వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో భాను కిరణ్ వద్ద మద్యం బాటిళ్లు, బిర్యానీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Liquor bottle found at Bhanu Kiran cell
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చర్లపల్లి జైలులో భాను కిరణ్ సకల సౌకర్యాలు అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే. భాను కిరణ్ వద్ద మద్యం బాటిళ్లు, బిర్యానీ పట్టుబడినట్లు బుధవారంనాడు మీడియాలో వార్తలు వచ్చాయి.

మీడియా కథనాల ప్రకారం - బుధవారం ఉదయం భానుకిరణ్ ఉన్న బ్యారెక్‌లో డిప్యూటీ జైలర్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో భానుకిరణ్ వద్ద ఉన్న బిర్యానీ ప్యాకెట్లు, రెండు మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సిబ్బంది పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో కూడా భాను కిరణ్ నుంచి మద్యం బాటిళ్లను, బిర్యానీ ప్యాకెట్లను, సెల్ ఫోన్లను, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ తనిఖీలు నిర్వహించి బాధ్యులపై వేటు వేసినా ఫలితం కనిపించడం లేదని అంటున్నారు.

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భాను కిరణ్ అరెస్టయిన విషయం తెలిసిందే. భాను కిరణ్‌కు భూదందాలతో సంబంధం ఉన్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.

English summary
According to media report - Liquor bottles and biryani packets found at Bhanu Kiran, accused in Maddelachervu Suri murder case in Cherlapalli jail
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X