ ముందుకు రాకపోతే వీధి కుక్కలుగా, వీధుల్లో తిరిగే పందులుగా పరిగణించి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చెయ్యాలని పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యం పాలై, ప్రమాదకరంగా ఉన్న వీధి జంతువులను మాత్రమే చంపేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక కుక్కలు , పందుల కు తీసుకున్న లైసెన్సుల గడువు ముగిసి పోతే తిరిగి 10 రోజుల్లో అనుమతులు రెన్యువల్ చేయించుకోవాలని పేర్కొంది.

గ్రామానికి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో పెంపుడు పందులు

గ్రామానికి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో పెంపుడు పందులు

పెంపుడు పందులను గ్రామానికి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో పెంచాలని స్పష్టం చేసింది. వీధి కుక్కల విషయంలో కూడా పంచాయితీలు తగిన చర్యలు తీసుకోవాలని, స్థానికులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవాలని, అలాగని అమానవీయ దృష్టితో జంతువులను చూడరాదని పేర్కొంది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మూగజీవాలను పెంచుకోవాలంటే కూడా లైసెన్సు తీసుకోవాల్సిన పరిస్థితి తప్పనిసరైంది.

English summary
AP Government issued a curious GO making it mandatory for getting licenses for dogs and pigs in the State. Jagan Government has issued licenses for breeding dogs and pigs in Andhra Pradesh. Issued regulations for the control of unlicensed animals .The Panchayati Raj and the Rural Development Department have issued orders to implement the new regulations replacing the earlier regulations regarding the control of dogs and pigs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X