వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుబాబులకు గుడ్ న్యూస్, లిక్కర్ రేట్ తగ్గింపు.. 30 నుంచి 40 శాతం వరకు, కారణమిదేనా..?

|
Google Oneindia TeluguNews

మందుబాబులకు తీపికబురు. అవును మధ్యం ధరలను తగ్గిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండికేషన్స్ ఇచ్చింది. ఆ ప్రకటనతోనే మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. మద్యం ధరలు అంతకుముందు మాములుగానే ఉండేవీ.. కానీ లాక్ డౌన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు లిక్కర్‌పై ధర పెంచాయి. ఢిల్లీ 70 శాతం వరకు పెంచగా, తెలంగాణలో 16 శాతం పెంచారు. తెలంగాణలో తర్వాత తగ్గించబోమని సీఎం కేసీఆర్ అప్పుడే స్పష్టంచేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 75 శాతం వరకు పెంచారు. దీంతో సామాన్యులు మందు కొనలేని పరిస్థితి వచ్చింది.

శానిటైజర్ తాగి.. మత్తులోకి జారుతూ..

శానిటైజర్ తాగి.. మత్తులోకి జారుతూ..

మందుబాబులు మద్యం కొనలేక శానిటైజర్ తాగుతూ మత్తులోకి జారుతున్నారు. ఇటీవల ఏపీలో భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కురిచేడులోనే పదుల సంఖ్యలో చనిపోయారు. చిత్తూరు జిల్లాలో కూడా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రతిపక్షం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. శానిటైజర్ల విక్రయాలపై నియంత్రణ, మద్యం ధరల పెంపు ప్రభావం చూపిందన్నారు. విపక్షలు విమర్శలతో గుక్కతిప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. మద్యం ధరలను తగ్గించక తప్పదని భావించింది. లిక్కర్ రేట్లను తగ్గిస్తామని.. సంకేతాలు ఇచ్చింది.

75 శాతం పెరిగిన లిక్కర్ రేట్..

75 శాతం పెరిగిన లిక్కర్ రేట్..


మధ్యం ధరలను తగ్గిస్తామని తీపి కబురు చెప్పింది. లాక్ డౌన్ తర్వాత మద్యంపై 75 శాతం ధరను పెంచిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రభుత్వం కారణం కూడా వివరించింది. క్రమంగా మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపింది. మద్యాన్ని పూర్తిస్థాయిలో నియంత్రణలోకి తీసుకొద్దామని అనుకొంది. ఇప్పటికే బెల్ట్ షాపులు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. మద్యం షాపులను కూడా తగ్గించింది. లిక్కర్ రేట్ పెంచితే.. కొనేందుకు సామాన్యులు ముందుకురారు అని భావించి.. నిర్ణయం తీసుకున్నది. కానీ పరిస్థితి తారుమారైంది. లిక్కర్ కొనుగోలు చేయని వారు.. శానిటైజర్లు తాగుతున్నారు. ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది.

ఎందుకు తాగుతున్నారంటే...? అధికారుల నివేదిక

ఎందుకు తాగుతున్నారంటే...? అధికారుల నివేదిక

లిక్కర్ ధర పెరగడం వల్లనే కొందరు శానిటైజర్ తాగుతున్నారని తెలిసింది. దీనిపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అక్రమంగా మద్యం రవాణా జోరుగా సాగుతోంది. ప్రతీ రోజు మద్యం పట్టుబడుతూనే ఉంది. అధికారుల నివేదికతో.. ఏం చేయాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచించింది. ఈ సమస్యలకు పరిస్కారం మద్యం ధర తగ్గించడమేనని ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. దీనిపై రెండు, మూడురోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Recommended Video

Gold Price Hike : Reason బంగారం, వెండి ధరలు మరికొంతకాలం పెరగొచ్చు? || Oneindia Telugu
30 నుంచి 40 శాతం వరకు తగ్గింపు..?

30 నుంచి 40 శాతం వరకు తగ్గింపు..?


అన్నీ అంశాలను పరిశీలించి లిక్కర్‌పై 30 నుంచి 40 శాతం వరకు మద్యం ధర తగ్గించే అవకాశం ఉంది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం వెలువరించే ఛాన్స్ ఉంది. అయితే 75 శాతం పెంచి 40 శాతం వరకు తగ్గించడంపై కొందరు పెదవి విరుస్తున్నారు. పెంచిన మొత్తం తగ్గిస్తే.. మందుబాబులు శానిటైజర్ల వంక చూడకపోవచ్చని చెబుతున్నారు. మరీ వీరి వినతిపై ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలీ మరీ.

English summary
liquor rate will be decrease in 30 to 40 per in Andhra pradesh state soon officials said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X