వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిలో సైకిల్ హవా, తెలంగాణలో కారు జోరు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జిల్లా, మండల ప్రజాపరిషత్ చైర్మన్ల ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ల పదవులను, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులను గెలుచుకోవడానికి తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పోటీ పడుతుండగా, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెసు పోటీ పడుతున్నాయి.

తెలంగాణలోని మున్సిపాలిటీల్లో 22 తెరాస, 1 కాంగ్రెసు, 4 టిడిపి, 3 బిజెపి, 1 మజ్లీస్ దక్కించుకున్నాయి. రెండు మున్సిపాలిటీల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

అదిలాబాద్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంది.

కరీంనగర్‌లో తెరాస 7, బీజేపి, కాంగ్రెస్ పార్టీలు ఒక్కో మున్సిపాలిటిని గెలుచుకున్నాయి.

నల్గొండ, సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా పడింది.

తెరాస గెలుచుకున్న మున్సిపాలిటీలు రామగుండం, కరీంనగర్, నిజామాబాద్

తెలంగాణలోని మూడు కార్పోరేషన్లలో రెండింటిని తెరాస గెలుచుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని 92 మున్సిపాలిటీల్లో 74 టిడిపి కైవసం కాగా, 17 మాత్రమే వైసిపి గెలుచుకుంది. ఒక్క మున్సిపాలిటీ మార్కాపురం ఎన్నిక వాయిదా పడింది.

చిత్తూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో వైసిపి, టిడిపి మూడేసి గెలుచుకున్నాయి.

కడప జిల్లాలోని మున్సిపాలిటీల్లో మూడు టిడిపికి, నాలుగు వైసిపికి వచ్చాయి.

కర్నూలు మున్సిపాలిటీల్లో టిడిపి ఐదు గెలుచుకోగా, వైసిపి మూడు గెలుచుకుంది.

అనంతపురం కార్పోరేషన్ సహా జిల్లాలోని 12 మున్సిపాలిటీలను కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ కారు జోరు మీదండగా, ఆంధ్రప్రదేశ్‌లో సైకిల్ జోరు కనిపించింది.

గుంటూరు జిల్లాలో తాడేపల్లిగూడెం మనిహా మిగతా 11 మున్సిపాలిటీలను టిడిపి కైవసలం చేసుకుంది.

నిజామాబాద్ జిల్లాలో రెండు మున్సిపాలిటీలను తెరాస, ఒక్క మున్సిపాలిటీని కాంగ్రెసు దక్కించుకున్నాయి.

కరీంనగర్ జిల్లాలో ఏడు మున్సిపాలిటీలను తెరాసను గెలుచకుంది. కాంగ్రెసుకు ఒక్కటి, బిజెపికి ఒక్కటి వచ్చాయి. రామంగుండం, కరీంనగర్ కార్పోరేషన్లపై తెరాస విజయకేతనం ఎగురవేసింది.

మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో నాలుగు తెరాస, రెండు కాంగ్రెసు దక్కించుకున్నాయి.

వరంగల్ జిల్లాలో తెరాస 3, కాంగ్రెసు ఒక్కటి దక్కించుకున్నాయి.

మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెసు ఐదు దక్కించుకోగా, తెరాస, బిజెపి, టిడిపి ఒక్కో మున్సిపాలిటీని గెలుచుకున్నాయి.

నల్లగొండ జిల్లాలో నాలుగు తెరాస, ఒక్కటి బిజెపి కైవసం చేసుకున్నాయి. నల్లగొండ, సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

టిడిపి విజయనగరం జిల్లాలో నాలుగు, విశాఖ జిల్లాలో రెండు మున్సిపాలిటీలను దక్కించుకుంది.

నెల్లూరు జిల్లాలో టిడిపి నాలుగు, కాంగ్రెసు ఒక్క మున్సిపాలిటీలను దక్కించుకున్నాయి.

ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని కార్పోరేషన్లను, మున్సిపాలిటీలను టిడిపి కైవసం చేసుకుంది.

ప్రకాశం జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలను టిడిపి, ఒక్క మున్సిపాలిటిని వైసిపి దక్కించుకున్నాయి.

కృష్ణా జిల్లాలో ఐదు టిడిపి, మూడు వైసిపి దక్కించుకున్నాయి.

భూపాలపల్లి - సంపూర్ణ (తెరాస)

అనంతపురం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.

నెల్లూరులో టిడిపి నాలుగు, వైసిపి ఒక్కటి దక్కించుకున్నాయి.

కృష్ణా జిల్లాలో ఐదు టిడిపి, మూడు వైసిపి దక్కించుకున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో టిడిపి మూడు, వైసిపి ఒక్కటి గెలుచుకున్నాయి.

రామగుండం కార్పోరేషన్ - కొంకర్ల లక్ష్మీనారాయణ (తెరాస)

నర్సంపేట - రాంచందర్ (కాంగ్రెసు)

సంగారెడ్డి - విజయలక్ష్మి (కాంగ్రెసు)

మెట్‌పల్లి- మర్రి ఉమారాణి (తెరాస)

వేములవాడ - ఉమ (బిజెపి)

ఆర్మూర్ - బబ్లూ (తెరాస)

ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకోగా, భెంసా మున్సిపాలిటీ మాత్రం మజ్లీస్ ఖాతాలో చేరింది.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్‌గా కాంగ్రెసుకు చెందిన వనమ్మ ఎన్నికయ్యారు.

పెద్దపల్లి - రాజయ్య (తెరాస)

జగిత్యాల - విజయ (కాంగ్రెసు)

కోరుట్ల - శీలం వేణు (తెరాస)

కరీంనగర్ కార్పోరేషన్ మేయర్‌గా తెరాసకు చెందిన రవీందర్ సింగ్ ఎన్నికయ్యారు.

ఆర్మూర్ - బబ్లూ (తెరాస)

కామారెడ్డి - సుష్మా (కాంగ్రెసు)

దేవరకొండ - కేసావత్ మంద్యానాయక్ (కాంగెర్సు)

కోదాడ - ఒంటిపులి అనిత (కాంగ్రెసు)

పరకాల - రాజభద్రయ్య (తెరాస)

అమలాపురం - మల్లేశ్వర రావు (టిడిపి)

ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ చైర్మన్‌గా భరత్ కుమార్ (తెరాస)

తాడేపల్లి - మహాలక్ష్మి (వైసిపి)

బొబ్బిలి - అచ్యుతవల్లి (టిడిపి)

ముమ్మిడివరం - శాంతకుమారి (టిడిపి)

చీరాల మున్సిపల్ చైర్మన్‌గా రమేష్ (టిడిపి)

సూర్యాపటే మున్సిపల్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది.

ఆర్మూర్ - బబ్లూ (తెరాస)

మెదక్ - మల్లికార్జున గౌడ్ (తెరాస),

బోధన్ - ఎల్లయ్య (తెారస)

కడప జిల్లా జమ్మలమడుగులో ఎన్నిక తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొెంది.

నిర్మల్ మున్సిపల్ చైర్మన్‌గా గణేష్ (తెరాస) ఎన్నికయ్యారు.

భూపాలపల్లి - సంపూర్ణ (తెరాస)

గుంటూరు - తాడేపల్లి హైమవతి (వైసిపి)

మిర్యాలగుడా మున్సిపల్ చైర్ పర్సన్‌గా కాంగ్రెసుకు చెందిన నాగలక్ష్మి ఎన్నికయ్యారు.

గద్వాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెసుకు చెందిన పద్మావతి ఎన్నికయ్యారు.

గుంటూరు జిల్లా వినుకొండ - జాన్‌బీ (సిపిఐ)

ఏలూరు కార్పోరేషన్ చైర్ పర్సన్‌గా టిడిపికి చెందిన నూర్జహాన్ విజయం సాధించారు.

భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్‌గా బిజెపికి చెందిన సుర్వి లావణ్య గెలిచారు.

రాజమండ్రి కార్పోరేషన్ మేయర్‌గా టిడిపికి చెందిన రజనీ శేషసాయి ఎన్నికయ్యారు.

Local bodies: Chairpersons election

భైంసా మున్సిపాలిటినీ మజ్లీస్ కైవసం చేసుకుంది.

కడప మేయర్‌గా వైసిపికి చెందిన సురేష్ బాబు కైవసం చేసుకున్నారు.

అనంతపురం కార్పోరేషన్ మేయరుగా టిడిపికి చెందిన స్వరూప దక్కించుకున్నారు.

స్థానిక సంస్థల మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను దక్కించుకుునే విషయంలో తెలంగాణలో తెరాస హవా సాగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి తన సత్తా చాటుతోంది.

ఇచ్చాపురం - రాజ్యలక్ష్మి (వైసిపి)

హుజూరునగర్ నగర పంచాయతీ చైర్మన్‌గా జక్కుల వెంకయ్య (కాంగ్రెసు) ఎన్నికయ్యారు.

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా రంగినేని మనీష (తెరాస) ఎన్నికయ్యారు

నారాయణపేట పురపాలక సంస్థ చైర్ పర్సన్‌గా అనుసూయ (బిజెపి) ఎన్నికయ్యారు.

కోరం లేక నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది.

జనగామ - హేమలతా రెడ్డి (తెరాస)

చిత్తూరు కార్పోరేషన్ చైర్ పర్సన్‌గా కఠారి అనురాధ (టిడిపి) ఎన్నికయ్యారు.

గజ్వెల్ మున్సిపల్ చైర్మన్‌గా భాస్కర్ (తెరాస) ఎన్నికయ్యారు.

మార్కాపురం ఎన్నిక రేపటికి వాయిదా పడింది

నాగర్ కర్నూలు - మోహన్ గౌడ్ (కాంగ్రెసు)

పార్వతీపురం - శ్రీదేవి

విజయనగరం - రామకృష్ణ

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గా రామస్వామి (తెరాస) ఎన్నికయ్యారు

గిద్దలూరు చైర్ పర్సన్‌గా వైసిపికి చెందిన సుబ్బమ్మ ఎన్నికయ్యారు.

ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఉషారాణి ఎన్నికయ్యారు

కనిగిరి - షేక్ మస్తాన్ (టిడిపి)

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ - సుద్దాల చంద్రయ్య

హుజురాబాద్ - విజయకుమారి (తెరాస)

మదనపల్లి - శివప్రసాద్ (టిడిపి)

విజయనగరం జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలను టిడిపి దక్కించుకుంది. నాటకీయ పరిణామాల మధ్య బొబ్బిలి మున్సిపాలిటినీ టిడిపి దక్కించుకుంది. ఆ రకంగా బొత్స సత్యనారాయణకు చెందిన విజయనగరం జిల్లాలో టిడిపి పాగా వేసింది.

ఖమ్మం జిల్లా కొత్తగూడెం పురపాలక సంస్థ చైర్మన్ పదవిని కాంగ్రెసుకు చెందిన పులి గీత కైవసం చేసుకున్నారు.

పాలకొండ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టిడిపికి చెందిన విజయనిర్మల దక్కించుకున్నారు.

మాచర్ల మున్సిపల్ చైర్ పర్సన్‌గా టిడిపికి చెందిన శ్రీదేవి ఎన్నికయ్యారు.

సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్‌గా తెరాసకు చెందిన పావని ఎన్నికయ్యారు.

ఆముదాలవలస నగరపాలక సంస్థ చైర్‌పర్సన్‌గా టిడిపికి చెందిన తమ్మినేని గీత ఎన్నికయ్యారు.

విజయవాడ మేయర్‌గా కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్‌గా గోగుల రమణారావు ఎన్నికయ్యారు.

గుంటూరు జిల్లా బాపట్ల చైర్‌పర్సన్‌గా తోట మల్లీశ్వరి, వైస్ చైర్మన్‌గా లేళ్ల రాము ఎన్నికయ్యారు.

శ్రీకాకుళం జిల్లా పలాస పురపాలక సంస్థ చైర్మన్‌గా టిడిపికి చెందిన కోత పూర్ణచంద్రరావు ఎన్నికయ్యారు.

సాలూరు పురపాలక సంస్థ చైర్‌పర్సన్‌గా టిడిపికి చెందిన విజయలక్ష్మి విజయం సాధించారు.

ఎంపిటిసి సభ్యుడు జానీని కిడ్నాప్ చేశారని కడప జిల్లా టిడిపి నాయకుడు రామసుబ్బారెడ్డి ధర్నాకు దిగారు.

అనంతపురం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విప్ జారీ చేసింది. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

Local bodies: Chairpersons election

కావలిని టిడిపి గెలుచుకునే అభ్యర్థి అలేఖ్య ఎన్నికయ్యారు.

నిజామాబాద్ మేయర్ అభ్యర్థిగా విశాలిని రెడ్డిని రంగంలోకి దించారు.

గుత్తి మున్సిపాలిటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా తెరాసకు చెందిన విద్యావతి ఎన్నికయ్యారు.

కడప జిల్లా జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. గాలిలోకి కాల్పులు జరిపారు. ఉద్రిక్తతల మధ్య చైర్ పర్సన్ ఎన్నిక జరగుతోంది. పోలీసులపైకి ఇరు వర్గాలు రాళ్లు రువ్వాయి.

సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తెరాసకు చెందిన పట్నం విజయలక్ష్మి ఎన్నికయ్యారు.

మంగళగిరి మున్సిపల్ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన గంజి చిరంజీవి ఎన్నికయ్యారు.

English summary
Election process of ZPP chairmen and Mandal presidents is going on in Andhra Pradersh and Telangana states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X