వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పటి వరకే టీడీపీతో.. తరువాత ఏమైనా జరగొచ్చు.. పీఠాలు కదిలిపోతాయ్: సోము వీర్రాజు

ఒక్క పరుగు తేడాతో ఐపీఎల్ లో ముంబై గెలిచిందని... అలాగే రాజకీయాల్లో కూడా ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఒక్క పరుగు తేడాతో ఐపీఎల్ లో ముంబై గెలిచిందని... అలాగే రాజకీయాల్లో కూడా ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

తమ పార్టీని తాము బలపరుచుకోవడం సహజమైన ప్రక్రియ అని చెప్పారు. ప్రధానితో జగన్ భేటీ కావడాన్ని కొందరు విమర్శిస్తుండటం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. 2019 వరకు టీడీపీతో పొత్తు అని, ఆ తర్వాత మరేదైనా జరగొచ్చని వెంకయ్యనాయుడు ఇది వరకే చాలా స్పష్టంగా చెప్పారని... ఇక ఇంతకన్నా చెప్పాల్సింది ఏముందని సోము వీర్రాజు ఎదురు ప్రశ్నించారు.

Like Cricket, Anything can happen in Politics.. says BJP MLC Somu Veerraaju

'ప్రధాన మంత్రిని ఎవరైనా కలవొచ్చు... చంద్రబాబును కూడా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చాలాసార్లు కలిశారు... తమ సమస్యలను చెప్పుకోవడానికి నేతలంతా ముఖ్యమంత్రిని కలవడం సహజమే..' అని ఆయన పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో ఏపీలో బీజీపీ పూర్తి స్థాయిలో బలపడటాన్ని అందరూ చూస్తారని అన్నారు. బీజేపీలో చేరేందుకు యాక్టర్లు, రైటర్లు, పెద్ద మనుషులు చాలామంది రెడీగా ఉన్నారని... ఇతర పార్టీల పీఠాలు కదిలిపోతాయిని వీర్రాజు వ్యాఖ్యానించారు.

English summary
BJP MLC Somu Veerraju told that Anything will happen in Politics. He commented Politics also like Cricket. He has given an example of IPL match between Mumbai Vs Pune. He told that Mumbai won the match with the difference of a single run, Like that anything will happen in politics. He said.. Anyone can meet Prime Minister Narendra Modi, Why some politicians are making negative comments on the YS Jagan Mohan Reddy meet with Narendra Modi. Even Ummareddy Venkateswarlu also met CM Chandrababu Naidu several times on his personal issues. If that is wrong, this is also wrong.. what do you say?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X