• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యాపారం: పవన్ కళ్యాణ్ 'ఆగ్రహం'తోనే చంద్రబాబుకు రోజా షాక్ (పిక్చర్స్)

By Srinivas
|

విశాఖ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం ప్రత్యేక హోదా కోసం ఏ ఘాటైన వ్యాఖ్యలు ఎంపీల పైన చేశారో, ఆదివారం నాడు వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా కూడా విశాఖ రైల్వే జోన్ విషయంలో ఎంపీలు, మంత్రుల పైన అవే విమర్శలు చేసారు.

గతంలో పవన్ కళ్యాణ్ ఓ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయమై మాట్లాడారు. ఎంపీలు ప్రత్యేక హోదా తదితర హామీలను సాధించడం కోసం పార్లమెంటులో గట్టిగా పోరాడకుండా తమ వ్యాపారాల పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని పవన్ నాడు విమర్శించారు.

ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే ఆసక్తి లేనట్లయితే వారంతా తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారి స్థానంలో సమర్థులను ప్రజలు ఎన్నుకుంటారని టిడిపి ఎంపీలకు చురకలు అంటించారు. పవన్ వ్యాఖ్యలపై టిడిపి ఎంపీలు ఘాటుగానే స్పందించినప్పటికీ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆ తర్వాత తగ్గారు.

ఇప్పుడు రైల్వే జోన్ విషయంలో రోజా కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలనే చేశారు. టిడిపి, బిజెపి ఎంపీలను ఉద్దేశించి.. వ్యాపారాల మీద ఉన్న శ్రద్ధ రైల్వే జోన్ సాధించడంపైన లేదని, అందుకే రెండేళ్లవుతున్నా కేంద్రం ఆ హామీని పట్టించుకోవడం లేదని విమర్శించారు.

రైల్వే జోన్ అందే విశాఖ నగరానికి సంబంధించింది కాదని, ఏపీకి సంబంధించిన అంశమన్నారు. ఎంపీలు హామీల పైన దృష్టి పెట్టకుండా వ్యాపారాల పైన దృష్టి పెడుతున్నారని నాడు పవన్ కళ్యాణ్, నేడు రోజా విమర్శించడం గమనార్హం.

రోజా

రోజా

విశాఖపట్నానికి రైల్వే జోన్ సాధించే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. విశాఖపట్టణంలో రైల్వే జోన్ విశాఖ హక్కు అంటూ గుడివాడ అమర్నాధ్‌ చేపట్టిన దీక్షకు ఎమ్మెల్యే రోజా, ఎంపీ వరప్రసాద్ ఆదివారంసంఘీభావాన్ని తెలిపారు.

అమర్నాథ్ దీక్షకు రోజా సంఘీభావం

అమర్నాథ్ దీక్షకు రోజా సంఘీభావం

అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్ర మంత్రులకు రైల్వే జోన్ పట్టదా? అని ప్రశ్నించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు పోటీ పడి దోచుకుంటున్నారని అన్నారు.

అమర్నాథ్ దీక్షకు రోజా సంఘీభావం

అమర్నాథ్ దీక్షకు రోజా సంఘీభావం

టీడీపీలో మగాళ్లు లేక వైసీపీకి చెందిన చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొని తీసుకెళ్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే, ఆయనే కనక రాయలసీమ బిడ్డ అయితే తక్షణం వారందర్నీ పదవులకు రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.

అమర్నాథ్ దీక్షకు రోజా సంఘీభావం

అమర్నాథ్ దీక్షకు రోజా సంఘీభావం

టీడీపీ ప్రభుత్వం తప్పుడు విధానాలు అవలంభిస్తూ పాలన సాగిస్తోందని ఆమె మండిపడ్డారు. 15 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా విశాఖకు రైల్వే జోన్ తీసుకురావడంతో విఫలమయ్యారని విమర్శించారు. అందుకే మేం పోరాడాల్సి వస్తుందని అన్నారు.

అమర్నాథ్ దీక్షకు రోజా సంఘీభావం

అమర్నాథ్ దీక్షకు రోజా సంఘీభావం

ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కింద చంద్రబాబు నాయుడు పది వేల కోట్లు అడిగితే కేంద్రం కేవలం రూ. 700 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కుంభకోణం బయటకు తీస్తారనే భయంతో చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారని ఆమె విమర్శించారు.

అమర్నాథ్ దీక్షకు రోజా సంఘీభావం

అమర్నాథ్ దీక్షకు రోజా సంఘీభావం

ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టుపెడుతున్నారని ఆమె విమర్శించారు.

అమర్నాథ్ దీక్ష భగ్నం

విశాఖ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలంటూ వైసిపి నేత గుడివాడ అమర్నాథ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నాలుగు రోజుల పాటు విశాఖలో అమర్ నాథ్ దీక్ష చేస్తున్నారు. రైల్వే జోన్‌కు సంబంధించిన ప్రకటన వెలువడిన అనంతరం మాత్రమే తాను దీక్ష విరమిస్తానని ఆయన ప్రకటించారు.

అయితే ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు అమర్నాథ్‌ను బలవంతంగా జీపు ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.

కాగా ఈ నెల 20వ తేదీన అమర్నాథ్‌కు సంఘీభావం తెలిపేందుకు వైసిపి అధినేత జగన్ వెళ్తారని వైసిపి నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. రైల్వే జోన్ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, అప్పుడు వివరాలు వెల్లడిస్తామన్నారు.

English summary
Like Jana Sena party chief Pawan Kalyan, YSRCP MLA Roja criticizes TDP MPs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X