విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేనిఫెస్టోను ఒక బైబిల్‌లా ఒక ఖురాన్‌లా, ఒక భగవద్గీతలా చూడాలి: సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

    జగన్మోహన్ రెడ్డి అనే నేను... మరికాసేపట్లోCM గా ప్రమాణ స్వీకారం!! | Oneindia Telugu

    ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మ‌రి కొద్ది గంటల్లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. 2004, 2009 లో వైయ‌స్ ఏ విధంగా అయితే ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలో వ్య‌వ‌హ‌రించారో అదే విధంగా జ‌గ‌న్ సైతం ప్లాన్ చేసారు. ఎక్కువ ఆర్భాటం..హంగామా లేకుండా ప్ర‌మాణ స్వీకారం కోసం రెండు వేదిక‌ల‌ను సిద్దం చేసారు. ప్ర‌ధాన వేదిక మీద జ‌గ‌న్‌తో పాటుగా మరో ఇద్ద‌రు..మ‌రో వేదిక మీద ముఖ్య ఆహుతుల కోసం కేటాయిస్తున్నారు.

    ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ స‌రిగ్గా 30వ తేదీ మ‌ధ్యాహ్నం 12.23 గంట‌ల‌కు ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. విజ‌య‌వాడ మున్సిప‌ల్ స్టేడియంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్రమం కోసం ఇప్ప‌టికే జ‌గ‌న్ అనేక మంది ప్ర‌ముఖులను ఆహ్వానించారు. ఇక‌, ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ఇంటి నుండి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్టేడియం వ‌ద్ద‌కు 12 గంట‌ల‌కు చేరుకుంటారు.డియం ప్ర‌వేశం నుండి వేదిక వ‌ర‌కూ ఓపెన్ జీపులో రానున్నారు.

    Live Updates: Jagan Reddy to sworn in as new Chief Minister of Andhra Pradesh

    కార్య‌క్ర‌మానికి హాజ‌రైన అతిధులు..అభిమానులు..పార్టీ నేత‌ల‌కు అభివాదం చేస్తూ..వేదిక మీద‌కు చేరుకుంటారు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం స్వాగ‌తం ప‌లుకుతారు. 2009లో వైయ‌స్ ప్ర‌మాణ స్వీకారం కోసం ఎల్బీ స్టేడియం లోప‌ల‌కు ఇదే విధంగా ఓపెన్ జీపు లో వ‌చ్చే స‌మ‌యంలో జ‌గ‌న్ ప‌క్క‌నే ఉన్నారు.

    Newest First Oldest First
    3:43 PM, 30 May

    గన్నవరం నుంచి చెన్నైకు బయలుదేరిన డీఎంకే అధినేత స్టాలిన్
    3:43 PM, 30 May

    గన్నవరం నుంచి హైదరాబాదుకు బయలుదేరిన కేసీఆర్
    1:25 PM, 30 May

    స్టాలిన్‌ను కేసీఆర్‌ను సత్కరించిన కొత్త సీఎం జగన్
    1:24 PM, 30 May

    కొడుకు ప్రసంగం తర్వాత భావోద్వేగానికి గురైన వైయస్ విజయమ్మ
    1:22 PM, 30 May

    నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: సీఎం జగన్
    1:21 PM, 30 May

    ప్రజలు దేహీ అనే పరిస్థితి రాకూడదు... నా ప్రభుత్వంలో అందరూ నా ప్రజలే: సీఎం జగన్
    1:20 PM, 30 May

    ఎల్లో మీడియాకు జగన్ వార్నింగ్... పరువునష్ట దావా వేస్తాం జాగ్రత్త: సీఎం జగన్
    1:20 PM, 30 May

    పలు మీడియా వారికి చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రిగా ఇంపుగా కనిపిస్తారు: సీఎం జగన్
    1:19 PM, 30 May

    టెండర్ల ప్రక్రియలో హైకోర్టు సూచనలు తీసుకుంటాం: సీఎం జగన్
    1:17 PM, 30 May

    కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం: సీఎం జగన్
    1:16 PM, 30 May

    కాంట్రాక్టర్లు టెండర్‌లో ఎక్కువమంది పాల్గొనేలా చేస్తాం: సీఎం జగన్
    1:15 PM, 30 May

    రివర్స్ టెండరింగ్ ప్రాసెసింగ్ తీసుకొస్తాం: సీఎం జగన్
    1:15 PM, 30 May

    పాలనలో పూర్తిగా ప్రక్షాళన చేస్తాను.. అవినీతి లేకుండా చేస్తాను.అవినీతి జరిగి ఉంటే కాంట్రాక్టులను రద్దు చేస్తాం: జగన్
    1:12 PM, 30 May

    సొంత గ్రామాల్లో గ్రామ సెక్రటరీలు ఏర్పాటు చేస్తున్నాం ఆ గ్రామంలోని పదిమందికి ఉద్యోగాలు ఇస్తాం: జగన్
    1:12 PM, 30 May

    అక్టోబర్ 2వ తేదీకల్లా లక్ష 60వేల ఉద్యోగాలు : జగన్
    1:12 PM, 30 May

    ప్రభుత్వ పథకాలు అందకపోతే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ కనెక్ట్ అయ్యేలా కాల్‌సెంటర్
    1:11 PM, 30 May

    ఆగష్టు 15న కాల్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం: సీఎం జగన్
    1:11 PM, 30 May

    గ్రామ వాలంటరీలకు రూ.5వేలు జీతం ఇస్తాం: సీఎం జగన్
    1:11 PM, 30 May

    ఇందుకోసం గ్రామ వాలంటరీలను ఏర్పాటు చేస్తా: జగన్
    1:10 PM, 30 May

    ప్రభుత్వ పథకాలు నేరుగా డోర్ డెలివరీ చేస్తాం: సీఎం జగన్
    1:06 PM, 30 May

    వచ్చే ఏడాది 2500కు పెన్షన్ పెంచుతాం..చివరి ఏడాదికల్లా రూ.3వేలు చేస్తాం. మీ మనవడిగా మాట ఇస్తున్నాను: సీఎం జగన్
    1:05 PM, 30 May

    వృద్ధులకు పెన్షన్ రూ.2250 ఇస్తాం.. తొలి సంతకం పెన్షన్ పైనే పెడుతున్నా: జగన్
    1:04 PM, 30 May

    మేనిఫెస్టోను ఒక బైబిల్‌లా ఒక ఖురాన్‌లా, ఒక భగవద్గీతలా చూడాలి: సీఎం జగన్
    1:03 PM, 30 May

    ప్రతి కులానికి ఒక మేనిఫెస్టో ఉండకూడదు, ఎన్నికల తర్వాత మేనిఫెస్టో చెత్త కుప్పలో పడేసేది కాదు: సీఎం జగన్
    1:00 PM, 30 May

    అందరి ఆశలు, ఆశయాలను పరిగణలోకి తీసుకుంటూ రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాను: జగన్
    12:59 PM, 30 May

    మూడువేలకు పైగా పాదయాత్రలో పేదలు పడ్డ కష్టాలు చూశాను..వారి కష్టాలు విన్నాను.. మీకందరికీ నేను ఉన్నాను: జగన్
    12:58 PM, 30 May

    స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను: సీఎం జగన్
    12:57 PM, 30 May

    ఆకాశమంతటి విజయం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను: సీఎం జగన్
    12:57 PM, 30 May

    ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నాను: జగన్
    12:55 PM, 30 May

    వైయస్ కంటే మంచి పాలన అందించాలని మళ్లీ మళ్లీ మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను: కేసీఆర్
    READ MORE

    English summary
    Y.S. Jagan Mohan Reddy will be sworn-in asnew Chief Minister of Andhrapradesh on 30th May. Governor Narsimhan will administer the oath ceromony. All the arrangements have been made in this regard.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X