వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నందమూరి నుంచి నారా వరకు.: ఇక మిగిలింది లోకేశ్ పట్టాభిషేకమే

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) భవిష్యత్ వారసుడిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నాయకత్వానికి ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, టీడీపీ అధ్యక్షుడు న

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి/ హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) భవిష్యత్ వారసుడిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నాయకత్వానికి ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నది.

తద్వారా భవిష్యత్‌లో తన తనయుడి రాజకీయ భవిష్యత్‌కు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు. ఆదివారం జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి చాలా కాలం తర్వాత నందమూరి హరిక్రుష్ణ హాజరు కావడం ఈ కోణంలోనే జరిగిందన్నది వాస్తవం. శాసనసభ్యుల కోటాలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ కోటాలో నారా లోకేశ్‌ను చట్టసభలో ప్రవేశానికి పొలిట్ బ్యూరో ఆమోద ముద్ర వేసింది.

సరిగ్గా 35 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్బవించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు.. 1983 ఎన్నికల్లో తన మామ ఎన్టీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. కానీ చంద్రగిరి నుంచి పోటీ చేసిన చంద్రబాబు.. ఒక సాధారణ టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఎన్టీఆర్ ఘీంకారంతో కాంగ్రెసు చిత్తు

ఎన్టీఆర్ ఘీంకారంతో కాంగ్రెసు చిత్తు

ఆ ఎన్నికల్లో తెలుగు ఆత్మగౌరవం పేరిట అన్నగారు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సంచలన విజయాలు సాధించింది. తెలుగునాట.. యావత్ భారతావనిలోనే ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ప్రత్యేకించి ఇందిరాగాంధీకి ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవ్వడం అనూహ్యం కాకపోయినా గట్టి ఎదురుదెబ్బే. పోలింగ్ జరుగక ముందే ఆమె ఓటమిని అంగీకరించి హుందాగా వ్యవహరించారు అది వేరే సంగతి. ప్రచార పర్వంలో భాగంగా ఎన్టీఆర్ చివరిగా తిరుపతిలో సభ ఏర్పాటు చేసుకున్నారు. అదే రోజు ఎన్నికల సభలో ప్రసంగించేందుకు ఇందిరాగాంధీ కూడా తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలో నాడు వెల్లువెత్తిన ‘పచ్చ' జన సందోహాన్ని తిలకించిన ఇందిర హడావుడిగా సభ ముగించుకుని ఢిల్లీ వెళ్లిపోయారు. చంద్రబాబు ఓటమి పాలైన వారం తిరక్కుండానే అల్లుడిగా.. అన్నగారి పక్షాన చేరారు. ఆయన కూడా అల్లుడ్ని చేర్చుకునేందుకు సుముఖమైనా పార్టీ నేతల ఆమోదం కోసం ప్రయత్నించారు. ఒకింత నియంత్రుత్వంగా వ్యవహరించినా.. కొన్ని అంశాల్లో ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించారనే చెప్పాలి. మాజీ సీఎం నాదేండ్ల భాస్కర్ రావు, కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర తదితరులు అందుకు సాక్ష్యం. పార్టీలో చేరిన తర్వాత ఆధిపత్యం కోసం చంద్రబాబు చేయని ప్రయత్నమూ లేదు. ఒకాకొక దశలో ఎన్టీఆర్ తన వారసుడు బాలయ్య అని ప్రకటిస్తే అలిగి కూర్చున్న నేపథ్యం చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులది. ఈ సంగతి తెలుసుకున్న అన్నగారు.. అదీ సినిమా వారసత్వం అని సర్ది చెప్పారు.

తొలి నుంచి ఆ వారసత్వ వాసనలు

తొలి నుంచి ఆ వారసత్వ వాసనలు

ఇలా తెలుగుదేశం పార్టీలో వారసత్వ రాజకీయ పోకడలు మొదటి నుంచే రెండు కుటుంబాలను వెంటాడుతూ వచ్చాయి. 1989లో ఓటమి, లక్ష్మీ పార్వతితో ద్వితీయ వివాహం, 1994లో మద్య నిషేధం అమలు, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం తదితర హామీలతో అధికార దండం చేతబట్టిన ఎన్టీఆర్.. తన అల్లుడిగా ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబును ఆర్థికమంత్రిని చేశారు. అప్పటి నుంచి ఒక గ్రూపుగా వ్యవహరిస్తూ ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అందుకోసం లక్ష్మీ పార్వతిపై రాజ్యాంగేతర శక్తి ముద్ర వేసిన చంద్రబాబు.. 1985 నుంచి 1989 వరకు కర్షక్ పరిత్ కార్య నిర్వాహక అధికారిగా అదే పని చేశారు. దీనిపై హైకోర్టు అక్షింతలు వేశాక ఎన్టీఆర్ కూడా వేరే నాయకుడ్ని ఆ పదవిలో కూర్చుండబెట్టారు. 1995లో తిరుగుబాటుకు ముందు నందమూరి కుటుంబాన్ని తన విశ్వాసంలోకి తీసుకున్న చంద్రబాబు చకచకా పావులు కదిపి వైస్రాయ్ క్యాంపు శిబిరాలకు తెర తీశారు. తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావును, ఆ తర్వాత హరిక్రుష్ణను సాగనంపారు.

బాలయ్యతో టీడీపీ అధినేత వియ్యం

బాలయ్యతో టీడీపీ అధినేత వియ్యం

మేనరిక వివాహాలకు వ్యతిరేకమని ఘంటాపథంగా నొక్కి చెప్పిన చంద్రబాబు.. 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత నందమూరి కుటుంబంతో సన్నిహితంగా మెలిగారు. బాలయ్యతో వియ్యమందారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కూడా చేశారు. కానీ హరిక్రుష్ణకు లోకేశ్ నాయకత్వం పట్ల వ్యతిరేకత పలు సందర్భాల్లోనూ వ్యక్తమైంది. అందుకే హరిక్రుష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాతీ కాలంలో అంటీముట్టనట్లు వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నందమూరి కుటుంబం హాజరైంది. నాటి నుంచే లోకేశ్ కు భవిష్యత్ నాయకత్వ పాత్ర అప్పగించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందడుగు వేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సహా పార్టీ నేతలందరినీ లోకేశ్‌కు అటాచ్ చేసేందుకు ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు అప్పగించారు.

కరుణ దారిలో స్టాలిన్

కరుణ దారిలో స్టాలిన్

భారతదేశం ప్రజాస్వామిక దేశమైనా.. పలు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు సాగుతున్నాయి. మన పొరుగు రాష్ట్రం తమిళనాట డీఎంకేలో కరుణానిధి మొదలు ఆయన కొడుకులు, కూతురు, మనుమళ్లు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూనే ఉన్నారు. అదే సమయంలో ప్రజాసమస్యల పరిష్కారంలో ముందు ఉంటున్నారు. వివిధ రాజకీయ అంశాలపై తమదైన శైలిలో వాస్తవిక ద్రుక్పథం కనబరుస్తున్నారు. పెద్ద కొడుకు అళగిరి దూకుడు నిర్ణయాలతో కరుణానిధికి దూరం కాగా.. ఎంకే స్టాలిన్ దగ్గరుండి ఆయన బాగోగులు చూసుకున్నారు. అందుకే 2011కి ముందు డిప్యూటీ సీఎంగా అన్ని బాధ్యతలు చక్కబెట్టిన స్టాలిన్.. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా.. జయ అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.

బీహార్ లో ఇలా..

బీహార్ లో ఇలా..

పశుగ్రాసం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలు పాలైతే భార్య రబ్రీదేవి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఆయన కొడుకుల్లో ఒకరు తేజ్ ప్రతాప్ డిప్యూటీ సీఎంగా నితీశ్ సారథ్యంలో మెళకువలు నేర్చుకుంటున్నారు. మరో కొడుకు కూడా మంత్రిగా ఉన్నారు. రబ్రీదేవి సోదరులు కూడా ప్రజాప్రతినిధులుగా ఆర్జేడీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాత తరం రాజకీయ నేతల్లో ఒకరైన బిజూ పట్నాయక్ కుమారుడే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.

పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన అఖిలేశ్..

పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన అఖిలేశ్..

వీటికి పొరుగు రాష్ట్రం.. దేశంలోకెల్లా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. సీఎంగా ఉన్న అఖిలేశ్ యాదవ్.. ఐదేళ్ల క్రితం 2012 ఎన్నికలకు ముందు రాష్ట్రమంతా చుట్టేసి.. వివిధ సామాజిక వర్గాల వారిని ప్రత్యేకించి యువతను తనవైపు ఆకర్షించుకోగలిగారు. తండ్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆశీస్సులతో సీఎంగా అతి పిన్న వయస్సులోనే పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే బాబాయ్ శివ్ పాల్, సోదరులు, తదితర బంధుగణం ఒత్తిళ్ల కారణంగా 2014 వరకు సరైన పాలన అందించలేకపోయారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అనూహ్య ఓటమి పాలైన తర్వాత చకచకా ప్రగతి దాయక పనులు చేపట్టి, జనంలోకి దూసుకెళ్లారు. ఈ విషయం గిట్టని శివ్ పాల్.. ములాయం రెండో భార్య సాధనాగుప్తా వ్యూహ రచన చేశారు. దీనికి ప్రతిగా వ్యూహం వేసిన అఖిలేశ్.. పూర్తిగా పార్టీ పగ్గాలు స్వాధీనం చేసుకున్నారు. తండ్రి ఆగ్రహంతో ప్రచారానికి దూరంగా ఉన్నా అరివీర భయంకరుడైన ప్రధాని నరేంద్రమోదీ ప్రచార ధాటిని తట్టుకుని ధీటుగా ప్రజల్లో ప్రచారం చేస్తూ ముందుకు సాగిపోతున్నారు.

అకాలీదళ్ లో అంతా బాదల్ కుటుంబమే

అకాలీదళ్ లో అంతా బాదల్ కుటుంబమే

ఇక దేశంలోకెల్లా అతిపెద్ద సంపన్న రాష్ట్రం పంజాబ్.. అక్కడ శిరోమణి అకాలీదళ్ అధికారంలో ఉన్నది. తొలుత వేర్పాటువాదానికి పునాదిగా మారిన అకాలీదళ్ ఉద్యమం తర్వాత పార్టీగా.. అటు పిమ్మట ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబ పార్టీగా రూపాంతరం చెందింది. దాదాపు ప్రస్తుత పంజాబ్ అసెంబ్లీలో సగం మంది ఎమ్మెల్యేలు బాదల్ కుటుంబ సభ్యులేనంటే అతిశేయోక్తి కాదు. బాదల్ కొడుకు సుఖ్ బీర్ సింగ్.. అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడిగా, డిప్యూటీ సీఎంగా పాలనా యంత్రాంగం పనులన్నీ చక్కబెడుతున్నారు. కోడలు హరిసిమ్రత్ సింగ్ కౌర్ కేంద్ర మంత్రిగా కేంద్ర, రాష్ట్రాల మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. దాని పొరుగు రాష్ట్రం హర్యానాలో చౌతాలా కుటుంబం అవినీతి కుంభకోణంతో జైలు పాలైంది.

ఇతర రాష్ట్రాలపై బాబు ఇలా..

ఇతర రాష్ట్రాలపై బాబు ఇలా..

అయితే పంజాబ్, బీహార్, యూపీ రాష్ట్రాల్లో కొనసాగుతున్న వారసత్వ రాజకీయాలు ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును ఆకర్షించాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అనూహ్య పరిణామాలు జరిగితే తన కుమారుడి వారసత్వానికి ఇబ్బందులు తలెత్తుతాయా? అన్న సందేహం వచ్చినందున.. ముందుగానే 2019 ఎన్నికల నాటికి ఏపీ వాసులకు ప్రత్యామ్నాయ నేతగా కొడుకును ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నారా? అని అనిపిస్తున్నది. ఇప్పటికే లోకేశ్ జోక్యం పట్ల సీనియర్లు కినుక వహించినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఆయన కేబినెట్‌లో చేరితే పూర్తిగా పార్టీని లోకేశ్ నాయకత్వానికి అప్పగించడమే తరువాయి. అయితే యూపీ సీఎం అఖిలేశ్ తరహాలోగానీ, పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ తరహాలో గానీ జనాకర్షణ లోకేశ్ బాబుకు ఉంటే ఫర్వాలేదు. దీనికి తోడు నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండే పచ్చని భూములు స్వాదీనం చేసుకున్న నేపథ్యం ఏపీ సర్కార్‌దీ. దీనికి చట్టబద్ధత ఉన్నదనుకోండి అది వేరే సంగతి. కాపుల రిజర్వేషన్ రగడ వెంటాడుతున్నది. మరోవైపు పవన్ కల్యాణ్ యువ నేతగా ముందుకు దూసుకొస్తున్నారు. ఈ తరుణంలో లోకేశ్‌కు ఎమ్మెల్సీగా స్థానం కల్పించి.. తర్వాత కేబినెట్‌లో చోటు కల్పిస్తుండటంతో భవిష్యత్ టీడీపీ వారసుడిగా ప్రజామోదం పొందేందుకు మార్గం సుగమం చేయనున్నారా? చంద్రబాబు అంచనాలు నిజమవవుతాయా? అదంతా రాజకీయ వెండితెరపై వేచి చూడాల్సిందే.

English summary
TDP politbueaw decided to elect Nara lokesh as Mlc from Mla's quota. Lokesh thanks for party politburaw dicision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X