గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యరపతినేని, కోడెల, చింతమనేని అరాచకాలు బయటకు రాకుండా టీడీపీ రాద్దాంతం చేస్తోంది:అంబటి

|
Google Oneindia TeluguNews

ఛలో ఆత్మకూరు రగడ కొత్త మలుపు తీసుకుంది. ఆ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు నిరాకరించటంతో చంద్రబాబును..లోకేశ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. దీనికి నిరసనగా చంద్రబాబు 12 గంటల నిరహార దీక్షకు నిర్ణయించారు. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ ను ఖండించారు, టీడీపీ నేతల అరెస్ట్... గుంటూరు బాధితులకు ఆహారం వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ చంద్రబాబు 12 గంటల నిరహార దీక్షకు దిగారు. ఉదయం 8 గంటలకు తన నివాసంలో ప్రారంభించిన దీక్ష రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ మొత్తంగా దీక్షలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా చంద్రబాబు అభివర్ణించారు. బాధితులకు అండగా అందరూ నిరసనల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.ఇంట్లోనే నిరాహార దీక్ష చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు తాను పల్నాడుకు వెళతానంటూ బయటకొచ్చారు. దీంతో మరోసారి చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.

Live Updates: Chandrababu leaves for Atmakur a mid tension situation

Newest First Oldest First
2:45 PM, 11 Sep

చంద్రబాబు ఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు, ఇంటి సభ్యులకు ఆహారం, నీరును కూడా అనుమతించని ఖాకీలు
2:08 PM, 11 Sep

అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు రాగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
2:07 PM, 11 Sep

దుగ్గిరాలలో చింతమనేని ప్రభాకర్ అరెస్ట్
2:04 PM, 11 Sep

గనుల తవ్వకాల విషయంలో సీబీఐ విాచారణకు సిద్ధం : యరపతినేని శ్రీనివాసరావు
2:03 PM, 11 Sep

గుంటూరు : గృహనిర్బందంలో యరపతినేని శ్రీనివాసరావు
2:02 PM, 11 Sep

పల్నాడు వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు
2:02 PM, 11 Sep

శిబిరం నుంచి పల్లపాడు పీఎస్‌కు టీడీపీ నేతల తరలింపు
2:01 PM, 11 Sep

గుంటూరులో బాధితుల శిబిరాలు ఖాళీ చేయించిన పోలీసులు
1:14 PM, 11 Sep

ఐదేళ్లుగా పోలీసులను చంద్రబాబు ఎలా వినియోగించుకున్నాడో అందరికీ తెలుసు.. ఆయనలా మేము చేయలేము: అంబటి
1:14 PM, 11 Sep

పల్నాడును అభివృద్ధి చేసేందుకు జగన్ ముందుకెళుతున్నారు: పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
1:13 PM, 11 Sep

ప్రజల ముందు చంద్రబాబును ఎండగడుతాం:అంబటి రాంబాబు
1:12 PM, 11 Sep

యరపతినేని దౌర్జన్యంగా గనులను దోచేశారు: పిన్నెల్లి రామకృష్ణ
1:11 PM, 11 Sep

ఆత్మకూరుకు వెళతాం,వాస్తవాలను మీడియా ముందు ఉంచుతాం: అంబటి రాంబాబు
1:07 PM, 11 Sep

పల్నాడులో ఏమీ జరగలేదు.. ఏదో జరిగిపోయిందన్న కలరింగ్ ఇస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు: అంబటి రాంబాబు
1:07 PM, 11 Sep

యరపతినేని, కోడెల,చింతమనేనితో పాటు ఇతర టీడీపీ నేతలు చేసిన అరాచకాలు బయటకు రాకుండా చర్చను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు: అంబటి రాంబాబు
1:06 PM, 11 Sep

చంద్రబాబు నాయుడు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు: అంబటి రాంబాబు
1:05 PM, 11 Sep

మీడియా సమక్షంలో ఆత్మకూరుకు అనుమతి తీసుకుని వెళతాం: అంబటి రాంబాబు
1:05 PM, 11 Sep

చంద్రబాబుతో టీడీపీ బాధితులను మాట్లాడిద్దామనుకున్నాం, కానీ పోలీసులు అనుమతించలేదు: అంబటి రాంబాబు
1:04 PM, 11 Sep

మాపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు: అంబటి రాంబాబు
11:49 AM, 11 Sep

చంద్రబాబువన్నీ ముందస్తు డ్రామాలు, టీడీపీ హయాంలో జరిగిన హత్యలు, అరాచకాలు ఆయనకు గుర్తురాలేదా: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
11:47 AM, 11 Sep

చంద్రబాబు నివాసం వద్దకు బయలు దేరిన టీడీపీ నేత దేవినేని అవినాష్‌ను అరెస్టు చేసిన పోలీసులు
11:46 AM, 11 Sep

పోలీసులతో వాగ్వాదానికి దిగిన మాజీ మంత్రి నారాలోకేష్
11:44 AM, 11 Sep

వైసీపీ ప్రభుత్వం మానవహక్కులను ఉల్లంఘిస్తోంది, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోంది,ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను, పోలీసులను హెచ్చరిస్తున్నాను. ఇలాంటి రాజకీయాలు సరికాదు:చంద్రబాబు
11:40 AM, 11 Sep

శిబిరంలో ఉన్న బాధితులకు భోజనాలను అడ్డుకున్నారు: చంద్రబాబు
11:32 AM, 11 Sep

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు..పోలీస్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలు, నేతలు
11:30 AM, 11 Sep

నన్ను ఇంట్లో నిర్భంధించి ఛలో ఆత్మకూరును ఆపలేరు: చంద్రబాబు
11:29 AM, 11 Sep

మూడేళ్లలో జమిలి ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు కొత్త నాటకంకు తెరతీశారు: కాసు మహేశ్వర్ రెడ్డి
11:28 AM, 11 Sep

ఫ్రీగా వచ్చిందని ఫినాయిల్ కూడా వదలకుండా దోచుకున్నారు: కాసు మహేశ్వర్ రెడ్డి
11:28 AM, 11 Sep

హింసను ప్రోత్సహించడమే చంద్రబాబు ఉద్దేశం: కాసు మహేశ్వర్ రెడ్డి
11:26 AM, 11 Sep

నేతలను మా ఇంటికి రాకుండా అడ్డుకోవడం సరికాదు: చంద్రబాబు
READ MORE

English summary
Once again Tension atmosphere was created near AP opposition leader Chandrbabu's residence after he decided to visit contriversial Palnadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X