శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిక్కోలు లిఫ్ట్ పథకాలకు అధికార గ్రహణం: మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదనలూ బేఖాతర్

మరో మూడు నెలల్లో 28 సాగునీటి పథకాలను ప్రారంభించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పదేపదే చెప్తున్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: మరో మూడు నెలల్లో 28 సాగునీటి పథకాలను ప్రారంభించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పదేపదే చెప్తున్నారు. కానీ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదిత ఎత్తిపోతల పథకాలకు గ్రహణం పట్టింది. నీటి లభ్యత అనుమతుల్లోనే ఎడతెగని జాప్యం జరుగుతోంది.
ఆయా పథకాల అమలు కోసం అనుమతులు మంజూరు చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వంలోని అధికార యంత్రాంగం పలు అడ్డంకులు స్రుష్టిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రమారమీ 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు రూపొందించిన ప్రతిపాదనల్లో కేవలం రెండింటికి మాత్రమే అనుమతులు లభించాయి.
మిగిలిన ఎత్తిపోతల పథకాలకు అధికార యంత్రాంగం పలు రకాల అడ్డంకులు కల్పిస్తున్నాయి.

మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదించిన ప్రతిష్ఠాత్మక బొంతు ఎత్తిపోతల పథకానిదీ ఇదే పరిస్థితి అంటే అతిశేయోక్తి కాదు. పథకం నిర్మాణానికి టెండర్లు సైతం వాయిదా పడటం గమనార్హం. పొలాలకు నీరందించే సరఫరా కాలువతో సహా అంచనాలు వేసి టెండర్లు పిలవాలన్న సూచనతో టెండర్లు రద్దు చేసేశారు.

సన్నిహితులకు కాంట్రాక్ట్ కోసమే టెండర్ల రద్దు

సన్నిహితులకు కాంట్రాక్ట్ కోసమే టెండర్ల రద్దు

శ్రీకాకుళం జిల్లాలో దాదాపు భారీ ఎత్తిపోతల పథకంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రతిష్ఠాత్మకంగా మంజూరు చేయించుకున్న బొంతు - సారవకోట - కొత్తూరు ఎత్తిపోతల పథకం టెండర్ల దశలో నిలిచిపోయింది. 11,700 ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో సాగునీరందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రతిపాదించారు. ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున పండుగ చేసుకున్నారు. నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారులు కూడా దాదాపు రూ. 180 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇతరత్రా పద్దులకు కేటాయించిన మొత్తాన్ని మినహాయించి రూ. 106 కోట్లతో కేవలం ఎత్తిపోతల పథకంలో ఉపయోగించే పైపులు, గొట్టాల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కానీ వాటిని దాఖలు చేసేందుకు గత నెలాఖరు తేదీ.

సరిగ్గా టెండర్ల దాఖలుకు గడువు దాటే దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల సంస్థ ఆకస్మికంగా టెండర్లు నిలిపేసింది. సరఫరా కాలువల నిర్మాణానికి రూ. 20 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంది. ఈ కాలువలను కూడా ప్రస్తుత టెండర్లలోనే కలపాలన్న ఉద్దేశమే టెండర్లు రద్దు చేయడానికి కారణమని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. తమకు కావాల్సిన కాంట్రాక్ట్ సంస్థకు పనులు కట్టబెట్టడానికే పనులు వాయిదా వేశారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గొట్టాలు, పంపుల నిర్మాణాలకు సమాంతరంగానే.. సరఫరా కాలువలకు విడిగా టెండర్లు పిలిచే అవకాశాన్ని మరుగున పెట్టడమే ఆరోపణలకు అద్దం పడుతోంది. ఒకవేళ నిజంగా రెండింటికి ఒకేసారి టెండర్లు పిలవాలనే అలా చేసి ఉంటే.. ఇంజినీరింగ్ అధికారుల దూరదృష్టి లోపమే కారణంగా అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

 వంశధార, మహేంద్ర తనయ గెడ్డలపైనే ఈ పథకాలన్నీ

వంశధార, మహేంద్ర తనయ గెడ్డలపైనే ఈ పథకాలన్నీ

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి అచ్చెన్నాయుడి చొరవతో ఇటీవల దాదాపు 15 కొత్త ఎత్తిపోతల పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించింది. వీటి అంచనా విలువ రూ. 309.23 కోట్లు. వీటిపై సుమారుగా 25 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాలువల ద్వారా నీటిని పంపించే అవకాశం లేని ఎత్తైన ప్రదేశాల్లో ఆయకట్టును ఈ పథకాల కింద చేర్చారు. ఈ పథకాలకు ప్రధాన నీటివనరులు.. వంశధార, మహేంద్రతనయతో బాటు వివిధ గెడ్డలు ఉన్నాయి. రెండింటికి వంశధార ప్రధాన కాలువలపైనే నిర్మించే విధంగా ప్రతిపాదించారు. ఈ రెండు పథకాలూ ప్రయోగాలే. అసలే చివరి ఆయకట్టుకు నీరు వెళ్లని దుస్థితిలో.. కోటబొమ్మాళి మండలం సౌడాం, హిరమండలం మండలం మజ్జిగూడెం వద్ద రెండు ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదనలు రూపొందించారు.

ఈ రెండింటికి సుమారుగా 37 క్యూసెక్కుల నీరు అవసరం. మంత్రి ఒత్తిడితో ఎట్టకేలకు ఈ రెండింటికి నీటి లభ్యత అనుమతులను ఇస్తూ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండింటినీ మినహాయిస్తే.. మిగిలిన 13 పథకాలకు సంబంధించి నీటి లభ్యత అనుమతులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు నిలిచిపోయాయి. వంశధార, మహేంద్రతనయ, రెల్లి, ఇసుక గెడ్డ, పూతికవలస గెడ్డ, పాలవలసగెడ్డ, చీపిగెడ్డలపై ఈ ఎత్తిపోతల పథకాలను ప్రతిపాదించారు. కొత్తూరు మండలం మాతల, కడుమ ఎత్తిపోతల పథకాలు వంశధార నదిపైనే ఏర్పాటు చేయాల్సి ఉంది.

మెళియాపుట్టి మండలం కొసమాల, రట్టిని, నడసంద్ర, వసుంధర ఎత్తిపోతలను మహేంద్రతనయపై ఏర్పాటు చేసేలా ప్రతిపాదించారు. సీతంపేట మండలం కొండపల్లి, తురాయిపువలస ఎత్తిపోతల పథకాలను ఇసుక గెడ్డపై, సీతంపేట మండలంలోని పూతికవలస ఎత్తిపోతల పథకాన్ని పాలవలస గెడ్డపైనా.. మందస మండలం చీపి ఎత్తిపోతల పథకాన్ని చీపిగెడ్డపైనా.. పొందూరు మండలం తండ్యాం, లైడాం ఎత్తిపోతల పథకాలను రెల్లిగెడ్డపైనా ప్రతిపాదించారు. వీటిలో తండ్యాం ఎత్తిపోతల పథకంపై సుమారు 3,292 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. లైడాంపై 1,174 ఎకరాలతో ఆయకట్టులో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

వివిధ దశల్లో వివిథ ఎత్తిపోతల పథకాలు

వివిధ దశల్లో వివిథ ఎత్తిపోతల పథకాలు

గార మండలం కళింగపట్నం, మెళియాపుట్టి మండలం పెద్దపద్మపురం ఎత్తిపోతల పథకాల పనులు టెండర్ల దశను ముగించుకుని.. కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం నదుల్లో నీరు ఉండటంతో పంపులు అమర్చడం కష్టం కావడంతోనే ఆలస్యం జరుగుతున్నట్లు ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. బూర్జ మండలం నీలాదేవపురం ఎత్తిపోతల పథకం పనులు 50 శాతం వరకు పూర్తయ్యాయి. వచ్చే ఏడాదికి గాని పూర్తి చేయలేమన్నది అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

పాతపట్నం మండలం కొరసవాడ ఎత్తిపోతల పథకం కూడా దాదాపుగా పూర్తయింది. ట్రయల్‌రన్‌ వేసి ఆయకట్టుకు నీరిస్తున్నారు. కోటబొమ్మాళి మండలంలోనే కొండపేట ఎత్తిపోతల పథకం కింద తొలుత 2,500 ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. ఇంతవరకు ఒక వరుస గొట్టాల నిర్మాణమే పూర్తయింది. ఆ మేరకు ఆయకట్టులో కేవలం 800 ఎకరాలకు మాత్రమే నీరిస్తున్నారు. రెండో పైపులైన్‌ నిర్మాణాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఇంజినీరింగ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రూ. 34.38 కోట్లతో చేపట్టిన మదనగోపాల సాగరం ఎత్తిపోతల పథకానికి ఇటీవల టెండర్లు పూర్తి కాంట్రాక్టర్లతో ఒప్పందం ఖరారు చేసుకున్నా పనులు ఆశించినంత వేగంగా ముందుకెళ్లడం లేదు.

నీటి లభ్యతల్లో తేడాలు ఇలా

నీటి లభ్యతల్లో తేడాలు ఇలా

అంతకు ముందు రూ. 133.14 కోట్లతో టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ సంస్థలతో ఒప్పందం ఖరారు చేసుకున్న పది ఎత్తిపోతల పథకాల్లో కేవలం మూడు మాత్రమే పూర్తయ్యాయి. కోటబొమ్మాళి మండలం నారాయణపురం, చినసాన, నందిగాం మండలం సుభద్రాపురం ఎత్తిపోతల పథకాలను ఇటీవలే ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. చిన్నచిన్న లోటుపాట్లు సరిచేసుకుని త్వరలో ప్రారంభించాలని సంకల్పించారు. మహేంద్రతనయపై అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయి. ఇతర గెడ్డల్లో కూడా నీటి లభ్యత అంచనాలకు నిర్దిష్ట ప్రమాణాలు లేవు.

గెడ్డలపై నీటి అంచనా వేయడం కష్టం. మహేంద్రతనయతో సహా వివిధ గెడ్డలన్నింటినీ నీటి ప్రవాహాన్ని కొలిచేందుకు రివర్‌ గేజ్‌లు లేవు. ఈ క్రమంలోనే ఉజ్జాయింపు లెక్కలతో.. అంచనాను లెక్కించే సబ్‌-డివిజన్‌లో అందుబాటులో లెక్కలే ప్రామాణికంగా అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల ఆధారంగానే నీటి లభ్యత అనుమతులకు జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) అనుమతులను మంజూరు చేయాలి. అనుమతుల మంజూరులో ఈఎన్సీ ఎప్పటికప్పుడు సందేహాలు లేవనెత్తి ప్రతిపాదనలను తిప్పి పంపిస్తోంది. వారు అడిగిన వాటికి సమాధానమిస్తున్నా.. మళ్లీ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రాజకీయంగా పలుకుబడి ఉపయోగించి మంజూరు చేయించుకోవడం మినహా ప్రత్యామ్నాయం లేదని ఇంజినీరింగ్ వర్గాల భావన.

ఇలా పెండింగ్‌లో అనుమతుల ప్రక్రియ

ఇలా పెండింగ్‌లో అనుమతుల ప్రక్రియ

నీటి లభ్యతపై అధికారికంగా తీసుకున్న పక్కా ఆధారాలతోనే ప్రతిపాదనలు పంపామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల సంస్థ శ్రీకాకుళం జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ పీ లక్ష్మీపతి తెలిపారు. నీటి అనుమతుల కోసం ఈఎన్‌సీ కార్యాలయానికి పంపిన ప్రతిపాదనలు అక్కడే పెండింగులో ఉన్నాయన్నారు. వంశధార కాలువపై ప్రతిపాదించిన రెండు పథకాలకు ఇటీవల ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని చెప్పారు. చిన్న చిన్న పథకాలకు స్థానికంగా జలవనరుల శాఖ ఎస్‌ఈ స్థాయిలోనే అనుమతులు ఇవ్వొచ్చు, బొంతు పథకం కింద సరఫరా కాలువలను కూడా చేర్చి ఒకేసారి టెండర్లు పిలవాలన్న ఉన్నత స్థాయి అధికారుల నిర్ణయంతోనే టెండర్లను రద్దు చేయాల్సి వచ్చింది. మరో పది పదిహేను రోజుల్లోనే ఆ పథకానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని లక్ష్మీపతి వివరించారు.

English summary
AP CM Chandrababu Naidu had said recently his government should launches 28 irrigation projects next Three months. But ground level conditions were different. Particularly in Srikakulam proposed lift irrigation scheemes not exceeded government permmissions. Minister Kinjarapu Achanaidu prestigious Bonth lift irrigation scheeme is one of these lift irrigation projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X