అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం షాపులకు హారతులు: ముగ్గులు..బ్యారికేడ్లు: 40 రోజుల తరువాత..మందుబాబులకు పండగే

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో మద్యం షాపులు తిరిగి తెరచుకోబోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా రెండు దశల్లో 45 రోజుల పాటు అమలు చేసిన లాక్‌డౌన్ ఆదివారం నాటితో ముగిసింది. 14 రోజుల మూడోదశ లాక్‌డౌన్ ఆరంభమైంది. ఈ మూడోదశలో కేంద్రం ప్రభుత్వం కొన్ని సడలింపులను ఇచ్చిన నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మద్యం షాపులు పునఃప్రారంభం కానున్నాయి. ఏపీలోనూ మరి కాస్సేపట్లో మద్యం దుకాణాల తలుపులు తెరవబోతున్నారు.

Recommended Video

Andhra Pradesh Govt to Hike Liquor Prices By 25 Percent | Onewindia Telugu

ఏపీకి ఎంఫాన్‌ గండంః దూసుకొస్తున్నతుఫాన్‌..72 గంట‌ల్లోః దిశ మారొచ్చంటోన్న ఐఎండీఏపీకి ఎంఫాన్‌ గండంః దూసుకొస్తున్నతుఫాన్‌..72 గంట‌ల్లోః దిశ మారొచ్చంటోన్న ఐఎండీ

 గ్రీన్‌జోన్లు, నాన్ కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో మాత్రమే..

గ్రీన్‌జోన్లు, నాన్ కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో మాత్రమే..

మూడోదశ లాక్‌డౌన్ సందర్భంగా గ్రీన్‌జోన్లు, నాన్ కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను తెరచుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతులను మంజూరు చేసింది. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలకు లోబడి ఏపీ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ మద్యం దుకాణాలకు వేసిన షట్టర్లను పైకి లేపబోతున్నారు దుకాణాల యజమానులు. ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వాటిని తెరచి ఉంచనున్నారు.

 సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి..

సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి..

మద్యం షాపుల ముందు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటించాల్సి ఉంటుంది. ఒక్కో దుకాణం ముందు అయిదుమందికి మించిన కొనుగోలుదారులు ఉండకూడదని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటించడానికి వీలుగా ప్రతి దుకాణం ముందు కూడా అయిదు ముగ్గులు పోయాల్సి ఉంటుందని, ఒక్కో ముగ్గు మధ్య ఆరు అడుగుల దూరం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. దీనికి అనుగుణంగా చర్యలను తీసుకుంటున్నారు. సోషల్ డిస్టెన్సింగ్‌ పాటించడానికి అవసరమైన నిబంధనలను ప్రతి షాప్ ముందూ ప్రదర్శించాల్సి ఉంటుంది.

రద్దీ నివారణకు బ్యారికేడ్లు..

రద్దీ నివారణకు బ్యారికేడ్లు..

కొనుగోలుదారుల తాకిడి అధికంగా ఉంటుందని భావించే ప్రాంతాలు, దుకాణాల వద్ద బ్యారికేడ్లను కట్టారు. కొనుగోలుదారులను నియంత్రించడానికి, సోషల్ డిస్టెన్సింగ్‌ను పర్యవేక్షించే బాధ్యతను స్థానిక మున్సిపల్ సిబ్బంది, పోలీసులకు అప్పగించారు. కొనుగోలుదారుల తాకిడి తీవ్రంగా ఉండటం, సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటించని దుకాణాలను మూసివేసే అధికారాలను స్థానిక సంస్థల అధికారులకు ఇచ్చారు. మూడోదశ లాక్‌డౌన్ ముగిసేంత వరకూ మద్యం దుకాణాలను తెరనివ్వకూడదంటూ ఆదేశాలను జారీ చేశారు.

25 శాతం అధికం..

25 శాతం అధికం..

మద్యం రేట్లను రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. మద్యం అమ్మకాలపై ఇప్పటిదాకా కొనసాగిన ధరలను సవరించింది. 25 శాతం పన్నును పెంచింది. ఫలితంగా- అన్ని రకాల మద్యం బ్రాండ్ల రేట్లూ పెరిగినట్టే. పెంచిన రేట్లతోనే మద్యాన్ని విక్రయించాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించి గ్రీన్‌జోన్లు, నాన్ కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయడాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తప్పు పడుతోంది.

English summary
The government of Andhra Pradesh has decided to open AP-State Beverages Corporation Limited retail liquor shops, both in the rural and urban areas except in containment zones/clusters and shops located in shopping malls from May 4th, the government said. The state government have set few guidelines with regard to its functioning. It has directed shops to open at 11 AM and closed at 7 PM. ‘All the liquor shops should follow social distancing so that customers make use of the business hours without any health risk. And the sale personnel shall wear masks and keep sanitizers for use in the shops, the government said. The APBCL has been shut since the lockdown was announced by the Central government following the CoronaVirus outbreak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X